పవన్ కు ఆ పదవే కావాలంట?... బీజేపీ కండిషన్స్ ఇవే!
కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇక మిగిలింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కొలువుదీరడమే
By: Tupaki Desk | 10 Jun 2024 11:09 AM ISTకేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇక మిగిలింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కొలువుదీరడమే. ఈ సమయంలో ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరబోతున్న వేళ ఎవరెవరికి ఏయే పదవులు దక్కుతాయి.. అసలు ఎవరెవరు కేబినెట్ లో బెర్త్ లు దక్కించుకుంటారు అనేది కీలకంగా మారింది. ఈ సందర్భంగా ఒక పదవి కోసం పవన్ పట్టుబడుతున్నారని అంటున్నారు.
అవును... మరో రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 12 న ఉదయం 11 గంటలకు చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు! ఈ సమయంలో చంద్రబాబుతో పాటు ఎవరెవరు ప్రమాణస్వీకారం చేయబోతున్నారనే చర్చ నడుస్తున్న నేపథ్యంలో... పవన్ పోస్ట్ పై ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది.
జాతీయ మీడియాలో వస్తున్న కథనాల మేరకు... జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఉప ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబడుతున్నారట. పైగా ఆ పదవి తానొక్కడికే ఇవ్వాలని.. జగన్ సర్కార్ మాదిరి నలుగురైదుగురు ఉపముఖ్యమంత్రులు ఉండకూడదని అంటున్నారని తెలుస్తుంది. ఇదే సమయంలో... జనసేనకు కనీసం నాలుగు మంత్రి పదవులు కూడా ఇవ్వాలని పవన్ పట్టుబడుతున్నారని అంటున్నారు.
అయితే... ఈ విషయంలో చంద్రబాబు "నో" చేప్పారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ కష్టానికి చంద్రబాబు కచ్చితంగా ప్రతిఫలం ఇస్తారని అంటున్నారు. దీంతో... జనసేనలో ఎవరెవరు మంత్రి పదవుల రేస్ లో ఉన్నారనేది ఆసక్తిగా మారింది. ఇందులో భాగంగా... ముందుగా నాదేండ్ల మనోహర్ పేరు బలంగా వినిపిస్తుందని అంటున్నారు.
ఇదే సమయంలో... మండలి బుద్ధ ప్రసాద్, కొణతాల రామకృష్ణ, పులవర్తి అంజిబాబు, కందుల దుర్గేష్, అరణి శ్రీనివాసులు, పంచకర్ల రమేష్, బొమ్మిడి నాయకర్, దేవ వర ప్రసాద్ పేర్లు కూడా మంత్రిపదవుల రేస్ లో ఉన్నాయనే మాటలు వినిపిస్తున్నాయి! మరోవైపు చిరంజీవి, నాగబాబుల నుంచి సిఫార్సులు అందే అవకాశం ఉందని అంటున్నారు.
జనసేన సంగతి అలా ఉంటే... కేంద్రంలో రెండు కేబినెట్ బెర్త్ లు సంపాదించుకోవడంతో అటు వైపునుంచి కూడా చంద్రబాబుకు కండిషన్స్ వస్తున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా... బీజేపీకి రెండు మంత్రిపదవులు అడుగుతున్నారని సమాచారం! దీంతో... బీజేపీ నుంచి ఎవరెవరు మంత్రులు కాబోతున్నారనేలోపు పలు పేర్లు తెరపైకి వస్తున్నాయి.
ఇందులో భాగంగా... బీసీ కోటాలో ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ కు ఆ అవకాశం దక్కవచ్చని అంటున్నారు. ఇక మిగిలిన జనరల్ కోటాలో మంత్రిపదవికి హెవీ కాంపెటీషన్ ఉందని తెలుస్తుంది. ఈ క్రమంలో బలమైన పేర్లే తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా... కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
వీరితో పాటు ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిల పేర్లను లైట్ తీసుకోలేరని చెబుతున్నారు. ఏది ఏమైనా... చంద్రబాబు కేబినెట్ లో జనసేన నుంచి నలుగురు మంత్రులు, బీజేపీ నుంచి ఇద్దరు మంత్రులు ఉండబోతున్నారని మాత్రం నొక్కి చెబుతున్న పరిస్థితి. ఇక ప్రధానంగా పవన్ కల్యాణ్ - ఉపముఖ్యమంత్రి పదవిపై పట్టుబడుతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది.