Begin typing your search above and press return to search.

పవన్ పెద్ద పనిలో ఉన్నారా... అదే జరిగితే ?

ఏపీలో కూడా టాలీవుడ్ లో పనిచేయడానికి ఆసక్తి కలిగిన వారికి మరో ఆల్టర్నేషన్ గా ఉంటుంది అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   26 Aug 2024 4:45 PM GMT
పవన్ పెద్ద పనిలో ఉన్నారా... అదే జరిగితే ?
X

ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పెద్ద పనిలోనే ఉన్నారు అని అంటున్నారు. ఆయన చాలా సైలెంట్ గా తన పని తాను కానిచ్చేస్తున్నారు అని అంటున్నారు. పవన్ ఉప ముఖ్యమంత్రిగా లో ప్రొఫైల్ మెయింటెయిన్ చేస్తున్నారు. మామూలుగా అయితే పవన్ చేతిలో అధికారం పడగానే ఆర్భాటం చేస్తారు అని అంతా ఊహించారు. కానీ దానిని భిన్నంగా ఆయన సాదా సీదాగానే ఉంటున్నారు.

ఎక్కువగా తన శాఖ విషయంలో అధ్యయనం చేస్తున్నారు. అంతే కాదు కూటమి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారు. ఎక్కడా జనసేన టీడీపీల మధ్య పొరపొచ్చాలు లేకుండా చూసుకుంటున్నారు. జనసేనకు ఇచ్చిన మూడు కేబినెట్ పోర్టు ఫోలియోలలో వారంతా తమ విధులను పూర్తిగా నెరవేర్చేందుకు చూస్తున్నారు. అలాగే గెలిచిన్ 21 మంది ఎమ్మెల్యేలు ప్రజా సమస్యల మీదనే ఫోకస్ పెట్టాలని పవన్ ఆదేశాలు జారీ చేశారు.

ఇక పవన్ తాను తీసుకున్న అయిదు కీలకమైన శాఖలను పూర్తి ఇష్టంతోనే దగ్గర పెట్టుకున్నారు. వాటిలో ఏమాత్రం అయినా మంచి చేసి జనాలకు చూపించాలని తపన పడుతున్నారు. పంచాయతీ శాఖలో ఇటీవల ఏకంగా 13 వేలకు పైగా గ్రామ సభలను ఒకే రోజు నిర్వహించి పవన్ ఒక రికార్డు క్రియేట్ చేశారు. అలాగే పర్యావరణం విషయంలోనూ అటవీ శాఖ విషయంలోనూ ఆయన సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

మరో వైపు చూస్తే సినిమాటోగ్రఫీ శాఖ కూడా జనసేన వద్దనే ఉంది. దానికి మంత్రి కందుల దుర్గేష్ చూస్తున్నారు. అయితే టాలీవుడ్ లో టాప్ హీరోగా పవన్ ఈ శాఖ మీద తనదైన ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నారు. విభజన తరువాత ఏపీకి సినీ పరిశ్రమ తరలివస్తుందని అనుకున్నారు.

ఇక టాలీవుడ్ లో కొంత భాగం వచ్చినా ఓకే అనుకున్నారు. ఇపుడు ఏపీలో షూటింగ్ జరిగినా కొంత మేలు అని భావిస్తున్నారు. దాంతో ఆ బాధ్యతను పవన్ తీసుకున్నారు అని అంటున్నారు. ఈ మేరకు ఆయన సినీ పెద్దలతో కూడా మాట్లాడుతున్నారని అంటున్నారు. ఇటీవల సినీ ప్రముఖులు విజయవాడకి వెళ్ళి పవన్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. అలా వారికి ఉపయోగపడేలా ఏపీకి కూడా లాభం చేకూర్చేలా కూడా చర్యలు తీసుకుంటున్నారు.

ఈ క్రమంలో టాలీవుడ్ లో ఏపీలో షూటింగులు చేసుకోవాలంటే ప్రభుత్వమే అవసరం అయిన సదుపాయాలను కల్పించి ఇవ్వాలని కూడా ఆలోచిస్తోంది. వంద ఎకరాలలో బ్రహ్మాండమైన సినీ స్టూడియో కూడా నిర్మించడానికి చంద్రబాబు పవన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఆ స్టూడియోని ఉమ్మడి క్రిష్ణా జిల్లాలోని నందిగామ అసెంబ్లీ నియోజకవర్గంలోని కంచికచర్లలో ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి చూస్తున్నారు అని అంటున్నారు.

ఇక్కడ ప్రభుత్వం స్టూడియోను నిర్మిస్తే హైదరాబాద్ నుంచి కేవలం నాలుగు గంటల వ్యవధిలో చేరుకుని షూటింగులు చేసుకునే వెసులుబాటు ఉంటుందని ఆలోచిస్తున్నారుట. అంతే కాదు ఈ ప్లేస్ గన్నవరం విమానాశ్రయానికి కేవలం నలభై కిలోమీటర్ల దూరంలో ఉండడం కూడా అనుకూలంగా ఉంది అని అంటున్నారు.

అలా ఎయిర్ పోర్టు తో పాటు విజయవాడ రైల్వే స్టేషన్ కి అమరావతి రాజధానికి దగ్గరలో ప్రభుత్వమే స్టూడియో నిర్మించడానికి ఈ ప్లేస్ ని ఎంపిక చేసుకుందని అంటున్నారు. ఇక మరోసారి పవన్ కళ్యాణ్ సినీ పెద్దలతో సమావేశం జరిపిన మీదట ఈ స్థలం విషయంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది అని అంటున్నారు.

అనేక రాష్ట్రాలలో ప్రభుత్వాలే స్టూడియోలు నిర్మించి నామమాత్రం రుసుముతో అద్దెకు ఇస్తున్నాయి. ఏపీలో కూడా అలా చేస్తే టాలీవుడ్ షూటింగులు ఏపీలో కూడా జరుగుతాయని ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే చిన్న నిర్మాతలకు ప్రైవేట్ స్టూడియోలలో షూటింగులు చేయడం భారంగా ఉన్న నేపధ్యంలో ఏపీ సర్కార్ నిర్మించే ఈ స్టూడియో ఎంతో ఉపయోగంలో ఉంటుందని అంటున్నారు.

ఇది కనుక సక్సెస్ అయితే ఏపీ ప్రభుత్వం మరో మంచి పని చేసినట్లు అవుతుంది. ఏపీలో కూడా టాలీవుడ్ లో పనిచేయడానికి ఆసక్తి కలిగిన వారికి మరో ఆల్టర్నేషన్ గా ఉంటుంది అని అంటున్నారు. సో పవన్ పెద్ద పని కనుక విజయవంతం అయితే ఆయనతో పాటు చంద్రబాబుకు టీడీపీ కూటమికి మంచి పేరు వస్తుందని అంటున్నారు.