Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ సీన్ రివర్స్... షర్మిల పుణ్యమేనట ?

ఏపీ కాంగ్రెస్ కి ఏమి పరిస్థితి వచ్చిందని ఇప్పటికీ అంతా అనుకుంటూ ఉంటారు.

By:  Tupaki Desk   |   16 Dec 2024 4:19 AM GMT
కాంగ్రెస్ సీన్ రివర్స్... షర్మిల పుణ్యమేనట ?
X

ఏపీ కాంగ్రెస్ కి ఏమి పరిస్థితి వచ్చిందని ఇప్పటికీ అంతా అనుకుంటూ ఉంటారు. నలభై శాతం ఓటు షేర్ ఆ పార్టీ సొంతం. అలాంటి పార్టీ విభజన తరువాత ఏపీలో సోదిలో లేకుండా పోయింది అని అంటున్నారు. ఒక్క శాతం ఓటు షేర్ కి పడిపోయింది. దానిని పైకి లేపే పనిలో ఎవరు వచ్చినా ఏమీ చేయలేక పోతున్నారు.

వైఎస్సార్ వారసురాలిగా ఉన్న షర్మిల వస్తే కనీసంగా ఓటు షేర్ అయిదారు శాతమైనా పెరుగుతుందని భావించి 2024 ఎన్నికలకు ముందు ఆమెను కాంగ్రెస్ లోకి తెచ్చారు. ఇలా చేరిన వెంటనే అలా పీసీసీ పీఠం అప్పగించారు. అయితే షర్మిల వల్ల కాంగ్రెస్ కి ఇసుమంత కూడా లాభం లేదని తేలిపోతోంది అని అంటున్నారు. ఆమె వన్ సైడ్ రాజకీయాలే ఇందుకు కారణం అంటున్నారు.

ఒక వైపే చూడు అన్నట్లుగా ఆమె వైసీపీ వైపే చూస్తూ చేస్తున్న పాలిటిక్స్ తో కాంగ్రెస్ లోని సీనియర్లు వైఎస్సార్ అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు అని అంటున్నారు. దాంతో వారంతా కాంగ్రెస్ కి షర్మిలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు అని అంటున్నారు.

కాంగ్రెస్ ఎప్పటికైనా బాగుపడుతుందని పంటి బిగువున అన్నీ భరించి ఉన్న వైఎస్సార్ సన్నిహితులు ఆయనతో కలసి పనిచేసిన వారు ఈ రోజుకీ ఆ పార్టీ మీద ప్రేమను కొనసాగిస్తున్నారు. వారే షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలు అందాయి అంటే మొదట సంతోషించారు. కానీ ఆమె తీరు పూర్తిగా ఏకపక్షంగా వ్యక్తిగత అజెండాతో ఉండడంతో వారంతా జీర్ణించుకోలేకపోతున్నారు అని అంటున్నారు.

దాంతో ఇక ఎన్ని ప్రయోగాలు చేసినా ఎవరు పీసీసీ చీఫ్ అయినా కాంగ్రెస్ అయితే ఇప్పట్లో బాగుపడదని ఒక నిర్ణయానికి వచ్చిన వారు అంతా ఆల్టర్నేషన్ వైపు చూస్తున్నారు అని టాక్ నడుస్తోంది. ఎందుకంటే కాలం గడచిపోతోంది. కాంగ్రెస్ ఎత్తి గిల్లడం లేదు. తాను ఇంకా కొనసాగితే తమతో పాటు నమ్ముకున్న వారు కూడా మునిగిపోతారు అన్న కంగారుతోనే వారు కొత్త స్టెప్ ని కొత్త ఏడాదిలో తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు అని అంటున్నారు.

అలా కాంగ్రెస్ లోని వైఎస్సార్ సన్నిహితులు ఆయంతో కలసి పనిచేసిన వారు అంతా అత్యధిక భాగం ఇపుడు వైసీపీలో చేరేందుకు సిద్ధపడుతున్నారని తెలుస్తోంది. రాయలసీమ జిల్లా నుంచి కోస్తా జిల్లాల వరకూ చూస్తే కొందరు పేరు గడించిన సీనియర్ నేతలు మాజీ మంత్రులు ఉన్నారు.

వారు వైసీపీని ఎంచుకుంటున్నారని అంటున్నారు. ఏపీలో కూటమి పార్టీలలో బీజేపీలో చేరేందుకు ఆసక్తి వారికి లేదని వైఎస్సార్ మాదిరిగానే తామూ టీడీపీకి యాంటీ కాబట్టి ఆ వైపు చూడరని అందుకే వైసీపీలోకి వెళ్తారని ప్రచరంలో ఉంది. షర్మిల పీసీసీ చీఫ్ గా వచ్చాక పార్టీ ఎదగకపోవడం తో పాటు మరిన్ని ఇబ్బందులు వస్తున్నాయని భావించే వారు ఈ నిర్ణయానికి వస్తున్నారుట. అదే జరిగితే పార్టీ నుంచి వరస జంపింగులతో కునారిల్లుతున్న వైసీపీకి ఇది ఒక విధంగా ఆక్సిజన్ లాంటిదే అని అంటున్నారు.