భారతీయుల ఇంగ్లిష్ మాటలు, రాతలపై ఇంట్రస్టింగ్ రిపోర్ట్!
ఈ నేపథ్యంలో ఇంగ్లిష్ భాష మాట్లాడటం, రాయడం పై ఓ సర్వే తెరపైకి వచ్చింది.
By: Tupaki Desk | 10 Jan 2025 4:02 AM GMTదేశ భాషలందూ తెలుగు లెస్స అని ఎలా చెబుతామో.. ప్రపంచ భాషలందు ఇంగ్లిష్ లెస్స అన్నట్లుగా చాలా మంది చెబుతారు. ఈ భాష వస్తే ప్రపంచంలో మెజారిటీ దేశల్లో నెట్టుకురావొచ్చని అంటుంటారు. అందుకే భారత్ తో పాటు పలు ప్రపంచ దేశాలు.. వారి వారి జాతీయ భాషతో పాటు ఇంగ్లిష్ కు అధిక ప్రాధాన్యం ఇస్తుంటాయని చెబుతారు.
ప్రధానంగా భారత్ వంటి దేశాల్లో పాఠశాల విధ్య అత్యధికంగా ఆంగ్ల మాధ్యమంలోనే సాగుతుందని.. ఇక్కడ చాలా చోట్ల వారి వారి రీజనల్ లాంగ్వేజ్ అనేది సెకండ్ లాంగ్వేజ్ గా ఉంటుందని.. ఆంగ్లం ముద్దు, మిగిలినవి హద్దు అన్నట్లుగా సాగుతుందని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో ఇంగ్లిష్ భాష మాట్లాడటం, రాయడం పై ఓ సర్వే తెరపైకి వచ్చింది.
అవును... ప్రపంచ దేశాల్లోని ప్రజల ఇంగ్లిష్ ప్రావిణ్యంతో పాటు భారతదేశంలోని ప్రజానికానికి ఆంగ్లంపై ఉన్న పట్టుకు సంబంధించి "పియర్సన్ గ్లోబల్ ఇంగ్లీష్ ప్రొఫిషియెన్సీ రిపోర్ట్ - 2024" తెరపైకి వచ్చింది. సుమారు 7,50,000 వెర్సెంట్ పరీక్షల నుంచి సమీకరించి, విశ్లేషించిన డేటా నుంచి ఈ నివేధిక తయారుచేసినట్లు చెబుతున్నారు.
ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా... భారత్ లో సగటు ఇంగ్లిష్ మాట్లాడే స్కోరు (57), గ్లోబల్ యావరేజ్ ఇంగ్లిష్ మాట్లాడే స్కోర్ (54) కంటే ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. ఇదే సమయంలో... దేశ సగటు ఇంగ్లిష్ రైటింగ్ స్కోరు (61) అనేది.. గ్లోబల్ యావరేజ్ ఇంగ్లిష్ రైంటింగ్ స్కోరు (61)కి సమానంగా ఉందని వెల్లడించింది.
ఇదే సమయంలో... భారత్ లో ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగంలో ఇంగ్లిష్ అత్యధికంగా మాట్లడే స్కోరు 63తో అగ్రస్థానంలో ఉందని.. ఇది ప్రపంచ సగటు (56) ను అధిగమించిందని.. అయితే, దీనికి విరుద్ధంగా హెల్త్ కేర్ అత్యల్ప స్కోరు (45) నమోదు చేసిందని ఈ నివేదిక తెలిపింది. ఇక... భారత్ లో అత్యధికంగా ఇంగ్లిష్ మాట్లాడే రాష్ట్రాల్లో ఢిల్లీ (63) అగ్రస్థానంలో ఉందని తెలిపింది.
ఇదే సమయంలో... ఢిల్లీ తర్వాత స్థానాల్లో రాజస్థాన్ (60), పంజాబ్ (58) ఉన్నాయని నివేదిక వెల్లడించింది. ఓవరాల్ గా భారత్ లో 20 శాతం మంది ప్రజలు ఇంగ్లిష్ లో అనర్గలంగా మాట్లాడగలరని తెలిపింది. ఇక బ్రిటన్ లో 98.3 శాతం, అమెరికాలో 95 శాతం ఇంగ్లిష్ బాగా మాట్లాడతారని నివేదిక తెలిపింది.