Begin typing your search above and press return to search.

గోరంట్ల చెవిలో పవన్ సందేశం...!?

ఈ సీటు నుంచి సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే పెద్దాయన గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరోసారి పోటీ చేస్తాను అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   29 Feb 2024 3:48 AM GMT
గోరంట్ల చెవిలో పవన్ సందేశం...!?
X

తూర్పు గోదావరి జిల్లా హాట్ సీటుగా మారింది రాజమండ్రి రూరల్ సీటు. ఈ సీటు నుంచి సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే పెద్దాయన గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరోసారి పోటీ చేస్తాను అని అంటున్నారు. అదే సీటుని జనసేన కోరుకుంటోంది. ఆ పార్టీ తరఫున జిల్లా ప్రెసిడెంట్ కందుల దుర్గేష్ ఆశిస్తున్నారు.

అయితే ఇద్దరూ కావాల్సిన వారే. ఇద్దరూ ఆ రెండు పార్టీల అధినేతలకు దగ్గరివారే. దాంతో అతి పెద్ద చిక్కు వచ్చిపడింది. దాంతో ఈ చిక్కు ముడిని సీట్ల పితలాటకాన్ని ఒక కొలిక్కి తేవడం కష్టమైపోతోంది. ఇదిలా ఉంటే తాడేపల్లిగూడెం లో జరిగిన సభలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ గోరంట్ల బుచ్చయ్య చౌదరిని దగ్గరకు తీసుకుని ఆయన చెవిలో ఏదో చెబుతున్న దాన్ని కెమెరాలు క్లిక్ మనిపించాయి.

ఇంతకీ పవన్ గోరంట్లకు ఏమి చెబుతున్నారు. పెద్దాయన చాలా సావధానంగా వింటున్నది ఏమిటి అన్న చర్చ మొదలైంది. పవన్ పెద్దాయనతో రాజమండ్రి రూరల్ సీటుని వదిలేయమని కోరారా అన్న చర్చ కూడా వస్తోంది. అదే టైం లో ఈ సీటు కోసం తనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న కందుల దుర్గేష్ కి ఇవ్వాలన్న పవన్ ఆలోచనలకు ఈ సందేశం అద్దం పడుతోందా అన్నది కూడా చర్చగా ఉంది.

ఏది ఏమైనా తాడేపల్లి గూడెం లో జరిగిన సభలో పవన్ ఒక వైపు ఆవేశం చూపించారు. మరో వైపు చంద్రబాబు బాలకృష్ణ స్పీచ్ ఇస్తూంటే వారి స్పీచ్ లో పంచులకు బాగా ఎంజాయ్ చేశారు ఇక తన వంతు రాగానే విశ్వరూపం చూపించారు. అదే సమయంలో టీడీపీ నేతలు సీనియర్లు అందరితో పవన్ చాలా కలుపుగోలుగా వ్యవహరించడం కనిపించింది.