పవన్ కల్యాణ్ మంత్రాంగం ఓకే.. కర్ణాటకతో చర్చలు సానుకూలం
ఈ సమావేశం మొత్తం సుహృద్భావ వాతావరణంలో సాగినట్టు పవన్ కల్యాణ్ తెలిపారు.
By: Tupaki Desk | 8 Aug 2024 7:30 PM GMTకర్ణాటక ప్రభుత్వంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ చేపట్టిన చర్చలు ఫలప్రదమయ్యాయి. అటవీ శాఖకు సంబంధించిన ముఖ్యమైన 7 అంశాలపై పవన్ కల్యాణ్ కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖాండ్రేతో గురువారం బెంగళూరులో చర్చలు జరిపారు. ఈ సమావేశం మొత్తం సుహృద్భావ వాతావరణంలో సాగినట్టు పవన్ కల్యాణ్ తెలిపారు.
ఇవీ 7 అంశాలు..
+ ఏపీలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ఏనుగుల సమస్య అధికంగా ఉంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇరు రాష్ట్రాల సహకారానికి కర్ణాటక ఓకే చెప్పింది.
+ ఏపీకి ఎనిమిది కుంకి జాతి ఏనుగులను ఇచ్చేందుకు సిద్దరామయ్య ప్రభుత్వం ఒప్పుకొంది.
+ ఏపీ నుంచి ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేస్తున్న సమయంలో కర్ణాటక పోలీసులు పట్టుకున్న రూ. 140 కోట్ల విలువైన దుంగలను తిరిగి అప్పగించేందుకు మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించారు.
+ అటవీ సంపద రక్షణ కోసం ఉపగ్రహ ఆధారిత నిఘాపెట్టేందుకు, ఇరు రాష్ట్రాల మధ్య సహకారం. అధికారుల సమాచార మార్పిడికి ఇరు రాష్ట్రాలు ఒప్పందం.
+ వన్యప్రాణుల స్మగ్లింగ్ ను కట్టడి చేసేలా రెండు రాష్ట్రాలు సమష్టిగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.
+ వన్యప్రాణులను ఇష్టానుసారం వేటాడి స్మగ్లింగ్ చేసే వారిపై కఠినంగా వ్యవహరించేందుకు, పరస్పరం సహకరించుకునేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకారం.
+ తిరుమల, శ్రీశైలం దేవస్థానాలకు వచ్చే కర్ణాటక భక్తులకు అవసరమైన `యాత్రి సదన్` ల నిర్మాణాల నిమిత్తం కర్ణాటక ప్రభుత్వానికి భూముల కేటాయింపుపై పవన్ కల్యాణ్ సానుకూలం. సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం.
+ ఏపీ-కర్ణాటకల మధ్య ఎకో టూరిజం అభివృద్ధికి ఉమ్మడి కార్యాచరణ రూపకల్పనకు ఓకే.
+ అంతర్రాష్ట్ర ఒప్పందం మేరకు రెండు రాష్ట్రాల అటవీ శాఖ అధికారులు తగిన విధంగా పనిచేసేందుకు ప్రణాళిక రూపకల్పనకు ముందడుగు.