Begin typing your search above and press return to search.

పవన్ లోకేష్ తొలి భేటీకి డేట్ ఫిక్స్ !

ఇక ఈ భేటీలో పవన్ తో పాటు జనసేన నియమించిన కో ఆర్డినేషన్ కమిటీ మెంబర్స్. అలాగే లోకేష్ తో పాటు టీడీపీ నియమించిన అయిదుగురు కో ఆర్డినేషన్ మెంబర్స్ కూడా హాజరు అవుతారు అని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   20 Oct 2023 3:01 PM GMT
పవన్ లోకేష్ తొలి భేటీకి డేట్ ఫిక్స్  !
X

ఏపీలో కొత్త పొత్తులు కుదిరాయి. అవి ఇపుడు గ్రౌండ్ లెవెల్ లో సైతం వర్కౌట్ కావడానికి తగిన విధంగా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు జైలులో ఉన్న వేళ ఆయన తనయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కొత్త మిత్రపక్షం జనసేనతో భేటీ కానున్నారు.

దానికి వేదిక రాజమండ్రిగా నిర్ణయించారు. అలాగే ఈ నెల 23వ తేదీ అంటే సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఈ కీలకమైన భేటీ జరగంది. ఈ భేటీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ముఖాముఖీ చర్చలు జరుగుతారని తెలుస్తోంది.

అలా టీడీపీ జనసేన పార్టీల సమన్వయ కమిటీ మొదటి భేటీకి సర్వం సిద్ధం అయింది. ఈ ఇద్దరు నేతలూ కలసి ఏపీలో ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం ఎలా చేయాలన్న దాని మీద సీరియస్ గా చర్చిస్తారు అని అంటున్నారు. అదే విధంగా రెండు పార్టీలు కలసి ఉద్యమ కార్యాచరణను తయారు చేయడం, అదే విధంగా రాష్ట్రంలో ఉన్న తాజా రాజకీయ పరిణామాలని కూడా అధ్యయనం చేస్తూ దానికి తగినట్లుగా ఎలా ముందుకు సాగాలి అన్న దాని మీద కూడా చర్చిస్తారు అని అంటున్నారు.

అంటే రెండు పార్టీల సమన్వయంపైన పవన్ లోకేష్ ల మధ్య చర్చ సాగుతుంది అని తెలుస్తోంది. ఇక ఈ భేటీలో పవన్ తో పాటు జనసేన నియమించిన కో ఆర్డినేషన్ కమిటీ మెంబర్స్. అలాగే లోకేష్ తో పాటు టీడీపీ నియమించిన అయిదుగురు కో ఆర్డినేషన్ మెంబర్స్ కూడా హాజరు అవుతారు అని తెలుస్తోంది.

ఇక ఇప్పటికే జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులను ప్రకటించిన ఇరు పార్టీలు రానున్న కాలంలో తమ పొత్తులను ఎలా ముందుకు తీసుకుని పోవాలి అన్న దాని మీదనే చర్చిస్తారు అని అంటున్నారు. అదే విధంగా పై స్థాయిలో కలసినట్లుగానే గ్రౌండ్ లెవెల్ లో కూడా రెండు పార్టీలు కలసి ముందుకు సాగే విధంగా కూడా దిశా నిర్దేశం చేయనున్నారు అని తెలుస్తోంది.

ఇంటి కీలక సమావేశానికి వేదికగా రాజమండ్రిని ఎంచుకోవడానికి కారణం ఉంది. ఆ రోజున మరోసారి చంద్రబాబుతో ములాఖత్ అయ్యే అవకాశం ఉందా అన్నది కూడా చూడాల్సి ఉంది అంటున్నారు ఎందుకంటే జనసేన టీడీపీ కో ఆర్డినేషన్ కమిటీ అజెండాను సెట్ చేసే విషయంలో చంద్రబాబు దిశా నిర్దేశం చేస్తారు అని అంటున్నారు. ఏది ఏమైనా విజయదశమి కంటే ముందే రెండు పార్టీలు యాక్షన్ ప్లాన్ ని రెడీ చేసుకుంటాయని తెలుస్తోంది.

ఆ మీదట మంచి ముహూర్తం చూసి ఉమ్మడిగా జనంలోకి వెళ్తాయని అంటున్నారు. ఇప్పటికే పవన్ జనసేన క్యాడర్ ని టీడీపీ జనసేన విజయానికి పాటుపడమని పిలుపు ఇస్తున్నారు. దాంతో ఈ పొత్తు బంధం మరింతగా పటిష్టం అయ్యేలా ఈ మీటింగ్ ఉంటుంది అని అంటున్నారు. మరి రెండు పార్టీల అగ్ర నాయకులు పాలుపంచుకునే మీటింగ్స్ కూడా ఏపీలో సాగుతాయా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది అని అంటున్నారు.