Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ డైరీ: జ‌రిగింది స‌రే.. జ‌ర‌గ‌బోయేదే ముఖ్యం!

ఆ నిధులు సుమారు 6 వేల కోట్ల‌కు పైగానే ఉన్నాయ‌న్న‌ది అంచ‌నా. దీనిని కేంద్రం చెప్ప‌లేదు. అప్ప‌టి జ‌గ‌న్ స‌ర్కారు బ‌య‌ట పెట్ట‌లేదు.

By:  Tupaki Desk   |   22 Jun 2024 3:45 AM GMT
ప‌వ‌న్ డైరీ: జ‌రిగింది స‌రే.. జ‌ర‌గ‌బోయేదే ముఖ్యం!
X

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్.. తాజాగా పంచాయ‌తీ నిధులపై ఆరా తీశారు. 15వ ఆర్థిక సంఘం నిధుల విష‌యంలో ఆయ‌న స్పందించారు. ఆ నిధులు సుమారు 6 వేల కోట్ల‌కు పైగానే ఉన్నాయ‌న్న‌ది అంచ‌నా. దీనిని కేంద్రం చెప్ప‌లేదు. అప్ప‌టి జ‌గ‌న్ స‌ర్కారు బ‌య‌ట పెట్ట‌లేదు. విడ‌త‌ల వారీగా కేంద్రం నుంచి వ‌చ్చాయి. అయితే.. ఈనిధుల‌ను జ‌గ‌న్ స‌ర్కారు దారి మ‌ళ్లించింద‌న్న‌ది 'వార్త‌'. దీనిపైనే ప‌వ‌న్ ఇప్పుడు ఆరా తీయ‌డం ప్రారంభించారు.

అయితే.. ఈ నిధుల విష‌యంలో ప్ర‌తి రాష్ట్రానికీ కేంద్రం కొన్ని నిబంధ‌న‌లు విధించింది. పంచయ‌తీల కు ఇచ్చే విద్యుత్‌లో కేంద్ర ప్ర‌భుత్వం స‌బ్సిడీ ఇస్తుంది. ఈ స‌బ్సిడీని మ‌రో రూపంలో తీసుకుంటుంది. దీనిని తిరిగి ఇవ్వాలంటూ.. గ‌త ఏడాది మార్చి చివ‌రలో అన్నిరాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను కూడా.. కేంద్రం ఆదేశించింది. లేక పోతే.. పంచాయ‌తీ నిధులు ఆపేస్తామ‌ని.. లేదా తామే తీసేసుకుంటామ‌ని పేర్కొంది. ఇక్క‌డ రాష్ట్రాలు ఇస్తే.. విడ‌త‌ల వారీగా కేంద్రం తీసుకుంటుంది.

లేక‌పోతే.. ఒకేసారి వెన‌క్కి లాగేసుకుంటుంది. ఈ వెసులు బాటు ఉండ‌డంతోనే రాష్ట్రాలు విడ‌త‌ల వారీగా బిల్లులు చెల్లిస్తాయి. ఏపీ స‌హా తెలంగాణ‌లోనూ ఇదే జ‌రిగింది. ఆ మ‌ధ్య డిసెంబ‌రులో అధికారం చేప‌డుతూనే.. సీఎం రేవంత్ కూడా.. ఇదే మాట చెప్పారు. పంచాయ‌తీ నిధుల‌ను మింగేశారు! అని! కానీ.. జ‌రిగింది వేరే. కేంద్రం ఆదేశాల‌తో అప్ప‌టి వ‌ర‌కు పంచాయ‌తీలు బ‌కాయి ఉన్న‌ నిధుల‌ను వెన‌క్కి ఇచ్చేశారు. అది కూడా.. మూడు విడ‌త‌ల చెల్లించారు. ఇంకా బ‌కాయిలు ఉన్నాయి.

సో.. ఇప్పుడు అధికారులు చెప్పినా.. ఇదే చెబుతారు. కాబ‌ట్టి.. అస‌లు పంచాయ‌తీల‌ను ఆర్థిక వ‌న‌రులుగా మార్చే ప్ర‌య‌త్నం చేయాల్సి ఉంది. ఆర్థికంగా అవి సెల్ఫ్ ఫైనాన్స్‌గా రూపాంతరం చెందితే.. నిధుల స‌మ‌స్యరాదు. ఈ విష‌యంలోనే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా.. విఫ‌ల‌మ‌య్యాయి. ఈ విష‌యంలో వెనుక‌బ‌డిన రాష్ట్రాలుగా ఉన్న బిహార్‌, యూపీ వంటివి ముందున్నాయి. అక్క‌డ ఈ స‌మ‌స్య‌లేదు. సో.. ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ చేయాల్సింది. సెల్ఫ్ గా పంచాయతీలు సంపాయించుకునే మార్గాల‌ను క‌ట్ట‌డి చేయ‌కుండా.. వాటికి చోద‌క శ‌క్తులు అందించ‌డ‌మే. ఇది చేయ‌డంపై దృష్టి పెడితే.. పంచాయ‌తీలు పుంజుకుంటాయి.