Begin typing your search above and press return to search.

కూటమి టైం... బీజేపీపై ఖర్గే సీరియస్, పవన్ సెటైర్!

వాస్తవానికి 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరమే కాస్త గుడ్ టైం స్టార్ట్ అయ్యిందనే చర్చ జరిగిన నేపథ్యంలో

By:  Tupaki Desk   |   13 July 2024 5:40 PM GMT
కూటమి టైం... బీజేపీపై ఖర్గే సీరియస్, పవన్  సెటైర్!
X

ఆఫ్టర్ లాంగ్ గ్యాప్... దేశ రాజకీయాల్లో ఇండియా కూటమికి టైం స్టార్ట్ అయ్యిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. వాస్తవానికి 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరమే కాస్త గుడ్ టైం స్టార్ట్ అయ్యిందనే చర్చ జరిగిన నేపథ్యంలో... తాజాగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాల అనంతరం ఆ స్టార్ట్ అయిన టైం కాస్తా గుడ్ టైం గా మారిందని.. ఇక తొందర్లో బెస్ట్ టైం గా మారే అవకాశాలున్నాయని అంటున్నారు.

మరోపక్క ఇప్పటికే బీజేపీ & కోకి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యిందని.. 2024 ఎన్నికల ఫలితాలే అందుకు ఉదాహరణ అని.. బొటాబొటీ మెజారిటీతో బండి నడుపుతున్న నేపథ్యంలో ఇది కచ్చితంగా బ్యాడ్ టైం సంకేతాలే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ చర్చకు అసలు కారణం... దేశవ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాల్లో ఖాళీ అయిన 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా బీజేపీకి ఘోర పరాజయాలు ఎదురవ్వడమే.

అవును... తాజాగా దేశవ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాల్లో ఖాళీ అయిన 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ కేవలం రెండు స్థానాల్లోనే గెలవగా.. 10 చోట్ల ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇక మిగిలిన చోట స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. ఇప్పుడు ఈ విషయం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు కారణమవుతోంది.

పైగా... దేవభూమిగా పేరున్న ఉత్తరాఖండ్ లోని బద్రినాథ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ ఓడిపోయింది. ఇలా ఉత్తరాఖండ్ తో పాటు హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో.. ఇండియా కూటమి పాలిత ప్రాంతాలతో పాటు బీజేపీ పాలిత ప్రాంతాలతో పాటు సైతం వారికి షాక్ తగిలింది.

ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ర్యాగింగ్ స్టార్ట్ చేసేశారు. ఇందులో భాగంగా... కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేడా సెటైర్లు వేశారు. ఈ ట్రెండ్ లోక్ సభ ఎన్నికలతోనే స్టార్ట్ అయ్యింది.. ఇప్పుడు మరింత ముందుకు సాగుతోంది.. రాబోయే అన్ని ఎన్నికల్లోనూ బీజేపీ ఓటమిని చవిచూస్తుంది అని జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా 2014 నాటి సంగతులు గుర్తు చేసుకున్నారు.

ఇందులో భాగంగా... 2014 ఎన్నికల్లో మాకు కూడా ఇలానే జరిగింది.. ఇదే విధమైన అనుభవం ఎదురైంది.. ఆ సమయంలో జరిగిన చాలా ఎన్నికల్లో ఓడిపోయాం.. ఇప్పుడు బీజేపీ ఆ దశలోనే ఉంది అని అన్నారు. మరోపక్క ఈ విక్టరీపై కాంగ్రెస్ అధినేత మల్లికార్జున్ ఖర్గే సీరియస్ గా స్పందించారు. కేడర్ కు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.

ఈ క్రమంలో... ఈ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ల అహంకార, మోసపూరిత, అనైతిక, విశ్వసనీయత లేని రాజకీయాలకు ఓ చెంపదెబ్బగా అభివర్ణించిన ఖర్గే... ఈ ఎన్నికల్లో పార్టీని గెలిపించడానికి శ్రమించిన ప్రతీ కార్యకర్తకూ ధన్యవాదాలు తెలిపారు.