Begin typing your search above and press return to search.

బీజేపీ కోసం పవన్ రాయబారం..!?

ఏపీలో పొలిటికల్ క్లారిటీ వచ్చేస్తోంది. వైసీపీ ఒంటరి పోరుకు రెడీ అయిపోయింది. ఈ విషయం క్లిస్టర్ అండ్ క్లియర్

By:  Tupaki Desk   |   19 Dec 2023 2:45 AM GMT
బీజేపీ కోసం పవన్ రాయబారం..!?
X

ఏపీలో పొలిటికల్ క్లారిటీ వచ్చేస్తోంది. వైసీపీ ఒంటరి పోరుకు రెడీ అయిపోయింది. ఈ విషయం క్లిస్టర్ అండ్ క్లియర్. దాంతో నో డౌట్. రెండవ మాట అంతకంటే లేదు. దాంతో ఏపీలో కుడి ఎడమల మధ్య సర్దుబాటు ఎలా అన్నది ఒక రాజకీయ ఆసక్తికరమైన చర్చగా ఉంది. ఇక బీజేపీ ఉన్న కూటమిలోకి వామపక్షాలు చేరవు. అలాగే కాంగ్రెస్ కూడా అందులోకి రాదు.

జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఉన్నాయి. ఏపీలో చూస్తే ఎన్డీయే కూటమి ఉంది. అయితే అది పేరుకే అన్నట్లుగానే ఉంది. పవన్ కళ్యాణ్ జనసేన ఎన్డీయేతో ఉంటూనే టీడీపీతో పొత్తు పెట్టుకుంది సీట్లు కూడా ఖరారు చేసుకుంది. ఇది ఏ రాష్ట్రంలోనూ ఎక్కడా రాజకీయాల్లో లేని వింత పరిణామమే.

అయినా తమకేమీ బాధ లేదు అన్నట్లుగానే బీజేపీ వ్యవహరిస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్ జనసేనను తెలంగాణాలో పొత్తుకు తీసుకుంది. అయితే అక్కడ పొత్తు ఫలితాలు ఏమీ పెద్దగా రాలేదు. దాంతో 2024 ఎంపీ ఎన్నికల్లో తూచ్ అనేసింది. ఒంటైర్గానే పోరు అని తెలంగాణా బీజేపీ జాతీయ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించేశారు.

మరో వైపు చూస్తే ఏపీలో బీజేపీ ఏమి చేయనుంది అన్నది కూడా ఇంటరెస్టింగ్ పాయింట్. ఇక పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు తీరిక చేసుకుని వెళ్లి మరీ అన్ని విషయాలూ కూలంకషంగా చర్చించి వచ్చారు. దాంట్లో బీజేపీ ప్రస్తావన కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది. బీజేపీకి చివరాఖరు చాన్స్ ఇవ్వాలని అది కూడా ఈ నెలాఖరులోగానే ఏదో ఒకటి తేల్చేయాలని కూడా ఈ రెండు పార్టీలు డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.

దాంతో బీజేపీతో పొత్తు విషయం మీద ఆఖరు రాయబారం చేయడానికి తొందరలోనే పవన్ ఢిల్లీకి వెళ్తారు అని అంటున్నారు. అఫీషియల్ గా చూస్తే ఎండీయే మిత్రుడుగా జనసేన బీజేపీతో పొత్తు ఉన్న నేపధ్యంలో పవన్ బీజేపీ జాతీయ పెద్దలతో ఏపీ విషయం మాట్లాడుతారు అని అంటున్నారు. బీజేపీ మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అని అంటున్నారు.

పవన్ ఢిల్లీ పర్యటన విషయంలో ఏపీ బీజేపీ నేతలు కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు అని అంటున్నారు. ఏపీ బీజేపీలోని ఒక వర్గం టీడీపీతో పొత్తునకు ఉత్సాహం చూపిస్తోంది అని అంటున్నారు. దాంతో పవన్ ఢిల్లీ టూర్ మీద సర్వత్రా ఆసక్తి పెరుగుతోంది అని అంటున్నారు. ఇక ఏపీలో కాంగ్రెస్ వామపక్షాలు కూడా పవన్ ఢిల్లీ టూర్ ప్రచారం మీద ఒకింత ఉత్కంఠను ప్రదర్శిస్తున్నాయి.

ఇప్పటిదాకా టీడీపీని జనసేఅను పల్లెత్తు మాట అనకుండా కామ్రేడ్స్ ఏపీలో రాజకీయం నడుపుతున్నారు. బీజేపీ నో అంటే టీడీపీ కూటమిలో చేరేందుకు వారు రెడీ అని అంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీలో పొత్తుల కోసం చూస్తోంది అని అంటున్నారు. దీంతో పవన్ ఢిల్లీ పర్యటన చేస్తారు అన్న వార్తలు ప్రసుతం రాజకీయ వేడిని పెంచుతున్నాయి.

ఇవన్నీ పక్కన పెడితే పవన్ ఢిల్లీ టూర్ వల్ల బీజేపీ మనసు లో ఏముందో తెలుస్తుందా మనసు మారుతుందా అన్నది ఇంకో చర్చ. బీజేపీకి టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదు అని కూడా అంటున్నారు. అదే కనుక ఉంటే తెలంగాణా ఎన్నికల్లోనే బీజేపీ టీడీపీతో పొత్తు కలిపేది అని అంటున్నారు. ఆ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు పొందాలని బీజేపీ చూసింది. కానీ దాదాపుగా పాతిక నుంచి ముప్పయి సీట్లలో కొంత ఓట్ల బలం ఉన్న టీడీపీ వైపు అయితే చూడలేదు.

దాంతోనే బీజేపీ కేంద్ర పెద్దల ఆలోచనలు అర్ధం అవుతున్నాయని అంటున్నారు. మరో కోపం ఏంటి అంటే తమతో పొత్తులో ఉన్న జనసేనను చంద్రబాబు ఒడుపుగా తన వైపు తిప్పుకోవడం కూడా బీజేపీ పెద్దలకు నచ్చలేదని అంటున్నారు. పవన్ తమతో ఉంటే పొత్తు బేరాలు వేరే లెవెల్ లో ఉండేవని కమలనాధుల భావనగా ఉంది. అపుడు మొత్తం ఏపీలోని 175 సీట్లలో కనీసంగా 70 సీట్లకు ఈ రెండు పార్టీలు డిమాండ్ చేసి మరీ రేపటి రోజున కూటమి అధికారంలోకి వస్తే సీఎం పదవిని షేర్ గా కోరేవి అని అంటున్నారు.

కానీ పవన్ సొంతంగానే టీడీపీతో పొత్తు బేరాలు ఆడి తన సీట్లు తీసుకున్నారు అని అంటున్నారు. దాంతో బీజేపీ ఇపుడు కూటమిలో చేరినా ఒక అరడజన్ కంటే సీట్లు దక్కవని అంటున్నారు. ఈ మాత్రం భాగ్యానికి పొత్తు కలపాలా అన్నది కేంద్ర బీజేపీ పెద్దల ఆలోచనగా ఉంది అని అంటున్నారు.

ఇక ఎంపీ సీట్ల విషయం తీసుకున్నా న్యూట్రల్ గా ఉంటే రేపటి రోజున టీడీపీ గెలిచినా వైసీపీ గెలిచినా తమకే మద్దతు ఇచ్చే సీన్ ఉంటుంది కదా అలాంటపుడు టీడీపీతో కలసి ఎన్నికలకు వెళ్తే వైసీపీ దూరం అవుతుంది ఫ్యూచర్ లో కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వానికి ఆ పార్టీ ఎంపీల మద్దతు లేకుండా పోతుంది అని జాతీయ స్థాయి ఆలోచనలతో బీజేపీ పెద్దలు ఉన్నట్లుగా చెబుతున్నారు.

మొత్తానికి బీజేపీవి జాతీయ వ్యూహాలు అయితే పవన్ వి ఏపీకి మాత్రమే పరిమితం అయ్యే రాజకీయ వ్యూహాలు. ఈ నేపధ్యంలో పవన్ ఢిల్లీకి వెళ్ళి బీజేపీ పెద్దలను ఒప్పించగలరా అలా అయితే ఎంతవరకూ అది సాధ్యం అవుతుంది అన్నది మాత్రం ఆసక్తిని పెంచేదే అని అంటున్నారు.