Begin typing your search above and press return to search.

క్రమశిక్షణ కొరడా... జనసేనలో ఏమి జరుగుతోంది...?

రీల్ హీరో పవర్ స్టర్ పవన్ కళ్యాణ్ జన సేనానిగా కూడా రియల్ హీరోగా టాప్ వన్ ప్లేస్ లో ఉండాలని ఆయన ఫ్యాన్స్ గా ఉంటూ జనసైనికులుగా కన్ వర్ట్ అయిన వారు కచ్చితంగా కోరుకుంటున్నారు

By:  Tupaki Desk   |   29 Sep 2023 3:41 AM GMT
క్రమశిక్షణ కొరడా... జనసేనలో ఏమి జరుగుతోంది...?
X

రీల్ హీరో పవర్ స్టర్ పవన్ కళ్యాణ్ జన సేనానిగా కూడా రియల్ హీరోగా టాప్ వన్ ప్లేస్ లో ఉండాలని ఆయన ఫ్యాన్స్ గా ఉంటూ జనసైనికులుగా కన్ వర్ట్ అయిన వారు కచ్చితంగా కోరుకుంటున్నారు. ఇదొక యాస్పెక్ట్ అయితే మరో యాస్పెక్ట్ లో చూసుకుంటే ఏపీలో బీసీల తరువాత అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న కాపులకు రాజ్యాధికారం ఆకాంక్ష అయితే నెరవేరడంలేదు. ఏడున్నర దశాబ్దాల స్వాతంత్ర జీవనంలో ఏపీలో వారు సీఎం అయ్యే చాన్స్ ని పొందలేకపోయారు.

అది పవన్ తో సాధ్యమవుతుందని వారు భావిస్తున్నారు. అందుకే ఉభయ గోదావరి జిల్లాలలో జరిగిన వారాహి యాత్రలు కూడా బలమైన సామాజికవర్గం పూర్తి స్థాయిలో విజయవంతం చేసింది. ఎక్కడ లేని విధంగా సూపర్ సక్సెస్ అయ్యాయి. గోదావరి జిల్లాలలో పవన్ వారాహి యాత్ర చూసిన వారంతా ఏపీలో బలీయమైన శక్తిగా అవతరిస్తారు అని అనుకున్నారు.

అయితే సడెన్ గా పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తుకు ఓకే చెప్పేశారు. అది కూడా చంద్రబాబు జైలులో అవినీతి ఆరోపణల మీద అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా ఉన్న నేపధ్యంలో ఆయనకు బాసటగా నిలవడం అంటే ఎక్కడా సిసలైన అభిమానులు కానీ కాపులలో సీనియర్ నేతలు కానీ కన్విన్స్ కావడంలేదు. టీడీపీకి టైం చూసి జగన్ దెబ్బ కొడితే ఇది కదా జనసేన ఎదిగేందుకు సమయం అని కాపులలో చర్చ సాగుతోంది.

ఏపీలో పొలిటికల్ స్పేస్ ఇపుడు కచ్చితంగా ఉందని కూడా భావిస్తున్నారు. ఈ టైం ని ఉపయోగించుకుంటే కనుక జనసేన 2024 లో అధికారానికి చేరువ కాలేకపోయినా కింగ్ మేకర్ అయినా అవుతుంది అని గట్టిగా నమ్ముతున్న వారు ఉన్నారు. అయితే ఇంతటి సువర్ణ అవకాశాన్ని కేవలం జగన్ మీద గుడ్డి వ్యతిరేకతతో పవన్ బాబుకు సపోర్ట్ చేయడం ద్వారా చేజార్చుకుంటున్నారు అన్నది అభిప్రాయంగా కూడా ఉందంటున్నారు.

ఈ నేపధ్యంలో కాపుల నుంచి కొంత వ్యతిరేకత వస్తోంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ జనసేన కార్యకలాపాలను జనంలో ఉంచే ఒక లాయర్, గోదావరి జిల్లాలకు చెందిన నేత ఇక పైన ఆరు నెలల పాటు తాను వీడియలు చేయను అని పక్కకు తప్పుకున్నారు. ఆయన టీడీపీని విమర్శించడం దానికి అటు నుంచి రియాక్షన్ రావడం జనసేన నుంచి తగిన మద్దతు లేదని భావించడంతోనే ఇలా డెసిషన్ తీసుకున్నారని అంటున్నారు.

మరో వైపు చూస్తే కీలక నేతలు పవన్ కి అండగా నిలిచిన వారు కూడా ఇపుడు మౌనం వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇటీవల తిరుపతిలో పర్యటించిన పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీ పొత్తుకు అంతా మద్దతు ఇవ్వాల్సిందే అని స్పష్టం చేశారు. టీడీపీని విమర్శించే చర్యలకు దిగవద్దు అని సూచించారు.

ఇక లేటెస్ట్ గా ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశిస్తూ ఒక కీలక ప్రకటన విడుదల చేస్తూ దేశ, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పొత్తుని టీడీపీతో పెట్టుకోవడం జరిగిందని అన్నారు. పొత్తు విషయంలో అన్నీ ఆలోచించి పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయం అని ఆయన అన్నారు. దీనిని ఎవరైనా వ్యతిరేకిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని గట్టి హెచ్చరికనే జారీ చేశారు.

పొత్తు విషయంలో యాడ్ వర్స్ గా మాట్లాడితే మాత్రం జనసేనకు జీవో టాలరెన్స్ మాత్రమే ఉంటుందని గుర్తించాలని కూడా ఒక పదం వాడారు. అంటే అసలు సహించబోమని చెప్పారన్న మాట. మరి ఈ విధంగా పదే పదే నాగబాబు ద్వారా జనసేన చెప్పించడంలోని అంతరార్ధం ఏమిటి అన్న చర్చ అయితే వస్తోంది. ఇదంతా కూడా జనసేన పొత్తుల విషయంలో అంతర్గంగా పడుతున్న ఇబ్బందులు అని అంటున్నారు. ఈ హెచ్చరికల నేపధ్యంలో అసలు జనసేనలో ఏమి జరుగుతోంది అన్నది తెలియకుండా ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.