Begin typing your search above and press return to search.

తెలంగాణ క్యాబ్ డ్రైవర్లకు పవన్ కల్యాణ్ స్పెషల్ రిక్వస్ట్!

అవును... ఆల్ ఇండియా పర్మిట్ తో తెలంగాణ తాత్కాలిక పర్మిట్ తీసుకుని హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు క్యాబ్ లు నడుపుకుంటున్నారు!

By:  Tupaki Desk   |   7 Aug 2024 4:55 AM GMT
తెలంగాణ క్యాబ్  డ్రైవర్లకు  పవన్  కల్యాణ్  స్పెషల్  రిక్వస్ట్!
X

రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచీ పదేళ్ల పాటు హైదరాబాద్ అటు ఏపీ, ఇటు తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆ పదేళ్ల గడువు ఈ ఏడాది జూన్ తో ముగిసింది! ఈ నేపథ్యంలో రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు, వాటాలు, అప్పుల పంపిణీ సంగతి కాసేపు పక్కన పెడితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు చెందిన క్యాబ్ డ్రైవర్లకు చిక్కొచ్చి పడింది.

అవును... ఆల్ ఇండియా పర్మిట్ తో తెలంగాణ తాత్కాలిక పర్మిట్ తీసుకుని హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు క్యాబ్ లు నడుపుకుంటున్నారు! అయితే ఈ డ్రైవర్లకు ఇప్పుడు కొత్త సమస్య వచ్చిపడింది. ఇందులో భాగంగా... ఏపీకి చెందిన తమను తెలంగాణలోని క్యాబ్ డ్రైవర్లు అడ్డుకుంటున్నారని వాపోతున్నారు ఏపీ డ్రైవర్లు. తాజాగా ఈ విషయాన్ని పవన్ దృష్టికి తీసుకొచ్చారు.

దీంతో... ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా ఉమ్మడి రాజధాని గడువు తీరగానే ఏపీ క్యాబ్ డ్రైవర్లు హైదరాబాద్ లో ఉండకూడదంటూ తెలంగాణ వారు అడ్డుకోవడం సబబు కాదని అన్నారు. ఇలా అడ్డుకోవడం వల్ల సుమారు రెండు వేల కుటుంబాలు ఇబ్బదులు పడతాయని వెల్లడించారు.

ఇదే సమయంలో... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని పనులు మొదలుకాగానే ఇక్కడి డ్రైవర్లకు ఉపాధి మెరుగవుతుందని చెప్పిన పవన్... అప్పటి వరకూ సాటి డ్రైవర్లను మానవతా దృక్పథంతో చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా... తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చొరవ తీసుకుంటామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.