Begin typing your search above and press return to search.

జీరో బడ్జెట్ పాలిటిక్స్ : పవన్ మాటలు వక్రీకరించారా...?

అదేలా పుట్టిందో నాకే తెలియదు అని పవన్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. నేను జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తాను అని ప్రచారం చేశారు అని పవన్ అంటున్నారు.

By:  Tupaki Desk   |   21 Oct 2023 3:11 PM GMT
జీరో బడ్జెట్ పాలిటిక్స్ : పవన్ మాటలు వక్రీకరించారా...?
X

జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్న మాట జనసేన నుంచే బాగా పాపులర్ అయింది. 2019 ఎన్నికల వేళ ఈ మాట ఎక్కువగా వాడుకలోకి వచ్చింది. రాజకీయాలు అంటే భారీ బడ్జెట్ మూవీ అని అందరికీ తెలుసు. అలాంటిది జీరో బడ్జెట్ తో పాలిటిక్స్ చేయడం సాధ్యమా అన్న ప్రశ్న ఉంది. అయితే ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా కేవలం ప్రజాభిమానమే పెట్టుబడిగా పెట్టుకుని రాజకీయం చేయడం అన్నదే జీరో బడ్జెట్ వెనక ఉన్న ఉద్దేశ్యం.

ఇది పాతకాలంలో అంటే మొదటి ఎన్నికల నుంచి 1970 దాకా కొనసాగింది. ఆ తరువాత చూసుకుంటే ఎన్టీయార్ యార్ టీడీపీ పెట్టాక 1983, 1985లలో కూడా టీడీపీ జీరో బడ్జెట్ పాలిటిక్స్ నే చేస్తూ వచ్చింది. కానీ తరువాత రాజకీయం అత్యంత ఖరీదుగా మారిపోయింది. ఓటుకు నోటు అన్నదే ఎపుడూ హాట్ టాపిక్ గా ఉంటూ వస్తోంది.

ప్రతీ ఎన్నికకూ ఓటు వెరీ కాస్ట్లీ గురూ అన్నట్లుగా పొలిటికల్ సీన్ మారిపోతోంది. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ తాజాగా మంగళగిరి పార్టీ ఆఫీసులో జనసేన అధికార ప్రతినిధుల మీటింగులో మాట్లాడుతూ జీరో బడ్జెట్ పాలిటిక్స్ మీద తన మనసులో మాటను పంచుకున్నారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి నేను ఎపుడూ నా అభిప్రాయం చెప్పలేదు అని పవన్ అనడం విశేషం.

అదేలా పుట్టిందో నాకే తెలియదు అని పవన్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. నేను జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తాను అని ప్రచారం చేశారు అని పవన్ అంటున్నారు. అయితే నేను మాట్లాడింది వేరు అంటూ ఆయన వివరించే ప్రయత్నం చేశారు. ఓటును నోటుతో కొనే వ్యవస్థను మార్చే విధానం మీదనే నేను మాట్లాడాను తప్ప జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి కాదని ఆయన అంటున్నారు.

అంతే తప్ప ఎన్నికల ప్రక్రియలో కార్యకర్తలకు కనీసం మంచి నీళ్ళు, టీ కూడా పనిచేయించుకోమని నేను ఎపుడూ చెప్పలేదని పవన్ అంటున్నారు. అంతే కాదు పవన్ కీలక వ్యాఖ్యలే చేసారు. ఈ వ్యవస్థలో మార్పు ఇపుడే వస్తుందనుకోవడం కూడా పోరపాటే అంటున్నారు. అలా ఆశించడం కరెక్ట్ కాదని అన్నారు. అంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ విషయంలో జనసేన అసలైన అభిప్రాయం ఏంటో పవన్ చెప్పేశారు అన్న మాట.

ఎన్నికల్లో పోటీ చేయాలంటే ప్రచారం చేసుకోవడానికైనా డబ్బులు ఉండాలి. అదే విధంగా ఓటుకు నోటు ఇవ్వకపోవచ్చు కానీ ఖర్చు వర్తమానంలో చాలానే అవుతుంది అని అంటున్నారు. పవన్ సైతం అదే అంగీకరిస్తున్నారు. ఆయన చెప్పినది చూస్తే ఓటుకు నోటు ఇవ్వడం తప్పు కానీ ఎన్నికల్లో మిగిలిన ఖర్చులు తప్పవని. అందుకే జీరో బడ్జెట్ అంటే అసలు కుదరదు అని.

మరి క్యాడర్ కి ఇది ఎంతవరకూ అర్ధమవుతుందో తెలియదు కానీ జనసేన నుంచి పోటీ చేసే వారికి కూడా అంగబలం అర్ధబలం ఉండాల్సిందే అన్నది జనసేనాని మాటగా ఉంది అనుకోవాలి. జనసేన తరఫున తిరిగే వారికి కూడా ఖర్చులు పెట్టుకోకుండా బూత్ ల దాకా ఏజెంట్లను నియమించుకోకుండా ఎన్నికల భారాన్ని మోయకుండా జీరో బడ్జెట్ అనుకుంటూ పోతే అసలుకే ఎసరు వస్తుందని తమ పార్టీ జనాలను మేలుకొల్పేందుకే పవన్ ఈ మాటలు చెప్పారని అంటున్నారు.

నిజమే రాజకీయాలు మారాయి. గేం ఇది. ఆటలో ఏ ఒక్కరూ కూడా తాము అనుకున్నట్లుగా ఆడలేరు. ఎదుటి వారి ఆటను చూసి తాము కూడా ఆట తీరు మార్చుకోవాలి. అపుడే విజయానికి చేరువ అవుతారు. అదే పవన్ ఇండైరెక్ట్ గా చెప్పారనుకోవాలి. ఇంతకీ జనసేననూ జీరో బడ్జెట్ పాలిటిక్స్ ని మిక్స్ చేసిన వారు ఎవరు. ఎందుకు ఆ ప్రచారం వచ్చింది. అయిదేళ్ల తరువాత పవన్ 2024 ఎన్నికల ముందు ఎందుకు ఆ వివరణ ఇస్తున్నారు. ఇవన్నీ ప్రశ్నలు. జవాబు తెలుసుకోవాలంటే జనసేన అభ్యర్ధుల లిస్ట్ చూస్తేనే తప్ప అర్ధం కాదు అని అంటున్నారు.