జన సైనికులకు గుడ్ న్యూస్
జనసేన పార్టీకి, అధినేత పవన్ కళ్యాణ్ కు, పవన్ వీరాభిమానులైన జన సైనికులకు హైకోర్టు కీలక తీర్పు ఇస్తూ గుడ న్యూస్ చెప్పింది
By: Tupaki Desk | 16 April 2024 9:29 AM GMTజనసేన పార్టీకి, అధినేత పవన్ కళ్యాణ్ కు, పవన్ వీరాభిమానులైన జన సైనికులకు హైకోర్టు కీలక తీర్పు ఇస్తూ గుడ న్యూస్ చెప్పింది. జనసేనకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించవద్దని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్(సెక్యులర్) ఫౌండర్ ప్రెసిడెంట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గ్లాసు గుర్తును జనసేన కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నది. అయితే ఈ గుర్తును తొలుత తమకు కేటాయించాలని ధరఖాస్తు చేసుకున్నాం అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది.
ఈ పిటిషన్పై ఇటీవల ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసి పెట్టి ఇవాళ ఆ పిటిషన్ను కొట్టేసింది. జనసేన గాజు గ్లాసు గుర్తు ఫ్రీ సింబల్ చేస్తారన్న భయం పార్టీ శ్రేణులు, పోటీ చేస్తున్న అభ్యర్థులలో ఇప్పటి వరకు గుబులు రేపింది. హైకోర్టు తీర్పు ఏ విధంగా వస్తుందోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూశారు. తాజాగా కోర్టు తీర్పు నేపథ్యంలో జన సైనికులు సంతోషపడడం ఖాయం అని చెప్పవచ్చు.