పవన్ తుఫాన్... బడ్జెట్ మీద మాట్లాడరా ?
పవన్ కళ్యాణ్ ని తుఫాన్ అని ఎన్డీయే పక్షాల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ పొగిడారు.
By: Tupaki Desk | 23 July 2024 2:50 PM GMTపవన్ కళ్యాణ్ ని తుఫాన్ అని ఎన్డీయే పక్షాల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ పొగిడారు. మరి అలాంటి పవన్ కి కేంద్రం వద్ద ఎంత పలుకుబడి ఉందో అందరికీ తెలిసిందే. నరేంద్ర మోడీ పవన్ ని ప్రతీ సారీ పొగుడుతారు
పవన్ తుఫాను అని పెద్ద ఎత్తున కేంద్ర పెద్దలు పొగడడమంతా చూసారు. పవన్ ఏమి చెబితే అదే జరుగుతుంది కదా అన్న మాట ఉంది. అమరావతికి అప్పు ఇస్తున్నారు. అలాగే పోలవరం నిధుల మీద ఏ మాత్రం క్లారిటీ అయితే లేదు అంటున్నారు.
ఏపీలో ఏర్పాటు చేసే కేంద్ర ప్రభుత్వ సంస్థల మీద ఒక క్లారిటీ లేదు. అంతే కాదు వాటి నిధుల సంగతి కేటాయింపులు అన్న ఊసే లేదు. మరి ఏపీ అంటే కేంద్రం ఉదారంగా ఆదుకోదా అన్న చర్చ వస్తోంది. అప్పులు ఇస్తే ఏపీకి ఉద్ధరించామని కేంద్ర పెద్దలు అనుకుంటూ అదే బడ్జెట్ లో గొప్పగా పెడితే తుఫాన్ లాంటి పవన్ కళ్యాణ్ మాట్లాడాలి కదా అన్న చర్చ వస్తోంది.
మరి కేంద్ర పెద్దల వద్ద ప్రత్యేకించి ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర ఎంతో పలుకుబడి కలిగిన పవన్ కళ్యాణ్ ఏమి చేస్తున్నట్లు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. పవన్ అసెంబ్లీలో అయితే కేంద్ర ప్రభుత్వానికి థాంక్స్ చెప్పారు. అమరావతి రాజధానికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఇస్తున్నందుకు ఆయన కేంద్ర పెద్దలకు ధన్యవాదాలు చెప్పుకున్నారు.
అయితే అది అప్పు అని తెలిసిన తరువాత పోలవరం గురించి ఎటూ తేల్చకుండా అస్పష్ట ప్రకటనలు చూసిన తరువాత అయినా పవన్ మాట్లాడాలి కదా అని అంటున్నారు. నిజానికి జనసేన పట్టుబట్టి ఏపీలో బీజేపీని కూటమిలోకి తెచ్చింది. ఆ కూటం విజయమే ఆక్సిజన్ గా పనిచేసి కేంద్రంలో మూడవసారి నరేంద్ర మోడీ ప్రధాని అయ్యేలా చేసింది. మరి కేంద్రానికి ఇంతలా ఏపీ ప్రజలు పట్టం కడితే ఏపీకి కేంద్రం ఇచ్చేది అప్పు మాత్రమేనా అని అంతా అంటున్నారు.
ఏపీ విభజనతో పదేళ్ళుగా నానా అవస్థలూ పడుతున్నా కూడా ఇంకా ఉదారంగా ఇద్దామని కేంద్రానికి లేకుండా పోయిందా అప్పులు మాత్రమే ఇస్తూ తాము దానికి పూచికత్తు అని చెప్పుకోవడం ఏంటని అంతా అంటున్నారు. రాహుల్ గాంధీ అన్నట్లుగా మిత్ర పక్షాలను కేంద్రం తన బూటకపు ప్రకటనతో మభ్యపెడుతోందని కూడా అంటున్నారు.
ఈ అప్పులే చేయాలనుకుంటే ఏపీ చేసుకోలేదా అని కూడా అంటున్నారు. 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు చేసింది ఆ ప్రయత్నమే కదా అని కూదా గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వానికి తుఫాన్ లాంటి పవన్ ఏపీకి స్పెషల్ గ్రాంట్స్ పెద్ద ఎత్తున ఇవ్వమని చెప్పాలని అంతా అంటున్నారు. అలాగే ఒక డెడ్ లైన్ పెట్టి పోలవరం పూర్తి చేయాలని కోరమని కూడా అంటున్నారు. మరి తుఫాన్ పవన్ మాట్లాడుతారా అన్నదే అంతా చూస్తున్నారు.