Begin typing your search above and press return to search.

బీజేపీలో జనసేన విలీనం... ధర కూడా చెబుతున్న పాల్!

"తమ్ముడూ" అని సంభోదిస్తూనే పవన్ పై తీవ్ర విమర్శలు చేయడంలో కేఏ పాల్ దిట్ట అనేసంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   11 Aug 2023 4:12 AM GMT
బీజేపీలో జనసేన విలీనం... ధర కూడా చెబుతున్న పాల్!
X

రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచీ తనదైన విభిన్న శైలిలో సెయిలవుతున్నారు కేఏ పాల్. ప్రజాశాంతి పార్టీ స్థాపించిన ఆయన ఏపీకి తాను ముఖ్యమంత్రి అయితే అది ఆ రాష్ట్ర ప్రజల అదృష్టం అన్న స్థాయిలో వ్యాఖ్యానిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా పవన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్.

"తమ్ముడూ" అని సంభోదిస్తూనే పవన్ పై తీవ్ర విమర్శలు చేయడంలో కేఏ పాల్ దిట్ట అనేసంగతి తెలిసిందే. తనతో కలిసి ప్రయాణించమని పలుమార్లు పవన్ ను కోరిన పాల్.. అనంతరం ఎన్డీయే మీటింగ్ లో పవన్ పాల్గొనడంపై ఆయన మరింత ఫైరయ్యారు. ఈ సమయంలో తాజాగా ప్రజారాజ్యం తో జనసేనను పోలుస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... కేఏ పాల్ తాజాగా జనసేనకు రేట్ ఫిక్స్ చేశారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ విషయంలో తాను చెప్పిన జోస్యం కరెక్ట్ అయ్యిందని చెబుతున్న ఆయన... జనసేన విషయంలోనూ అదే జరుగుతుందని అంటున్నారు. ఈ సందర్భంగా అన్నదమ్ములిద్దరూ కలుస్తారని అనంతరం బిజినెస్ స్టార్ట్ అవుతుందని చెబుతున్నారు.

ఈ సందర్భంగా... చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడే.. దానిని కాంగ్రెసులో కలిపేస్తారని కెఎ పాల్ చెప్పినట్లు క్లైం చేసుకుంటున్న కేఏ పాల్... నాడు అయిదువేల కోట్లు పుచ్చుకుని పార్టీని కాంగ్రెస్ లో కలిపేశారని అంటున్నారు. ఇదే సమయంలో రేపు మరో అయిదువేల కోట్లకు జనసేనను కూడా బిజెపిలో కలిపేస్తారట. ఈ స్థాయిలో చిరంజీవి - పవన్ లపై ఫైరవుతున్నారు కేఏ పాల్!

ఇదే సమయంలో ప్రజారాజ్యం పార్టీలో టిక్కెట్లు కోసం 1,500 కోట్ల రూపాయలు కలెక్ట్ చేశారని చెప్పిన పాల్... భార్యల బంగారం అమ్ముకొని అప్పట్లో కాపులు ప్రజారాజ్యం పార్టీలో టికెట్లు కొనుక్కున్నారని దుబ్బయట్టారు. చిరంజీవి తనవద్ద ఉన్న వేల కోట్ల రూపాయలు, తనకిచ్చిన ప్యాకేజ్ డబ్బులు విషయంలో పవన్ ఐటీ రైడ్‌ లు జరుగుతాయని భయపడుతున్నారని అంటున్నారు.

ఏది ఏమైనా... సీరియస్ గా చెప్పినా, కామెడీగా చెప్పినా... మెగా ఫ్యామిలీని మాత్రం కేఏ పాల్ పూర్తిగా టార్గెట్ చేసినట్లే లెక్క! పైగా మణిపూర్ అల్లర్ల విషయంలో స్పందించని మోడీ చుట్టూ పవన్ తిరుగుతున్నారని పరోక్షంగా చాలా బలంగా విమర్శిస్తున్నారు పాల్! ప్రస్తుతం బీజేపీలో జనసేన విలీనం కామెంట్స్ మాత్రం హాట్ టాపిక్ గా మారాయి!