Begin typing your search above and press return to search.

'ప‌వ‌ర్' త‌గ్గుతున్న పాలిటిక్స్.. స‌ల‌హాలిచ్చేవారు లేరా? ఇచ్చినా తీసుకోవ‌ట్లేదా?

రాజ‌కీయాల్లో ఎంత మెలితిరిగిన మేధావి అయినా.. అంతో ఇంతో ఇత‌రులు లేదా పార్టీలో కీల‌క నాయ‌కు లు ఇచ్చే స‌ల‌హాలు తీసుకుంటారు.

By:  Tupaki Desk   |   29 Dec 2023 3:30 PM GMT
ప‌వ‌ర్ త‌గ్గుతున్న పాలిటిక్స్.. స‌ల‌హాలిచ్చేవారు లేరా?  ఇచ్చినా తీసుకోవ‌ట్లేదా?
X

రాజ‌కీయాల్లో ఎంత మెలితిరిగిన మేధావి అయినా.. అంతో ఇంతో ఇత‌రులు లేదా పార్టీలో కీల‌క నాయ‌కు లు ఇచ్చే స‌ల‌హాలు తీసుకుంటారు. వాటి ప్ర‌కారం అడుగులు వేస్తారు. కాక‌లు తీరిన నాయ‌కులుగా పేరు న్న వారు కూడా ఇదే పంథాను అనుస‌రించారు. ఇక‌, ఇప్పుడున్న పార్టీలైతే.. ఏకంగా ఐఐటీలు, ఇంట‌ర్నే షనల్ కోర్సులు చేసిన వారిని త‌మ‌కు వ్యూహ‌క‌ర్త‌లుగా, స‌ల‌హాదారులుగా నియ‌మించుకుంటున్నారు.

మూస ధోర‌ణికి భిన్నంగా.. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునేందుకు, ప్ర‌జ‌ల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు వ్యూహ‌క ర్త‌లు చెప్పిన సూచ‌న‌లు, స‌ల‌హాల‌ను పాటిస్తున్నారు. ఈ క్ర‌మంలో వైసీపీ, టీడీపీలు పోటీ ప‌డుతున్నా యి. ఇరు పార్టీల‌కూ బ‌ల‌మైన వ్యూహ‌క‌ర్త‌లు ఉన్నార‌న్న విష‌యం తెలిసిందే. ఇక‌, పూర్తిస్థాయిలో రాజ‌కీ యాలు చేస్తున్న వైసీపీ , టీడీపీ అధినేత‌లు కూడా.. వారి సొంత‌ వ్యూహాలు తెర‌మీదికి తెచ్చి అమ‌లు చేస్తున్నారు.

కానీ, ఏపీలో అధికారంలోకి వ‌చ్చేస్తామ‌ని.. వైసీపీని ఇంటికి పంపేస్తామ‌ని ప‌దే ప‌దే చెబుతున్న ప‌వ‌ర్ స్టార్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీ ప‌రిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఈ పార్టీకి స‌ల‌హాలు ఇచ్చేవా రు కానీ.. సూచ‌న‌లు చేసే వారు కానీ.. ఎక్క‌డా ఉన్న‌ట్టుగా క‌నిపించ‌డం లేదు. పోనీ.. ఉన్న‌వారెవ‌రైనా స‌ల‌హాలు ఇస్తున్నా.. తీసుకుంటున్నారా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తాజాగా సోష‌ల్ మీడియాలో జ‌న‌సేన నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఇద్ద‌రు కీల‌క నాయ‌కులు చేసిన వ్యాఖ్య‌లు పార్టీ ప‌రిస్థితికి అద్దం పడుతున్నాయి.

'అలా కాదు. ఇలా ముందుకు సాగుదాం. అని మేం చెప్పాం. ఎన్నిక‌ల స‌మ‌యానికి.. పొత్తుల గురించి ఆలోచిద్దాం. ముందు పార్టీని బ‌లోపేతం చేసుకుందాం. ప్ర‌జ‌ల్లో విశ్వ‌స‌నీయ‌త‌ను పెంచుకుందాం అని చెప్పాం. కానీ, మా మాట విన్న‌వారు.. ప‌ట్టించుకున్న‌వారు కూడా క‌నిపించ‌లేదు' అని వ్యాఖ్యానించారు. ఇద్ద‌రు నేత‌ల‌దీ.. ఇదే ప‌రిస్థితి. సో.. దీనిని బ‌ట్టి.. జ‌న‌సేన‌కు స‌ల‌హాలు ఇచ్చేవారు లేరా? లేక‌.. ఇచ్చినా తీసుకోవ‌డం లేదా? అనే సందేహాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. దీనిపై ఒక క్లారిటీ లేక‌పోతే.. చుక్కాని లేని నావ‌లా పార్టీ ప‌రిస్థితి మారుతుంద‌నే హెచ్చ‌రిక‌లు కూడా వ‌స్తున్నాయి.