లోకేష్ సభకు పవన్... జనసైనికుల ఆందోళనలో అర్ధం ఉందా?
ఫలితంగా... భవిష్యత్ తరాలకు లోకేష్ నాయకత్వానికి తన పరోక్ష మద్దతు తెలిపినట్లు అవుతుందని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది!
By: Tupaki Desk | 20 Dec 2023 10:13 AM GMTటీడీపీ నేతలు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువగళం సభ ఎంతో భారీగా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. పేరుకు ఇది యువగళం ముంగింపు సభ అని అంటున్నా... ఇది చినబాబు లోకేష్ కు పట్టాభిషేక సభ అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. దీంతో ఈ సభలో పవన్ ప్రజెంట్స్ ని టీడీపీ నేతలు బలంగా కోరుకుంటున్నారు. ఫలితంగా... భవిష్యత్ తరాలకు లోకేష్ నాయకత్వానికి తన పరోక్ష మద్దతు తెలిపినట్లు అవుతుందని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది!
అవును... వాస్తవానికి ఈ సభలో పాల్గొనడానికి వీలుకాదని పవన్ ముందుగానే చెప్పారని కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని అచ్చెన్నాయుడు అంగీకరించారు. ఉమ్మడి మేనిఫెస్టో సెట్ కాలేదు కాబట్టి ఆయన రావడం లేదన్నట్లుగా తెలిపారు! పవన్ వస్తారని అచ్చెన్న అంతకముందు ప్రకటించినప్పటికి కూడా ఉమ్మడి మేనిఫెస్టో ఓకే కాలేదు! సరే... ఆ సంగతి కాసేఫు పక్కనపెడితే... ఇటీవల పవన్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు.. పవన్ తో భేటీ అయిన పవన్ హాజరు కన్ ఫాం అని అంతా భావించారు!
దీంతో... ఆల్ మోస్ట్ సుమారు పదేళ్ల తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఒకే వేదికపై కనిపించబోతున్నారని తమ్ముళ్లు హ్యాపీ ఫీలయ్యారు. ఈ సమయంలో ఈ సభలో పవన్ చే యబోయే ప్రసంగంపై తీవ్ర ఆసక్తి నెలకొందని తెలుస్తుంది. ఈ సభ చినబాబు నారాలోకేష్ కు పట్టాభిషేకం వంటిదని చెబుతున్న సమయంలో... ఈ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఆసక్తిగా మారింది.
మరోపక్క ఈ సభకు పవన్ హాజరుకావడం లేదని తెలిపినప్పుడు జనసైనికులు కంఫర్ట్ గా ఫీలయ్యారని.. ఇది సరైన నిర్ణయంగా భావించారని చెబుతున్నారు. కారణం... ఈ సభద్వారా టీడీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ చంద్రబాబు తర్వాత మరో నాయకుడిని ఆ స్థానంలో రెడీ చేసుకుంటోందని భావిస్తుండటమే! టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వేరు, ఆ పార్టీ వారసుడి పట్టాభిషేకానికి వెళ్లడం వేరని పవన్ భావించారని ఆ సమయంలో జనసైనికులు హ్యాపీ ఫీలయ్యారని అంటున్నారు!
అయితే తాజాగా పవన్ కల్యాణ్.. లోకేష్ యువగళం సభకు హాజరు కావడానికి సిద్ధమైన నేపథ్యంలో కొంతమంది కాపు సామాజికవర్గానికి చెందిన వారు జీర్ణించికోలేకపోతున్నారని తెలుస్తుంది. కారణం... లోకేశ్ పట్టాభిషేకానికి వెళ్లడం అంటే.. ఆయనను భావి నాయకుడిగా నిలబెట్టే ప్రయత్నంలో పవన్ కీలక పాత్ర పోషించారన్నట్లుగానే భావించాలని.. ఇది కాపు సామాజికవర్గానికి తరాలకు సరిపడా ద్రోహం అని పలువురు అభిప్రాయపడుతున్నారు!
మరోపక్క పొత్తు ధర్మంలో భాగంగా హాజరైనంత మాత్రన్న తప్పేమీ లేదు కానీ... ఆ సభలో ఆయన చేయబోయే ప్రసంగం ఎలా ఉండబోతుంది... పొత్తుపై మాత్రమే ఉంటుందా.. లేక, లోకేష్ ని ఆకాశానికి ఎత్తే దిశగా సాగుతుందా అని ఆలోచిస్తూ ఎదురుచూస్తున్నారు! ఏమి జరగబోతుందనేది వేచి చూడాలి!