రేషన్ మాఫియాపై ఉక్కుపాదం..రంగలోకి సీఐడీ
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సీఐడీ విచారణకు ఆయన ఆదేశించారు.
By: Tupaki Desk | 5 Dec 2024 8:30 PM GMTవైసీపీ హయాంలో కాకినాడ పోర్టు కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగిందని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే కాకినాడ పోర్టుకు వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీజ్ ది షిప్ అంటూ రేషన్ మాఫియాకు వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా రేషన్ బియ్యం అక్రమ రవాణా విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సీఐడీ విచారణకు ఆయన ఆదేశించారు. రేషన్ బియ్యం ఎక్కడి నుంచి వస్తోంది, విదేశాలకు తరలిస్తోంది ఎవరు, ఇందులో పాత్రధారులు, సూత్రధారులపై విచారణ చేపట్టాలని నాదెండ్ల ఆదేశించారు.
అంతేకాదు, పీడీఎస్ రైస్ అక్రమంగా రవాణా చేసేవారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పీడీఎస్ అక్రమాలను అణచివేయాలని, బాధ్యులపై కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్లు, సంబంధిత అధికారులకు నాదెండ్ల చెప్పారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు గురి కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. నేర తీవ్రతని బట్టి అవసరమైతే అక్రమంగా రేషన్ బియ్యం అమ్మేవారిపై రౌడీ షీట్లు తెరవాలని సూచించారు
6(ఏ) కేసులు, సీజ్ చేసే విషయంలో అలసత్వం వద్దని, తనిఖీలు, దాడుల కోసం పటిష్టమైన సమన్వయ వ్యవస్థ ఏర్పాటు కావాలని ఆదేశించారు. అక్రమ రవాణాను కోర్టులో ప్రూవ్ చేసేందుకు ల్యాబ్ పరీక్షలు, రిపోర్ట్ లు వేగంగా తీసుకోవాలని సూచించారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి నిధులు వెళ్లేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటి వరకు లక్షా 61 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని చెప్పారు.