వైసీపీని ర్యాగింగ్ చేసిన పవన్...!
ఈ సందర్భంగా పవన్ వైసీపీ నేతలను ప్రభుత్వాన్ని పట్టుకుని ర్యాగింగ్ చేశారు.
By: Tupaki Desk | 7 April 2024 5:50 PM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు రోజుల ఉత్తరాంధ్రా పర్యటన చేపట్టారు. ఆయన డైరెక్ట్ గా అనకాపల్లి లో దిగిపోయారు. ఆయన టీడీపీ కూటమి తరఫున ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పవన్ వైసీపీ నేతలను ప్రభుత్వాన్ని పట్టుకుని ర్యాగింగ్ చేశారు.
అనకాపల్లి అంటే ఒకప్పుడు బెల్లం గుర్తుకు వచ్చేదాని ఇపుడు కోడి గుడ్డు గుర్తుకు వస్తోందని ఆయన సెటైర్లు వేశారు. పరిశ్రమల మంత్రిగా అనకాపల్లికి చెందిన గుడివాడ అమర్నాధ్ ఉన్నారు. ఆయన పరిశ్రమల గురించి ఒక సందర్భంలో మాట్లాడుతూ కోడి గుడ్డు పెట్టాలంటే పొదగాలి అంటూ చాలా ప్రోసెస్ ఉందని చెప్పారు.
ఆ తరువాత ఆయనకు కోడి గుడ్డు మంత్రి అన్న పేరు సోషల్ మీడియా పెట్టేసింది. ఇపుడు అది బాగా స్థిరపడిపోయింది. దాంతో దాన్ని పట్టుకుని పవన్ కళ్యాణ్ కోడి గుడ్డు అంటూ ఎద్దేవా చేశారు. అనకాపల్లి అంటే కోడి గుడ్డే కనిపిస్తోందని అభివృద్ధి లేకుండా పెద్ద గుడ్డు పెట్టేశారు అని కామెంట్స్ చేశారు.
అనకాపల్లి బెల్లం మార్కెట్ కి బెల్లానికి ఏ మాత్రం విలువ లేకుండా చేశారు అని ఆయన మండిపడ్డారు. వీరికి బెల్లం కంటే కోడి గుడ్డు ఎక్కువ అని విరుచుకుపడ్డారు. ఇక జగన్ ని పట్టుకుని ఆయన ముఖ్యమంత్రి కాదు సారా వ్యాపారి అని ఘాటైన పదజాలాన్నే ఉపయోగించారు.
అమ్మ ఓడి పధకం అని ఒక వైపు చెబుతూ నాన్న తడి పధకాన్ని కూడా అమలు చేసి లక్షల కోట్లు దోచుకున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి అధికారం ఇస్తే భూములు దోచుకున్నారని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీకి అధికారం ఇచ్చింది భూములు దోచుకోవడానికా అని ఆయన ప్రశ్నించారు.
అభివృద్ధి లేదు, ఏమీ లేదు అంటూ ఆయన వైసీపీ ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. కోడి గుడ్డు మంత్రి ఒక్క రోడ్డుని కూడా వేయలేకపోయారు అని గుడివాడ మీద ఫైర్ అయ్యారు. డిప్యూటీ సీఎం ని అనకాపల్లికి ఇచ్చినా ఏమిటి ఉపయోగం అని ఆయన నిలదీశారు. మొత్తం మీద చూస్తే వైసీపీ ప్రభుత్వం మీద పవర్ ఫుల్ పంచ్ డైలాగులతో పవన్ హాట్ కామెంట్స్ చేశారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అనకాపల్లిని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ఆయన మాట ఇచ్చారు. సాక్ష్తత్తూ కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదంలో అనకాపల్లి బెల్లం ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అదే విధంగా అనకాపల్లి పేరుని మరింత విఖ్యాతం చేస్తామని పవన్ హామీ ఇచ్చారు. అనకాపల్లిని ఎన్ని రకాలుగా ముందంజలో ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.