రామోజీరావును కూడా ఇబ్బంది పెట్టారు!
అందుకే.. ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడారని చెప్పారు. తాను చూసిన రామోజీరావు లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ వివరించారు.
By: Tupaki Desk | 27 Jun 2024 5:30 PM GMTవిజయవాడ సమీపంలోని కానూరులో నిర్వహించిన పత్రికా దిగ్గజం రామోజీరావు సంస్మరణ సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం ఎవరినీ వదిలి పెట్టలేదన్నారు. చివరకు ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకు ప్రయత్నించిన.. రామోజీరావును కూడా వదిలి పెట్టకుండా వేధించారని ఆయన పరోక్షంగా నాటి ముఖ్యమంత్రి జగన్‌పై విమర్శల వర్షం కురిపిం చారు. అందుకే.. ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడారని చెప్పారు. తాను చూసిన రామోజీరావు లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ వివరించారు.
2008లో నేరుగా ఒకసారి రామోజీరావును కలిసి మాట్లాడినట్టు పవన్ కల్యాణ్ తెలిపారు. రామోజీరావు ప్రజల పక్షపాతి అని, జర్నలిస్టు విలువను కాపాడటంలో ముందున్నారని పేర్కొన్నారు. ప్రజల కోసం ఏం చేయాలనే అంశాలపైనే ఆలోచించారని తెలిపారు. ''2019లో నన్ను లంచ్ మీటింగ్ కు రామోజీరావు ఆహ్వానించారు. అప్పట్లో మా మధ్య దేశం, రాష్ట్రంలో పరిస్థితులు, పత్రికా రంగం గురించి చర్చ సాగింది. అనేక విలువైన సూచనలు ఆయన ఇచ్చారు. ఆ సమయంలో రామోజీరావు వేదనను నేను నేరుగా చూశాను'' అని పవన్ చెప్పారు.
ప్రజాస్వామ్యానికి పత్రిక స్వేచ్చ ఎంతో అవసరమో ఈ దేశానికి రామోజీరావు చాటి చెప్పారని పవన్ తెలి పారు. అటువంటి వ్యక్తి పై ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనందరికీ తెలుసునని గత వైసీపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. తన వ్యాపారాలపై దాడులు చేసినా.. తట్టుకుని.. జర్నలిస్టుగా ఎక్కడా కాంప్రమై జ్ కాకుండా ముందుకు సాగారని అన్నారు. ''నువ్వు ఏం చేస్తావో.. ఏం నమ్ముతావో త్రికరణ శుద్దిగా చేయి అని నాకు రామోజీరావు సూచించారు'' అని తెలిపారు.
రైట్ టూ ఇన్ ఫర్మేషన్ యాక్టు గురించి ఉద్యమ కర్తగా వ్యవహరించారని పవన్ తెలిపారు. ఆర్.టి.ఐ ద్వా రా ప్రభుత్వం ఏమి చేసినా ప్రజలు తెలుసుకోవచ్చని.. దీనిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారని చెప్పారు. స్టూడియోలు కట్టినా, సినిమాలు చేసినా.. ఆదర్శ జర్నలిస్టు భావాలు రామోజీ సొంతమని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులను బెదిరించినా.. ఎక్కడా వెనక్కి తగ్గలేదన్నారు. ''ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న సమయంలో ఏపీలో కూటమి విజయ వార్త విన్నారా లేదా అని నేను అడిగి తెలుసుకున్నా. విజయ వార్త విన్న తర్వాతే ఆయన తన ప్రాణాలు విడిచారు. అటువంటి మహోన్నత వ్యక్తి విగ్రహం అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయాలి'' అని పవన్ సూచించారు.