Begin typing your search above and press return to search.

సింగర్ కం నటుడి మీద ఆయన తల్లి పోటీ

హాట్ టాపిక్ గా మారిన ఈ ఉదంతం బిహార్ లో చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   16 May 2024 6:22 AM GMT
సింగర్ కం నటుడి మీద ఆయన తల్లి పోటీ
X

రాజకీయాలు మహా చెడ్డవి. ఎప్పుడు ఎవరిని ఎలా మారుస్తాయో ఒక పట్టాన చెప్పలేం. తాజా ఉదంతం గురించి తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. కారణం.. ఒక యాక్టర్ కం సింగర్ మీద ఆయన తల్లి పోటీకి నిలవటం ఆసక్తికరంగా మారింది. హాట్ టాపిక్ గా మారిన ఈ ఉదంతం బిహార్ లో చోటు చేసుకుంది. ఇంతకూ ఆ నటుడు ఎవరు? అతడు పోటీ చేస్తున్న చోటనే.. అతడి తల్లి ఎందుకు పోటీ చేస్తున్నట్లు? అన్న విషయంలోకి వెళితే..

బిహార్ లోని కారాకట్ ఎంపీ స్థానం నుంచి భోజ్ పురి సింగర్ కం యాక్టర్ పవన్ సింగ్ పోటీ చేస్తున్నారు. అయితే.. ఇదే స్థానం నుంచి అతడి తల్లి ప్రతిమాదేవి సైతం పోటీలోకి రావటం షాకింగ్ గా మారింది. వీరిద్దరూ ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలో ఉండటం మరో ట్విస్టుగా చెప్పాలి. నిజానికి పవన్ సింగ్ ను పశ్చిమబెంగాల్ లోని అసన్ సోల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా అధినాయకత్వం ప్రకటించింది.

ఇటీవల కాలంలో తన పాటల మీద అక్కడ తీవ్రమైన విమర్శలు వచ్చాయని పేర్కొన్న అతడు.. అక్కడి నుంచి కాకుండా బిహార్ లోని కారాకట్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత పోటీ చేయకుండా వేరే రాష్ట్రం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగటాన్ని బీజేపీ అధినాయకత్వం సీరియస్ అయ్యింది. వెంటనే పోటీ నుంచి వైదొలగాలంటూ అల్టిమేటం జారీ చేసింది.

అంతేకాదు.. తాము చెప్పినట్లు వినకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది.ఇదిలా ఉంటే.. ఇదే నియోజకవర్గం నుంచి అతడి తల్లి ప్రతిమాదేవి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగటం సంచలనంగా మారింది. కొడుకును కంట్రోల్ చేయటానికి తల్లిని బీజేపీ నాయకులు సీన్లోకి దించారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. అయితే.. నామినేషన్లకు మంగళవారం తుది గడువు కావటంతో.. ఆమెను తన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ ఉపసంహరణకు గడువు ఉండటంతో.. వీరిద్దరి మధ్య పోటీ ఉంటుందా? లేదంటే ఇద్దరూ వైదొలుగుతారా? అన్నది తేలాల్సి ఉంది.