Begin typing your search above and press return to search.

ఒక్క ఎమ్మెల్యే లేకుండా దశాబ్ద కాలం... రికార్డ్ పై పవన్ సంచలన వ్యాఖ్యలు!

"నేను ఒక మాట చెప్పానంటే తల ఎగిరిపోవాలి గానీ మాట వెనక్కి తీసుకోను" అని తెలిపారు!

By:  Tupaki Desk   |   24 April 2024 4:41 AM GMT
ఒక్క ఎమ్మెల్యే లేకుండా దశాబ్ద కాలం... రికార్డ్  పై పవన్  సంచలన వ్యాఖ్యలు!
X

మంగళవారం పిఠాపురం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన పవన్.. అనంతరం నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా... పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో మంగళవారం రాత్రి జరిగిన సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. "నేను ఒక మాట చెప్పానంటే తల ఎగిరిపోవాలి గానీ మాట వెనక్కి తీసుకోను" అని తెలిపారు!

అవును... తాజాగా ఉప్పడలో జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... మాట ఇస్తే తల ఎగిరిపోవాలి తప్ప వెనక్కి తీసుకోనని చెప్పడం ఒకటీ కాగా... ప్రధానంగా.. "భారతదేశంలో పదేళ్ల పాటు ఒక్క పదవి లేకుండా.. ఉన్న ఒక్క ఎమ్మెల్యే వెళ్లిపోయినా.. దశాబ్ధంపాటు రాజకీయ పార్టీని నేనే నడిపాను.. నేను మొదటితరం రాజకీయ నాయకుడిని" అని వెల్లడించారు.

అనంతరం జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాల్లోని కార్యకర్తలకు పవన్ కీలక సూచన చేశారు. ఇందులో భాగంగా.. రాష్ట్రం మొత్తంమీద జనసేన బలం ఉన్నచోట కూటమి అభ్యర్థులకు ఓటు బదిలీ జరగాలని.. జనసేన కోసం టీడీపీ ఎంత బలంగా నిలబడిందో ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ సజీవ సాక్ష్యం అని తెలిపారు. అందువల్ల అంతా సహకరించుకుంటూ కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.

అంతకముందు.. నామినేషన్ వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్... ఐదేళ్లుగా రాష్ట్రంలో సాగుతున్న ప్రభుత్వ దమనకాండకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని.. ఈ ఎన్నికలు రాష్ట్రానికే కాదు, భవిష్యత్తు తరాలకూ కీలకమైనవని అన్నారు. ఈ సమయంలో... మిగిలిన పార్టీలతో సమంగా జనసేన బలంగా పుంజుకున్నా.. రాష్ట్ర భవిష్యత్తు కోసమే త్యాగాలు చేయాల్సి వచ్చిందని పవన్ చెప్పుకొచ్చారు!

ఇదే క్రమంలో తమలాగే రాష్ట్ర భవిష్యత్తు కోసం పిఠాపురం సీటును వర్మ త్యాగం చేశారని.. భవిష్యత్తులో ఆయనకు ఉన్నతస్థానం దక్కేలా తాను కృషి చేస్తానని చెప్పారు పవన్ కల్యాణ్. ఇదే సమయంలో... కాకినాడ లోక్‌ సభ అభ్యర్థిగా టీ టైమ్‌ వ్యవస్థాపకులు ఉదయ్‌ శ్రీనివాస్‌ పోటీ చేస్తున్నారని, ఇలాంటివారు ఎన్నికైతే ఉపాధి అవకాశాలకు కృషి చేస్తారని.. ఓ.ఎన్‌.జీ.సీ కాలుష్యం వంటి అంశాలపై పార్లమెంటులో బలంగా గళం విప్పగలరని తెలిపారు.