పవన్‌కు కొత్త ప్లేస్ వద్దు... ఆ రెండు నియోజకవర్గాలే సేఫ్...!
ఇక, తిరుపతి నుంచి అయితే బెటర్ అని.. విశాఖ ఉత్తరం సేఫ్ అని.. ఇలా అనేక చర్చలు తెరమీదికి వచ్చాయి. దీనిలో దేనికీ కూడా.. పవన్ రియాక్ట్ కాలేదు.
By: Tupaki Desk | 15 Aug 2023 5:30 PM GMTఎన్నికలకు సమయం చేరువ అవుతోంది. ఈ క్రమంలో టికెట్ల విషయంపై అన్ని ప్రధాన పార్టీల్లోనూ చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. ఈ సారి జనసేన అధినేత పవన్ గెలిచి తీరాలనే లక్ష్యం నిర్దేశించుకు న్న అందరికీ తెలిసిందే. అయితే.. ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తే బెటర్ అనేది కొన్నాళ్లుగా జరుగుతు న్న చర్చ. మధ్యలో కొన్ని రోజులు ఈ చర్చకు తెరపడినా.. తాజాగా వారాహి యాత్ర 3.0 తర్వాత మరోసారి ఇది చర్చకు వచ్చింది.
ఇక, తిరుపతి నుంచి అయితే బెటర్ అని.. విశాఖ ఉత్తరం సేఫ్ అని.. ఇలా అనేక చర్చలు తెరమీదికి వచ్చాయి. దీనిలో దేనికీ కూడా.. పవన్ రియాక్ట్ కాలేదు. ఇక, ఇప్పుడు పార్టీలో అభిమానులు, నాయకులు మరో చర్చకు తెరదీశారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన రెండు నియోజకవర్గాల నుంచి ఇప్పుడు మరోసారి పవన్ పోటీ చేయడం బెటర్ అని అంటున్నారు. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పవన్ పోటీ చేసిన విషయం తెలిసిందే.
గాజువాకలోను, భీమవరంలోనూ ఆయన ఓడిపోయారు. అయితే.. ప్రస్తుతం ఈ రెండు నియోజకవర్గాలను వదులుకోవడం కంటే కూడా.. వాటిపైనే ఎక్కువగా కాన్సన్‌ట్రేట్ చేస్తే.. గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమ ని అంటున్నారు.తాజాగా పాతగాజువాక జంక్షన్‌లో నిర్వహించిన వారాహి యాత్రకు ఇసకేస్తే రాలనంతగా అభిమానులు, ప్రజలు తరలి వచ్చారు. అంటే.. పవన్‌పై సింపతీ ఏర్పడిందని.. అందుకే ఇలా వచ్చారని పార్టీలో చర్చ సాగుతోంది.
సో.. వచ్చే ఎన్నికల్లో కనుక ఇదే నియోజకవర్గం నుంచి పవన్ పోటీ చేస్తే.. గెలుపు ఖాయమని వారు అంటున్నారు. అయితే.. గత ఎన్నికల్లో ఇక్కడ 24 వేల ఓట్ల తేడాతో పవన్ పరాజయం పాలయ్యారు. అదేభీమవరం అయితే.. ఇంకా సేఫ్ అవుతుందని మరికొందరు అంటున్నారు. ఇక్కడ కేవలం 6 వేల వోట్ల తేడాతోనే ఆయన ఓడిపోయారని.. ఇప్పుడు ఇక్కడ కూడా సింపతీ పెరిగిన నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా పవన్ గెలుపును రాసిపెట్టుకోవచ్చని అంటున్నారు పార్టీ నాయకులు.