దేశీయంగా పీసీ వినియోగంలో ఏ కంపెనీ అగ్రస్థానంలో ఉంది?
అంతకంతకూ పెరుగుతున్న వినియోగానికి తగినట్లుగా పర్సనల్ కంప్యూటర్లు (పీసీ) డిమాండ్ పెరుగుతోంది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 2024లో పీసీ డిమాండ్3.8 శాతం మేరకు పెరిగిన వైనాన్ని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
By: Tupaki Desk | 26 Feb 2025 7:30 AM GMTఅంతకంతకూ పెరుగుతున్న వినియోగానికి తగినట్లుగా పర్సనల్ కంప్యూటర్లు (పీసీ) డిమాండ్ పెరుగుతోంది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 2024లో పీసీ డిమాండ్3.8 శాతం మేరకు పెరిగిన వైనాన్ని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 2024లో మొత్తం 14.4 మిలియన్ యూనిట్ల (మిలియన్ అంటే పది లక్షలు) పీసీల రవాణా జరిగినట్లుగా మార్కెట్ రీసెర్చ్ సెంటర్ ఐడీసీ వెల్లడించింది. ప్రస్తుతం ఏఐ ఆధారిత.. గేమింగ్ పీసీలకు డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లుగా పేర్కొంది.
ఇటీవల కాలంలో రూపాయి బలహీనపడటంతో పీసీల ధరలు పెరిగేందుకు కారణమైందని.. ఇది చిన్న.. మధ్యస్థాయి వ్యాపార సంస్థలతో పాటు.. వినియోగ విబాగంపై ప్రభావం చూపినట్లుగా చెబుతోంది. ఇక.. దేశీయ మార్కెట్ లో పీసీల్లో ఎవరు ఏ స్థానాల్లో ఉన్నారన్న వివరాల్ని వెల్లడించింది. 2024లో హెచ్ పీ తన అధిక్యతను ప్రదర్శించింది. మొత్తం మార్కెట్లో 30.1 శాతం పీసీల రవాణాతో హెచ్ పీ అగ్రస్థానంలో నిలిచింది.
లెనోవో సంస్థ 17.2 శాతం పీసీలను రవాణా చేసిందని.. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 7.3 శాతం వృద్ధి సాధించిందని పేర్కొంది. డెల్ 16.1 శాతంతో మూడో స్థానంలో నిలిచింది. ఈ సంస్థ పీసీలు 8.1 శాతం వార్షిక వృద్ధిని ప్రదర్శించాయి. తైవాన్ కు చెందిన ఏసర్ 15.1 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకోవగా.. ఆసుస్ మార్కెట్ వాటా కూడా పెరిగిన విషయాన్ని వెల్లడించారు.
ఈ ఏడాది పీసీ అమ్మకాల డిమాండ్ ను చూస్తే.. వెయ్యి డాలర్లు.. అంతకు పై ఖరీదైన ప్రీమియం నోట్ బుక్ లకు 13.8 శాతం పెరిగినట్లుగా పేర్కొన్నారు. పీసీల డిమాండ్ అంతర్జాతీయ సంస్థలు మాత్రమే కాదు ప్రభుత్వ విభాగాల నుంచి డిమాండ్ అధికంగా ఉన్నట్లుగా రిపోర్టు వెల్లడించింది. 2024లో చివరి మూడు నెలల కాలంలో పీసీల మార్కెట్ 6.9 శాతం.. నోట్ బుక్ విభాగంలో 9.6 శాతం వృద్ధిని ప్రదర్శించాయి. షిప్ మెంట్లను మరింత లోతుగా చూస్తే.. నోట్ బుక్ లు 4.5 శాతం.. డెస్కు టాప్ లు 1.8 శాతం మేర వృద్ధిరేటును నమోదు చేసినట్లుగా పేర్కొన్నారు.