టీడీపీ బీజేపీ పొత్తులను సెట్ చేసేది పవనేనట....!
పొత్తుల విషయం వచ్చినపుడు కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని అని చెబుతున్నారు. విశాఖలో ఆమె తాజాగా పర్యటించిన వేళ మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి జనసేనతో పొత్తు ఉందని అన్నారు.
By: Tupaki Desk | 24 Sep 2023 3:00 AM GMTఏపీ బీజేపీ నేతలకు టీడీపీతో కలసి ముందుకు సాగుదామన్న కోరిక బలంగా ఉంది. దానిని బాహాటంగానే బయటపెట్టుకున్నారు. అయితే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అంతా కేంద్ర నాయకత్వం ఇష్టం వారు ఎలా అంటే అలా అంటూ తమకు ఏ అభ్యంతరం లేదని చెబుతున్నారు. గతంలో సోము వీర్రాజు ప్రెసిడెంట్ గా ఉన్నపుడు అయితే టీడీపీతో పొత్తు అని మీడియా అడిగిన వెంటనే గట్టిగా ఘాటుగా ఖండించేవారు.
మాకు టీడీపీ వైసీపీ రెండూ ప్రత్యర్ధి పార్టీలే అని చెప్పేవారు. అయితే దగ్గుబాటి పురంధేశ్వరి నాయకత్వం వచ్చాక టీడీపీ మీద సాఫ్ట్ కార్నర్ తో వ్యవహరిస్తున్నారు అన్న ప్రచారం సాగుతోంది. దానికి తోడు ఆమె వైసీపీనే టార్గెట్ చేస్తున్నారు.
పొత్తుల విషయం వచ్చినపుడు కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని అని చెబుతున్నారు. విశాఖలో ఆమె తాజాగా పర్యటించిన వేళ మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి జనసేనతో పొత్తు ఉందని అన్నారు. టీడీపీతో పొత్తు విషయం అన్నది పవన్ ఢిల్లీ వెళ్ళి తమ కేంద్ర నాయకత్వంతో చర్చిస్తారు అని అంటున్నారు. బీజేపీ అధినాయకత్వం తమ అభిప్రాయలను కూడా పరిగణనలోకి తీసుకుంటుందని ఆమె అంటున్నారు.
కేంద్రంలోని బీజేపీ ఎలాంటి డెసిషన్ తీసుకున్నా ఓకే అని చెప్పడం ద్వారా పురంధేశ్వరి టీడీపీతో పొత్తులకు తమ వరకూ ఏ రకమైన అభ్యంతరాలు లేవని చెప్పేశారు అంటున్నారు. అంటే ఒక విధంగా టీడీపీతో పొత్తు మీద ఆమె కొంత స్పష్టత ఇచ్చారు అని అంటున్నారు.
టీడీపీతో పొత్తు మీద పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలతో మాట్లాడుతారు అని ఆమె చెప్పడం ద్వారానే హింట్ ఇచ్చారని అంటున్నారు. ఏపీలఒ 2014లో మాదిరిగా మూడు పార్టీలు పోటీ చేయాలని బీజేపీలోని ప్రో టీడీపీ వర్గం భావిస్తోంది. ఇపుడు ఆ వర్గానికి బాసటగా పురంధేశ్వరి మాటలు ఉన్నాయని అంటున్నారు.
అయితే బీజేపీ నేతలు తమ అధినాయకత్వానికి వెళ్ళి టీడీపీతో పొత్తు విషయం మాట్లాడాలి కానీ మధ్యలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు అన్న ప్రశ్న అయితే తలెత్తుతోంది. కానీ పవన్ కళ్యాణ్ కి వెనక ఉన్న సామాజిక నేపధ్యం ఆయన సినీ గ్లామర్ తో బీజేపీ హై కమాండ్ ఆయన మాటకు విలువ ఇస్తుందని తద్వారా తాము అనుకుంటున్న టీడీపీతో పొత్తు కల సాకారం అవుతుందని ఏపీ బీజేపీలోని ఒక గ్రూప్ భావిస్తోంది అంటున్నారు.
కొద్ది రోజులలో పవన్ ఢిల్లీ వెళ్ళి బీజేపీ హై కమాండ్ కి అన్ని విషయాలూ వివరిస్తారు అని అంటున్నారు. అయితే పవన్ టీడీపెతో ముందే పొత్తు ప్రకటించేసి ఆనక బీజేపీ పెద్దలను కలిస్తే వారి నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలని అంటున్నారు. అసలు బీజేపీ పెద్దలు అపాయింట్మెంట్ పవన్ కి ఇస్తారా అన్నది మరో చర్చగా ఉంది.
ప్రత్యేక పార్లమెంట్ సమవేశాలు పూర్తి అయిన తరువాత బీజేపీ అగ్ర నాయకత్వం తెలంగాణా ఎన్నికల మీద ఫుల్ ఫోకస్ పెట్టింది అంటున్నారు. ఆ ఎన్నికల తరువాతనే ఏపీ పొత్తుల మీద ఏదో ఒకటి తేల్చుతారు అని అంటున్నారు. మొత్తానికి టీడీపీ పట్ల ఏపీ బీజేపీ నాయకత్వం పొత్తుల విషయంలో సుముఖంగానే ఉంది అన్నది పురంధేశ్వరి తాజా మాటలతో వ్యక్తం అయింది అంటున్నారు.