Begin typing your search above and press return to search.

శ్వేతపత్రాల్లో పయ్యావుల ఫస్ట్ స్టెప్ ఇదేనా?

ఈ క్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అప్పుడే పనిమొదలుపెట్టేసినట్లు తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   15 Jun 2024 4:12 AM GMT
శ్వేతపత్రాల్లో పయ్యావుల ఫస్ట్ స్టెప్ ఇదేనా?
X

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం మంత్రులతో తొలిసారి భేటీ అయిన చంద్రబాబు ఒక కీలక వ్యాఖ్య చేశారు! ఇందులో భాగంగా... శాఖల వారీగా శ్వేతపత్రాలు రూపొందించి ప్రజల ముందు ఉంచుదామని తెలిపారు. దీంతో ఈ విషయం ఆసక్తికర చర్చ జరిగింది. ఈ క్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అప్పుడే పనిమొదలుపెట్టేసినట్లు తెలుస్తుంది.

అవును... ఏపీలో కూటమి అధికరంలోకి రాగానే శాఖల వారీగా శ్వేతపత్రాలు అనే మాట చెప్పగానే చంద్రబాబు పక్కా క్లారిటీతో ఉన్నారనే కామెంట్లు వినిపించాయి. ఈ సమయంలో తాజాగా స్పందించిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్... రాష్ట్రంలోని అప్పులు, వాస్తవ ఆర్థిక పరిస్థితిపై నాలుగు శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఇందులో ప్రధానంగా... రాష్ట్రానికి ఉన్న అప్పు ఎంత? ఇందులో ఏయే కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పు ఎంత? ఆ మొత్తాన్ని ఎందుకోసం ఖర్చు చేశారు? ఐదేళ్లుగా పెండిగ్ లో ఉన్న బిల్లుల పరిస్థితి ఏమిటి? మొదలైన విషయాలపై లోతుగా వివరాలు సేకరిస్తున్నట్లు పయ్యావుల తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే అధికారులు రంగంలోకి దిగి.. ప్రతీశాఖ నుంచి నివేధిక కోరినట్లు తెలుస్తుంది.

మాజీ మంత్రిని కలిసిన తాజా మంత్రి!:

ఏపీ ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడిని.. ఏపీ ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే... గత టీడీపీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా యనమలకు విశేష అనుభవం ఉండటంతో... పలు సూచనలు, సలహాలు తీసుకోవడం కోసం కలిసినట్లు చెబుతున్నారు. కీలకమైన ఈ శాఖ నిర్వహణకు సంబంధించి సలహాలు తీసుకున్నట్లు తెలుస్తుంది.

జగన్ అసెంబ్లీ రావాలి!:

మరోపక్క ఏపీలో ప్రతిపక్షం అత్యంత బలహీనంగా ఉండటంతో... వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అనే చర్చ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో వైసీపీ నేత జగన్ అసెంబ్లీకి వచ్చి ప్రజల తరుపున మాట్లాడాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారుపయ్యావుల కేశవ్. రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండితీరాలని ఆయన నొక్కి చెప్పారు.