Begin typing your search above and press return to search.

వైసీపీ మంత్రి... మాజీ మంత్రిని టార్గెట్ చేసిన పవన్...?

పవన్ కళ్యాణ్ దాదాపుగా నెలన్నర విరామం ప్రకటించి మరీ వారాహి నాలుగవ విడత యాత్రకు శ్రీకారం చుడుతున్నారు

By:  Tupaki Desk   |   27 Sep 2023 3:53 AM GMT
వైసీపీ మంత్రి... మాజీ మంత్రిని టార్గెట్ చేసిన పవన్...?
X

పవన్ కళ్యాణ్ దాదాపుగా నెలన్నర విరామం ప్రకటించి మరీ వారాహి నాలుగవ విడత యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. అది కూడా ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో ఈ యాత్ర సాగనుంది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖలో పవన్ వారాహి యాత్ర సాఫీగా సాగిపోయింది. పైగా అక్కడ జనసేనకు కొంత అనుకూలత ఉంది అన్నది తెలిసిందే.

అయితే ఈసారి మాత్రం పవన్ దక్షిణ కోస్తా వైపుగా వస్తున్నారు. ఉమ్మడి క్రిష్ణా జిల్లాలలో టూర్ పెట్టుకున్నారు. అందునా వైసీపీలో ఫైర్ బ్రాండ్ మాటల మరాఠీ అయిన పేర్ని నాని ఇలాకాలో పవన్ శంఖారావం పూరించనున్నారు అని అంటున్నారు. పేర్ని నాని వర్సెస్ పవన్ అన్నట్లుగా గత నాలుగేళ్లుగా ఏపీలో రాజకీయం సాగుతోంది.

పవన్ ఎపుడు ఎక్కడ ఏ మీటింగులో కానీ మీడియా ముందు కానీ మాట్లాడితే దానికి సరైన కౌంటర్ వేసేందుకు పేర్ని నాని రెడీగా ఉంటారు. మావోడు అంటూ పవన్ని బాగా కెలుకుతూంటారు. తాను ముద్దుగా పవన్ నాయుడు అని పిలుస్తానని మీడియాతో చెబుతూ ఉంటారు.

మా వోడికి తిక్క ఎక్కువ. లెక్క లేనే లేదు అని సెటైర్లు వేసే పేర్ని నాని బందరులో నాలుగవ విడత వారాహి యాత్రకు పవన్ రెడీ అవుతున్నారు. దాంతో ఈసారి పొలిటికల్ కాక ఒక లెవెల్ లో ఉంటుంది అని అంటున్నారు. అదెలా అంటే ఉభయ గోదావరి జిల్లాలలో కాకినాడలో ద్వారంపూడి మీద పవన్ చెలరేగిన తీరు, అలాగే ముద్రగడ పద్మనాభం వర్సెస్ పవన్ గా సాగిన తీరు, వాలంటీర్ల వ్యవస్థ మీద పవన్ చేసిన విమర్శలతో హై ఓల్టేజ్ పాలిటిక్స్ ని రాజేసిన భీమవరం నర్సాపురం యాత్రలలో సాగిన తీరు ఇపుడు కనిపించనుంది అంటున్నారు.

బందరులో పేర్ని నాని మీద పవన్ సెటైర్లు పేల్చినా కౌంటర్లు వేసినా మరుక్షణం వాటిని ఖండించేదుకు నాని రెడీగా ఉంటారన్నది తెలిసిందే. అయితే బహిరంగ సభలో పవన్ దూకుడుతో చేసే మాటలు ఏ రకమైన రాజకీయ సంఘర్షణకు దారి తీస్తాయన్నది చూడాలని అంటున్నారు. ఒక ఈసారి పవన్ సభలలో టీడీపీ హడావుడి కూడా ఎక్కువగా ఉంటుంది అని అంటున్నారు.

అదే విధంగా పెడన ఎమ్మెల్యే, మంత్రి జోగి రమేష్ ఇలాకాలో కూడా పవన్ వారాహి రధం ఆపి అక్కడ కూడా పవర్ ఫుల్ పంచులేస్తారు అని అంటున్నారు. జోగి రమేష్ అయితే నేరుగా పవన్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. ఆయన చాలా పరుషమైన పదజాలాన్నే పవన్ మీద వాడతారు. దానికి ప్రతిగా ఆయన నియోజకవర్గంలో మంత్రి వర్సెస్ జనసేనగా సీన్ మారిపోయింది. ఇపుడు జనసైనికులకు ఊతంగా పవన్ కూడా రంగంలోకి దిగి మంత్రి మీద మాటల దాడి చేస్తారు అని అంటున్నారు.

అది సైతం గోదావరి జిల్లాల మాదిరిగా పొలిటికల్ గా హీటెక్కించే రేంజిలోనే ఉంటుంది అని అంటున్నారు. చూడాలి మరి మంత్రిని, మాజీ మంత్రిని పవన్ టార్గెట్ చేస్తారు అన్న ప్రచారంతో ఏమి జరగనుందో. ఒకరు కాపు సామాజికవర్గానికి చెందిన నాయకుడు అయితే మరొకరు బీసీ నేత. ఈ ఇద్దరూ కూడా ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న వారే. దాంతో పవన్ సవాల్ చేసినా కౌంటరేసిన జవాబు చెప్పేందుకు ఢీ కొట్టేందుకు ఈ ఇద్దరు సదా సిద్ధంగా ఉంటారు అనే అంటున్నారు. సో అక్టోబర్ 1 నుంచి క్రిష్ణా రాజకీయం బిగ్ సౌండ్ చేయనుంది అనే అంటున్నారు.