పవన్ డేట్ ఆఫ్ బర్త్ కన్ఫ్యూజన్ లో ఉందా...?
మరి ఆయన బాపట్లలో పుట్టినట్లుగా ఉంది. విద్యా సంబంధ విషయాలు మాత్రం వికీ పీడియాలో ఎక్కడా చూపించలేదు
By: Tupaki Desk | 7 Nov 2023 5:30 PM GMTపవన్ కళ్యాణ్ టాలీవుడ్ హీరో. ఆయన పొలిటీషియన్ గా కూడా ఉన్నారు. తెలుగు రాష్ట్రాలలో ప్రముఖుడుగా ఉంటూ వస్తున్న పవన్ కళ్యాణ్ డేట్ ఆఫ్ బర్త్ విషయంలో కన్ఫ్యూజన్ ఉందా అన్న చర్చ అయితే సాగుతోంది. ఎందుకంటే వికీ పీడియాలో రెండు ఇయర్స్ ఆయన వివరాలలో కనిపిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ 1968 సెప్టెంబర్ 2న పుట్టారని ఉంది. అలాగే 1971లో పుట్టారని కూడా ఉంది. మరి ఈ రెండింటిలో ఏది నిజం అన్న చర్చ అయితే సాగుతోంది. పవన్ కళ్యాణ్ మామూలు మనిషి కాదు ఫిలిం సెలిబ్రిటీ, అలాగే రాజకీయ నేత.
మరి ఆయన బాపట్లలో పుట్టినట్లుగా ఉంది. విద్యా సంబంధ విషయాలు మాత్రం వికీ పీడియాలో ఎక్కడా చూపించలేదు. ఇక పవన్ సినిమాల గురించి ఆయన రాజకీయాలలో పాలు పంచుకున్న తీరు గురించి ఆయన ఇతర విషయాల గురించి అన్నీ ఉన్నాయి.
అయితే పవన్ పుట్టిన సంవత్సరం విషయంలో మాత్రం ఒక పెద్ద కన్ఫ్యూజన్ ని వికీ పీడియా క్రియేట్ చేసింది. ఇంతకీ పవన్ పుట్టింది 1968లోనా లేక 1971లోనా అన్నది అయితే ఎవరికీ తెలియదు. ఆ విషయం పవన్ కానీ ఆయన ఇంట్లో వారు కానీ చెప్పాలి. మరి వికీ పీడియా మాత్రం రెండు ఏడాదులను ఇచ్చింది.
నిజంగా చూస్తే ఎక్కడా అలా ఉండదు, ఎందరో ప్రముఖులు వికీ పీడియాలో ఉన్నారు. అయితే వారి బర్త్ ఇయర్స్ మాత్రం ఒకటే చూపిస్తున్నాయి. అందులో ఏమైనా కాట్రవర్సీ ఉంటే ఉండొచ్చు కానీ చూపించేంది మాత్రం అక్కడ ఒక్కటే. కానీ పవన్ విషయం ఈ తేడా ఎందుకు అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
పవన్ 1968లో పుడితే మాత్రం ఆయన వయసు ఇపుడు 55 ఏళ్లు. అదే 1971లో పుడితే 52 ఏళ్ళు. అంటే మూడేళ్ల తేడా ఉంది అన్న మాట. ఇక పవన్ తన పుట్టిన ఏడాది ఫలానా అని ఎక్కడా చెప్పకపోయినా ఆయన ప్రజలలోకి వచ్చాక చాలా విషయాలు చెప్పుకొచ్చారు. తాను ఫలానా చోట చదువుకున్నానని, తాను ఇంటర్ ఫెయిల్ అయ్యాయని టెన్త్ కూడా తాను అప్పట్లో గ్రేస్ మార్కులతో పాస్ అయ్యాయని చెప్పుకొచ్చారు
ఇక 1984లో ఎన్టీయార్ ని కూలదోసి నాదెండ్ల భాస్కరరావు ఏపీకి సీఎం అయ్యారు. ఆ టైం లో ఆయన 1984 బ్యాచ్ లో ఫెయిల్ అయిన టెన్త్ విద్యార్ధులకు పది గ్రేస్ మార్కులు ఇచ్చి పాస్ చేయించారు. అది కూడా ఒక సందర్భంలో పవన్ చెబుతూ అలా తాను టెన్త్ పాస్ అయ్యాయని చెప్పినట్లుగా ప్రచారంలో ఉంది.
మరి 1984లో ఆయన పదవతరగతి పూర్తి చేస్తే కచ్చితంగా 1968 లోనే పుట్టింది కరెక్ట్ అనుకోవాలి. ఎందుకంటే 1971 అయితే మాత్రం అప్పటికి 13 ఏళ్ళు మాత్రమే అవుతుంది. ఆ మధ్యన వైసీపీ మంత్రి రోజా పవన్ మీద విమర్శలు చేస్తూ జగన్ కంటే పవన్ పెద్ద అని అయినా ఇప్పటికీ ఎమ్మెల్యే కాలేకపోయారు అని సెటైర్లు వేశారు. ఈ సందర్భంగా పవన్ ఏజ్ ని కూడా ఆమె ప్రస్తావించారు. యాభై అయిదేళ్ళు వచ్చాయి అయినా రాజకీయాల్లో ఏమీ సాధించలేదని ఆమె అన్నారు.
దీని బట్టి చూస్తే ఇక్కడ కూడా 1968నే ఆమె ప్రమాణంగా తీసుకుని ఈ విమర్శలు చేసినట్లుగా ఉంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే పవన్ 1996లో సినీ హీరోగా అరంగేట్రం చేశారు. ఆయన హీరో అయ్యేనాటికి పాతికేళ్లు ఉండాలన్న రూల్ మరి ఆ రోజులల్లో ఉంది కాబోలు అందుకే అలా 1971ని తీసుకుని వచ్చి బర్త్ ఇయర్ మార్చారా అన్న చర్చ కూడా వస్తోంది. ఏది ఏమైనా పవన్ పుట్టిన సంవత్సరాలు ఇంత పెద్ద కంఫ్యూజన్ అయితే వేరే ఎవరి మీద లేనంతగా ఉంది.
రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉన్న వారి వ్యక్తిగత విషయాలు అందరికీ ఆసక్తి ఉంటుంది కాబట్టి పవన్ బర్త్ ఇయర్ మీద ఇంత చర్చ సాగుతోంది అని అంటున్నారు. మొత్తానికి పవన్ బర్త్ ఇయర్ విషయంలో కూడా కంఫ్యూజన్ కొనసాగడమే కొసమెరుపు.