Begin typing your search above and press return to search.

జగన్ హయాంలో అసలు అప్పులు ఇవే.. పయ్యవుల లెక్కలపై తగులుకున్న వైసీపీ!

ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు అప్పుల వివరాలపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ లిఖితపూర్వకంగా క్లారిటీ ఇచ్చారు!

By:  Tupaki Desk   |   7 March 2025 4:47 PM IST
జగన్ హయాంలో అసలు అప్పులు ఇవే.. పయ్యవుల లెక్కలపై తగులుకున్న వైసీపీ!
X

ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ హయాంలో అప్పులు విపరీతంగా చేశారని.. ఫలితంగా రాష్ట్రాన్ని శ్రీలంక చేయబోతున్నారని.. అపులు చేసి పప్పు బెల్లాల్ల పంపిపెట్టారని కూటమి పార్టీలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలోనూ ఈ విమర్శలు కీలక భూమిక పోషించాయని అంటారు.

అయితే... తాము అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ అందించిన సంక్షేమ పథకాలు కంటిన్యూ చేస్తూనే, కొత్త పథకాలు అందిస్తామని, అందుకోసం అవసరమైన సంపదను సృష్టిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆ సమయంలో వైసీపీ పాలన వల్ల రాష్ట్రంలో అప్ప్పు రూ.14 లక్షలకోట్లు అనే ప్రచారం బలంగా జరిగిందని చెబుతారు!

ఇదే సమయంలో గతేడాది గవర్నర్ ప్రసంగంలో రూ.10 లక్షల కోట్లని.. ఆ సమయంలో విడుదల చేసిన శ్వేతపత్రంలో రూ.12.93 లక్షల కోట్లను కూటమి సర్కా ప్రచారం చేసిన పరిస్థితి! ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు అప్పుల వివరాలపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ లిఖితపూర్వకంగా క్లారిటీ ఇచ్చారు!

అవును... ఏపీలో వైసీపీ సర్కార్ హయాంలోని అప్పులపై స్పష్టత కరువైన సంగతి తెలిసిందే. అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం ఒక్కొక్కరూ ఒక్కో సందర్భంలో ఒక్కో అక్కె చెబుతున్న పరిస్థితి అనే చర్చ జరిగింది. ఈ సమయంలో ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ లిఖితపూర్వకంగా స్పందిస్తూ.. జగన్ హయాంలో పబ్లిక్ అప్పులు రూ.2,34,225 కోట్లని తెలిపారు.

ఇదే సమయంలో.. కార్పొరేషన్ ద్వారా చేసిన అప్పులు రూ.1,05,355 కోట్లని ఆర్థిక శాఖ క్లారిటీ ఇచ్చింది. అంటే... జగన్ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో చేసిన అప్పులు రూ.3,39,580 కోట్లని.. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.5,19,192 కోట్లని తాజాగా ఏపీ ఆర్థిక శాఖ స్పష్టం చేసింది!

దీంతో... వైసీపీ ఎక్స్ వేదికగా మండి పడింది. ఏపీ అప్పు రూ.10 లక్షల కోట్లు దాటిందని తప్పుడు ప్రచారం చేసి.. అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయిందని తెలిపింది. జగన్ హయాంలో 2019-2024 మధ్య అప్పు 2.57 లక్షల కోట్ల నుంచి 4.91 లక్షల కోట్లకి పెరిగినట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారని వెల్లడించింది.

ఈ సందర్భంగా... “మరి ఆంధ్రప్రదేశ్ లో అప్పు రూ.10 లక్షల కోట్లు అంటూ తప్పుడు ప్రచారం చేశావ్ కదా చంద్రబాబు.. ఇప్పుడు లెంపలేసుకుని ప్రజలకి బహిరంగ క్షమాపణలు చెప్తావా?” అని వైసీపీ ప్రశ్నించింది.