Begin typing your search above and press return to search.

వ‌లంటీర్ల‌పై ప‌వ‌న్ కామెంట్స్‌.. వివాదం ముగిసిన‌ట్టేనా?

ఏపీలో కీల‌క‌మైన వ్య‌వ‌స్థ‌గా ఉన్న వ‌లంటీర్ల వ్య‌వ‌హారం.. మ‌రోసారి రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించు కుంది

By:  Tupaki Desk   |   16 Feb 2024 9:57 AM GMT
వ‌లంటీర్ల‌పై ప‌వ‌న్ కామెంట్స్‌.. వివాదం ముగిసిన‌ట్టేనా?
X

ఏపీలో కీల‌క‌మైన వ్య‌వ‌స్థ‌గా ఉన్న వ‌లంటీర్ల వ్య‌వ‌హారం.. మ‌రోసారి రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించు కుంది. వ‌లంటీర్ల‌ను తాము దేవుళ్లుగా చూస్తున్నామ‌ని.. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల ను ప్ర‌జ‌ల‌కు అందించ‌డంలో వారు ఉన్న‌తంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. సీఎం జ‌గ‌న్ చెప్పారు. ఇదేస‌మ యంలో ప్ర‌తిప‌క్షాలు వలంటీర్ల‌ను విమ‌ర్శిస్తున్నాయ‌ని.. ముఖ్యంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. మ‌హిళ‌ల అదృశ్యం వెనుక వ‌లంటీర్లు ఉన్నార‌ని చెబుతున్నార‌ని.. సీఎం జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.

దీనికి కౌంట‌ర్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించారు. వ‌లంటీర్ల‌ను తాను ఎప్పుడూ.. ప‌న్నెత్తు మాట అన‌లేద‌న్నారు. ముఖ్యంగా మ‌హిళ‌ల అదృశ్యం వెనుక వారు ఉన్నార‌ని కూడా చెప్ప‌లేద‌న్నారు. అయితే.. ప్ర‌జ‌ల‌కు సంబంధించిన వివ‌రాల‌తో కూడిన డేటాను వారు సేక‌రిస్తున్నారని. దీనిని హైద‌రాబాద్‌లోని ఓ కంపెనీకి అందిస్తున్నార‌ని మాత్ర‌మే చెప్పాన‌న్నారు. ఇది అక్క‌డ నుంచి వేర్వేరు మార్గాల్లో పోయి.. సంఘ వ్య‌తిరేక శ‌క్తుల‌కు చేరుతోంద‌ని.. అన్న‌ట్టు చెప్పారు.

త‌ద్వారా మ‌హిళ‌ల అదృశ్యాలు చోటు చేసుకుంటున్నాయ‌ని తాను వ్యాఖ్యానించారు. కొంద‌రు వ‌లంటీర్లు చేస్తున్న త‌ప్పుల కార‌ణంగా మిగిలిన అంద‌రూ ఇబ్బందులు ప‌డుతున్నార‌ని వ్యాఖ్యానించారు. తాము వ‌లంటీర్ల‌కు వ్య‌తిరేకం కాద‌ని చెప్పారు. దీంతో గ‌త కొన్నాళ్లుగా చోటు చేసుకున్న వ‌లంటీర్ల‌పై వివాదం స‌ర్దుమ‌ణిగిన‌ట్టేన‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఇటీవ‌ల టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు కూడా.. వ‌లంటీ ర్ వ్య‌వ‌స్థ‌కు తాము వ్య‌తిరేకం కాద‌ని.. కానీ.. వైసీపీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డానికే తాము వ్య‌తిరేకమ‌ని తేల్చి చెప్పారు.

అస‌లు ఏం జ‌రిగింది?

వారాహి యాత్ర‌ను ప్రారంభించిన ప‌వ‌న్‌.. కాకినాడ నియోజ‌క‌వర్గంలో గ‌త ఏడాది జూన్‌లో మాట్లాడుతూ.. వ‌లంటీర్ల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్రంలో 37 వేల మంది మ‌హిళ‌లు, యువ‌తులు అదృశ్య‌మ‌య్యార‌ని.. వ‌లంటీర్లు ఇంటింటికీ వెళ్లి సేక‌రిస్తున్న జాబితా కార‌ణంగానే ఇలా.. జ‌రుగుతోంద‌ని చెప్పారు. అంతేకాదు.. ఈ స‌మాచారాన్ని కేంద్ర నిఘా సంస్థ‌లు త‌న‌కు చెప్పాయ‌ని తెలిపారు. ఇది అప్ప‌ట్లో తీవ్ర వివాదానికి దారి తీసింది. వ‌లంటీర్లు రోడ్డుపైకి వ‌చ్చి నిర‌స‌న వక్తం చేశారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు.. విమ‌ర్శ‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి.