Begin typing your search above and press return to search.

కాకినాడ పోర్టులో 'పవన్' తుఫాన్... ట్రెండింగ్ లో "సీజ్ ద షిప్"!

ఈ సందర్భంగా... "సీజ్ ద షిప్" అంటూ పవన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చిన వీడియో బైట్ నెట్టింట వైరల్ గా మారింది.

By:  Tupaki Desk   |   30 Nov 2024 4:40 AM GMT
కాకినాడ పోర్టులో పవన్ తుఫాన్... ట్రెండింగ్  లో సీజ్ ద షిప్!
X

శుక్రవారం ఉదయం నుంచి కాకినాడ తీరంలో "పవన్ తుఫాన్" చెలరేగింది. పేదలకు చెందాల్సిన బియ్యాన్ని కాకినాడ పోర్ట్ కేంద్రంగా కొంతమంది స్మగ్లింగ్ చేస్తున్నారంటూ పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కొండబాబుతో పాటు అధికారులపైనా పవన్ ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఈ అంశం నెట్టింట వైరల్ గా మారింది.

అవును... కాకినాడ పోర్టులో శుక్రవారం పవన్ కల్యాణ్ హల్ చల్ చేశారు. కాకినాడ పోర్టును అక్రమాలకు అడ్డాగా, స్మగ్లింగ్ కు కేరాఫ్ అడ్రస్ గా మార్చేశారంటూ నిప్పులు చెరిగారు. రేషన్ బియ్యం, గంజాయి, ఆయిల్ మాఫియా వెనుక ఎవరున్నా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఈ సందర్భంగా... ప్రభుత్వం పేదల ఆకలి తీర్చడానికి బియ్యం ఉచితంగా అందిస్తోందని తెలిపారు.

దీనికోసం కిలోకు రూ.43.50 ఖర్చవుతోందని.. అయితే ఈ బియ్యం స్మగ్లర్ల చేతిలోకి వెళ్లిపోతోందని.. వీటిని ఆఫ్రికా దేశాల్లో కేజీ రూ.70కి అమ్ముకుంటూ కోట్లు గడిస్తున్నారని ఫైరయ్యారు. ఈ సందర్భంగా... 640 టన్నుల రేషన్ బియ్యాన్ని కలిగి ఉన్న నౌకను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా... "సీజ్ ద షిప్" అంటూ పవన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చిన వీడియో బైట్ నెట్టింట వైరల్ గా మారింది. "సీజ్ ద షిప్" అనే చిన్న పదం ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ గా మారింది. కొన్ని వేల పోస్టులతో ఇప్పుడు ఈ పదం ఎక్స్ లో ఇండియా వైడ్ ట్రెండింగ్ లో ఉంది. ఇది పవన్ స్టామినాకు ఓ మచ్చు తునక అనే కామెంట్లను సొంతం చేసుకుంది.

దీంతో... కేవలం ఏపీ రాజకీయాల్లోనే కాదు.. జాతీయ స్థాయిలో సైతం పవన్ క్రేజ్ కి ఇదొక ఉదాహరణ అని అంటున్నారు పరిశీలకులు. ఇప్పుడు కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ ఎగుమతుల అంశం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో... ఏపీ రాజకీయాల్లో ఈ మార్కు స్టామినా పవన్ కు మాత్రమే సొంతమనే కామెంట్లు వినిపిస్తున్నాయి.