పవన్ కళ్యాణ్ ఆ ఒక్క స్టేట్మెంట్ తో మునిగిపోతాడా ?
తాజా ఎన్నికల్లోనూ ఆయనకే ఉద్యోగులు జై కొట్టారు. బాబు మాత్రం సీపీఎస్ రద్దు అని ఎక్కడా అనలేదు. మరి బాబు అనలేనిది పవన్ ఎందుకు అన్నారు అన్నదే చర్చ.
By: Tupaki Desk | 13 Jun 2024 5:05 AM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ బోల్డ్ గా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చేశారు. అది ఆవేశంతో కాదు ఉద్యోగుల పట్ల సానుభూతితోనే అనుకోవాలి. వారి మీద అభిమానంతో కమిట్ మెంట్ తోనే ఒక హామీ ఇచ్చారు అని అనుకోవాలి. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆ స్టేట్మెంట్ ఏంటి అంటే ప్రభుత్వ ఉద్యోగుల అతి పెద్ద డిమాండ్ అయిన సీపీఎస్ రద్దు అన్నది.
ఈ హామీ జగన్ కూడా పాదయాత్రలో భాగంగా ఇచ్చారు. దానిని అమలు చేయలేదనే ఉద్యోగులు పూర్తి యాంటీ అయ్యారు. ఆ తరువాత కధ అందరికీ తెలిసిందే. ఇక పోతే చంద్రబాబు మాత్రం ఏ రోజూ ఈ హామీని తలకెత్తుకోలేదు. ఆయన 2014లోనూ ప్రభుత్వ ఉద్యోగుల మన్ననలు పొందారు. కానీ ఈ హామీ మాత్రం ఇవ్వలేదు.
తాజా ఎన్నికల్లోనూ ఆయనకే ఉద్యోగులు జై కొట్టారు. బాబు మాత్రం సీపీఎస్ రద్దు అని ఎక్కడా అనలేదు. మరి బాబు అనలేనిది పవన్ ఎందుకు అన్నారు అన్నదే చర్చ. పవన్ జనసేన అధినేతగా మీటింగులో మాట్లాడుతూ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అని అంటున్నారు.
పొత్తుల కంటే ముందు ఇచ్చిన హామీగా కూడా దీనిని చెబుతున్నారు. అయితే ముందు ఇచ్చారా లేక వెనక ఇచ్చారా అన్నది పక్కన పెడితే పవన్ టీడీపీ కూటమిలో కీలక నాయకుడు. అతి ముఖ్య భూమికను ఆయన ప్రభుత్వంలో పోషిస్తున్నారు. మరి అటువంటి నేత ఇచ్చిన ఈ హామీని ఉద్యోగులు లైట్ తీసుకుంటారా పవన్ ని పట్టించుకోమని అడగకుండా ఉంటారా అన్నదే ఇపుడు చర్చకు వస్తున్న విషయం.
ఇంతకీ పవన్ ఇచ్చిన ఈ హామీ ఏంటి అంటే తాను ప్రభుత్వ ఉద్యోగి కుమారుడిగా చెబుతున్నా సీపీఎస్ రద్దు చేయడం తధ్యమని ఆయన అంటున్నారు. మరి ఈ హామీ విలువ చాలా చాలా ఎక్కువ. ప్రభుత్వ ఉద్యోగులు సీపీఎస్ రద్దు కోరడం ఖాయమని అంటున్నారు. నిజానికి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తే చర్చల సందర్భంగా తాము పెట్టబోయే మొదటి డిమాండ్ ఇదే అని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. దానికి పవన్ హామీని కూడా జత చేస్తారని అంటున్నారు. ఇక పవన్ ఈ హామీ మీద ఎలా రియాక్ట్ అవుతారో కూడా చూడాల్సి ఉంది.