Begin typing your search above and press return to search.

కొణతాల ఇంటికి పవన్..నాగబాబు కోసమేనా...!?

ఇపుడు కొణతాల ఇంటికి స్వయంగా పవన్ వెళ్లారు అంటే జనసేనలో ఆయనకు కీలకమైన పాత్ర ఇస్తున్నట్లే అంటున్నారు.

By:  Tupaki Desk   |   19 Feb 2024 3:54 AM GMT
కొణతాల ఇంటికి పవన్..నాగబాబు కోసమేనా...!?
X

అనకాపల్లి ఎంపీ టికెట్ ఆశతో జనసేనలో చేరిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఇంటికి రోజుల వ్యవధిలో మెగా బ్రదర్స్ వెళ్లారు. ముందుగా నాగబాబు వెళ్ళి ఆయనతో ముచ్చటించారు. ఆయన మనసులో ఏముందో తెలుసుకున్నారు. పవన్ కి అలా చేరవేసి ఉంటారు అని భావిస్తున్నారు.

దాంతో విశాఖలో రెండు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన జనసేన అధినేత వస్తూనే కొణతాల రామక్రిష్ణతో భేటీ వేశారు. ఈ సందర్భంగా ఇద్దరు చాలా విషయాలు మాట్లాడుకున్నారు అని అంటున్నారు. అనకాపల్లి నుంచి నాగబాబు పోటీ చేస్తారు అని ప్రచారం సాగుతున్న నేపధ్యంలో రెండు సార్లు ఎంపీగా అనకాపల్లి నుంచి గెలిచిన కొణతాల రామక్రిష్ణను కలుసుకోవడం రాజకీయంగా చర్చకు తావిస్తోంది.

కొణతాల రామక్రిష్ణకు మంచి పేరు ఉంది. ఆయన నిజాయతీపరుడు అన్న ముద్ర ఉంది. పైగా పవన్ కళ్యాణ్ కూడా ఆయన అంటే ఇష్టపడతారు. ఇపుడు కొణతాల ఇంటికి స్వయంగా పవన్ వెళ్లారు అంటే జనసేనలో ఆయనకు కీలకమైన పాత్ర ఇస్తున్నట్లే అంటున్నారు.

నాగబాబు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే కొణతాల మద్దతు చాలా కీలకం అవుతుంది. కొణతాల అన్నీ తాను అయి చూసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ విషయలు ఏమైనా చర్చించి ఉంటారా అన్నది కూడా అంతా అనుకుంటున్నారు.

కొణతాల రామక్రిష్ణ ఇపుడు అనకాపల్లి రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు అని అంటున్నారు. అయిదేళ్ళ పాటు రాజకీయంగా అజ్ఞాతంలో కూడా కూడా కొణతాల రాజకీయ హవా తగ్గలేదు అని ఆయన అనుచరులు అంటున్నారు.

ఇదిలా ఉంటే జనసేన అధినేత పవన్ కొణతాలను కలవడం మర్యాదపూర్వకమైన భేటీగానే ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జనసేనలో కొణతాల వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింన నేపధ్యం ఒక వైపు ఉంది. అదే టైం లో కొణతాల అనకాపల్లి పార్లమెంటు స్థానం బరిలో దిగుతారని వార్తలు ఉన్నాయి.

తాజాగా అనకాపల్లి ఎంపీ బరిలో నాగబాబు పేరు కూడా తెరపైకి వచ్చింది. దీనిపై జనసేన అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలని అంటున్నారు. ఏది ఏమైనా కొణతాల ఈసారి అనకాపల్లి రాజకీయాల్లో చక్రం తిప్పుతారా అంటే జరుగుతున్న పరిణామాలు అవును అని అంటున్నాయి. ఆయన ఇంటికే అధినేతలు అంతా క్యూ కడుతున్న పరిస్థితి ఇపుడు కనిపిస్తోంది.