Begin typing your search above and press return to search.

పొత్తుల గురించి అపుడే పవన్ తేల్చుకుంటారా...?

పొత్తుల విషయం అయితే బీజేపీ జనసేన ఈసారి సీట్లతో కాకుండా అధికారంలో సైతం వాటాను కోరే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయని అంటున్నారు.

By:  Tupaki Desk   |   26 Aug 2023 7:29 PM GMT
పొత్తుల గురించి అపుడే పవన్ తేల్చుకుంటారా...?
X

ఏపీలో పొత్తుల కధ ఎపుడు తేలుతుంది అంటే దానికి చాలా టైం ఉంది అన్నది ప్రస్తుతానికి వినిపిస్తున్న మాట. పొత్తులు కుదరాలంటే ముందు సీట్ల దగ్గర పేచీలు తీరాలి. అపుడే పొత్తుల కధ ఒక కొలిక్కి వస్తుంది అని అంటున్నారు. ఏపీలో బీజేపీ జనసేన కలిసే ఉంటున్నాయి. ఏపీలో బీజేపీకి జనసేన జనాకర్షణ. కచ్చితమైన ఓటు బ్యాంక్ శ్రీ రామరక్షగా ఉంటే జనసేనకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉండటం భరోసాను ఇస్తోంది అని అంటున్నారు.

ఈ రెండు పార్టీలు విడిగా ఉంటే టీడీపీ జూనియర్ పార్టనర్స్ కింద లెక్క కడుతుంది. అందుకే కలసికట్టుగానే పొత్తు బేరాలకు వస్తాయని అంటున్నారు. దానికి చాలా టైం ఉంది అని అంటున్నారు. ఇప్పటికైతే పవన్ కళ్యాణ్ మూడు జిల్లాలలో వారాహి యాత్రను ముగించారు. ఈ మూడు జిల్లాలలో జనాల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది అని అంటున్నారు.

దాంతో మిగిలిన జిల్లాలలో సైతం వారాహి యాత్రను పూర్తి చేయాలని పవన్ పట్టుదలగా ఉన్నారని అంటున్నారు. అన్ని జిల్లాలలో వారాహి రధం తిరిగిన తరువాత తన పార్టీ బలం మీద బలగం మీద పవన్ కి పూర్తి స్థాయిలో అవగాహన వస్తుంది అని అంటున్నారు. అపుడే సీట్ల పంచాయతీ పొత్తుల విషయం ఆయన ఎవరితో అయినా ప్రస్తావిస్తారు అని అంటున్నారు.

ఇక జనసేనలో కూడా కొత్త ఉత్సాహం తొణికిసలాడుతోంది అని అంటున్నారు. టీడీపీతో పొత్తులు పెట్టుకున్నా ఓకే కానీ గౌరవప్రదంగా ఉండాలనే ఆ పార్టీలో అంతా భావిస్తున్నారు గౌరవ ప్రదమైన సీట్లు అంటే కచ్చితంగా యాభైకి తక్కువ కాకుండా ఉండాలనే అంటున్నారు. మరి అన్ని సీట్లకు టీడీపీ ఒప్పుకుంటుందా అన్నది ఒక చర్చగా ఉంది.

అసలే టీడీపీలో ఒక బలమైన లాబీయింగ్ నుంచి అధినేత చంద్రబాబు మీద వత్తిడి పెరుగుతోంది. టీడీపీకి ఏపీలో బలం పెరిగిందని, పొత్తుల పేరుతో భారీగా సీట్లను ఇచ్చి నష్టపోవద్దని, ప్రజలు కచ్చితంగా టీడీపీ వైపే ఉన్నారని చెబుతున్నారుట. పొత్తులు కనుక ఉంటే అతి తక్కువ సీట్లకే పరిమితం కావాలని కూడా కండిషన్లు పెడుతున్నారుట.

ఈ నేపధ్యంలో వచ్చిన ఇండియా టు డే సర్వేను చూసిన ఈ లాబీయింగ్ పెద్దలు ఇక అసలు ఎవరితోనూ పొత్తులు వద్దే వద్దని అంటున్నారుట. అంటే సింగిల్ గానే చంద్రబాబు పోటీకి రెడీ అవాలని కచ్చితంగా విజయం తమ వైపు ఉంటుందని కూడా అంటున్నారుట. అయితే సింగిల్ గా వెళ్తే మాత్రం మళ్లీ వైసీపీయే అధికారంలోకి వస్తుందని అంటున్న వారూ ఉన్నారు.

పొత్తుల విషయం అయితే బీజేపీ జనసేన ఈసారి సీట్లతో కాకుండా అధికారంలో సైతం వాటాను కోరే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే ఏపీలో బీజేపీకి పోయేదేమీ లేదు, టీడీపీ కాకపోతే వైసీపీ మద్దతు ఇస్తుంది. ఆ ధీమా కమలానికి ఎటూ ఉంది. ఇక జనసేన ఆలోచనలలో కూడా ఇటీవల కాలంలో మార్పులు వచ్చాయని అంటున్నారు.

తమకున్న బలంతో జనసేన ఈసారి కచ్చితంగా కొన్ని సీట్లు గెలుచుకోగలదన్న విశ్వాసం ఉంది. పైగా పవన్ పాతికేళ్ల రాజకీయానికి సిద్ధపడే వచ్చారని అంటున్నారు. దాంతో ఆయనకు వెంటనే అధికారం అన్న మోజూ బాధా లేవని అంటున్నారు. అదే టీడీపీ ముందుకు వస్తే మాత్రం కచ్చితంగా అధికారంలో వాటాకే పట్టుబడతారు అని అంటున్నారు. ఇక ఈ రెండు పార్టీల కంటే డూ ఆర్ డై సమస్య అయితే టీడీపీకే ఉందని అంటున్నారు.

ఈ ఎన్నికల్లో టీడీపీ ఓడితే మాత్రం రానున్న కాలంలో ఆ పార్టీ ఉనికికే ముప్పు వాటిల్లక తప్పదన్న బెంగలూ ఉన్నాయి. దాంతో టీడీపీ కోర్టులోనే పొత్తు బందిని వదిలేసి బీజేపీ జనసేన బేఫికర్ గా ఉన్నాయని అంటున్నారు. పవన్ సైతం వారాహి యాత్ర, తన పార్టీ బలాన్ని పెంచుకునే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. మొత్తానికి సర్వేలు టీడీపీకి ఎడ్జ్ ఉందని అంటున్నా సింగిల్ గా వెళ్లే ధైర్యం ఆ పార్టీ చేస్తుందా అన్నదే ఇపుడు పెద్ద ప్రశ్నగా ఉంది చూడాలి మరి ఏమి జరుగుతుందో.