Begin typing your search above and press return to search.

రియల్ "పుష్ప"లపై పవన్ కల్యాణ్ యాక్షన్ స్టార్ట్!

అవును... రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, గ్రామీణ తాగునీటి సరఫరా, పర్యావరణం, శాస్త్ర సాంకేతికశాఖల మంత్రిగా ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బుధవారం బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 Jun 2024 12:10 PM GMT
రియల్ పుష్పలపై పవన్  కల్యాణ్  యాక్షన్  స్టార్ట్!
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, కీలక శాఖలకు మంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు మొదలైనవారి కోలాహలం నడుమ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ క్రమంలో తొలిరోజు 10 గంటల పాటు ఆయన పనిలోనే గడిపారు.

అవును... రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, గ్రామీణ తాగునీటి సరఫరా, పర్యావరణం, శాస్త్ర సాంకేతికశాఖల మంత్రిగా ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బుధవారం బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా... ఆయన అటవీ, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన రెండు కీలక ఫైళ్లపై తొలి సంతకాలు చేశారు!

ఇందులో భాగంగా... తొలిసంతకాన్ని ఉద్యాన పంటలకు ఉపాధి హామీ పథకం అనుసంధానం చేసే ఫైల్ పై చేయగా... గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి సంబంధించిన మరో ఫైల్ పై రెండో సంతకం చేశారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ నిధులు, గ్రామాల్లో వాస్తవ ఖర్చుల వివరాలు అడిగి తెలుసుకున్నారు!

ఈ నేపథ్యంలో అటవీ శాఖపైనా కీలక దృష్టి కేంద్రీకరించిన పవన్... ప్రధానంగా ఎర్రచందనం స్మగ్లింగ్ ను నియంత్రించాలని కంకణం కట్టుకున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే అటవీ, పర్యావరణ శాఖలపై ప్రత్యేక దృష్టి సారించాలని పవన్ భావిస్తున్నారని అంటున్నారు. దీంతో... అటవీశాఖ విషయంలో పవన్ ఫస్ట్ టార్గెట్ రియల్ "పుష్ప"లే అన్నమాట అనే చర్చ మొదలైంది.

ఇక పర్యావరణం విషయానికొస్తే... ప్రధానంగా గ్లోబల్ వార్మింగ్, నేల కోత, కాలుష్యం వంటి విషయాలపై పవన్ ప్రధానంగా దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని పాలనలో ఒక పెద్ద ప్రణాళికతో ముందుకు వెళ్లాలని పవన్ భావిస్తున్నారని అంటున్నారు. ఇలా తనకు నచ్చిన, తనకు ఇచ్చిన మంత్రిత్వ శాఖలపై పవన్ కల్యాణ్ తనదైన ముద్రవేస్తూ ముందుకు కదలాలని భావిస్తున్నారని చెబుతున్నారు.