ట్రోల్స్ చేసినా పవన్ కి లక్కీ నంబర్ అదే ?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్కీ నంబర్ ఏదీ అంటే గతంలో ఏమో కానీ ఇపుడు మాత్రం ఒక కొత్త నంబర్ ని ముందుకు తెస్తున్నారు
By: Tupaki Desk | 21 Jun 2024 9:58 AM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్కీ నంబర్ ఏదీ అంటే గతంలో ఏమో కానీ ఇపుడు మాత్రం ఒక కొత్త నంబర్ ని ముందుకు తెస్తున్నారు. అదే 21. అవును పొత్తులో భాగంగా 21 ఎమ్మెల్యే సీట్లను పవన్ తీసుకున్నారు. అలాగే 2 ఎంపీ సీట్లు తీసుకున్నారు. ఈ రెండింట్లో 2 కామన్ గా ఉంది. ఇక పవన్ 21 సీట్లు తీసుకున్నపుడు వైసీపీ నుంచి వచ్చిన ట్రోల్స్ అన్నీ ఇన్నీ కావు.
పవన్ కి 24 సీట్లు అని చెప్పి 21 ఇచ్చారని ఇంకా తగ్గిస్తారు అని కూడా సెటైర్లు పేల్చారు. అయితే పవన్ ఎక్కడా అధైర్యపడలేదు. ఆయన ఒక వ్యూహం ప్రకారం ముందుకు సాగారు 21 సీట్లు ఇస్తేనేంటి అన్నింటా మనమే గెలిచి సెంట్ పర్సెంట్ సక్సెస్ రేటు సాధించాలని నేతలను కోరారు.
పవన్ అన్నట్లుగానే 21 ఎమ్మెల్యే సీట్లు దక్కాయి. దాంతో పాటుగా 2 ఎంపీ సీట్లు ఆయన గెలుచుకున్నారు. దాంతో 21 నంబర్ పవన్ కి ఎంతగానో కలసి వచ్చింది అని అంటున్నారు. ఇపుడు చూస్తే జూన్ 21న కొత్త అసెంబ్లీలో పవన్ ఉప ముఖ్యమంత్రిగా నాలుగు ప్రధాన శాఖలతో ప్రమాణం చేశారు.
దాంతో 21 మంది ఎమ్మెల్యేలు 21వ డేట్ సో లక్కీ నంబర్ పవన్ కి అని సోషల్ మీడియాలో కామెంట్స్ ని జనసైనికులు పెడుతున్నారు. ఒకనాడు 21 అన్ లక్కీ అని వేళాకోళం చేసిన నోళ్ళు మూతపడగా పవన్ కి మాత్రం 21 ఫుల్ లక్కీగా మారింది అని అంటున్నారు.
పవన్ కి 21 నంబర్ కి చాలా గొప్ప బంధం ఉందని రానున్న రోజులలో పవన్ మరింత గొప్పగా రాజకీయాల్లో రాణించడానికి ఈ 21 నంబరే పునాది అవుతుందని అంటున్నారు. పవన్ 21 అంటూ జనసైనికులు సంబరాలు చేసుకుంటున్నారు
ఏది ఏమైనా పవన్ పట్టుదల వినయం, వ్యూహం, అలాగే ప్రజల మీద పెట్టుకున్న నమ్మకం, ఒక విజన్ అన్నీ కలసే ఆయనకు ఈ రోజు ఈ స్థాయి కల్పించాయని అంటున్నారు. రానున్న రోజులలో పవన్ రాజకీయంగా మరింత దూకుడు చేస్తారని దానికి నాందీ ప్రస్థానం ఈ ఉప ముఖ్యమంత్రి పదవి అని అంటున్నారు.
ఇక పవన్ సైతం గెలిచిన తరువాత ఎక్కడా విపక్షాన్ని ఒక్క మాట కూడా తూలకుండా హుందాగా వ్యవహరిస్తున్నారు. ఆయన అధికారం అందుకున్నారు కానీ దానిని నెత్తికి ఎక్కించుకోవడంలేదు అనడానికి ఇదే నిదర్శనం అని అంటునారు. తన పనితీరుని మెరుగు దిద్దుకోవడానికి శాఖల మీద పట్టు సాధించడానికి పవన్ చూస్తున్నారు అని అంటున్నారు. తనకు అప్పగించిన శాఖలకు నూరు శాతం న్యాయం చేయడమే పవన్ లక్ష్యం అని అంటున్నారు.