Begin typing your search above and press return to search.

పవన్ కామెంట్స్ పై పెద్దిరెడ్డి ఫైర్... కీలక నిర్ణయం!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా వారాహి యాత్రలో దాడులపై చేసిన కామెంట్స్ పై పెద్దిరెడ్డి ఫైరయ్యారు

By:  Tupaki Desk   |   12 Sep 2023 5:21 AM GMT
పవన్ కామెంట్స్ పై పెద్దిరెడ్డి ఫైర్... కీలక నిర్ణయం!
X

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా వారాహి యాత్రలో దాడులపై చేసిన కామెంట్స్ పై పెద్దిరెడ్డి ఫైరయ్యారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో పవన్ పై పరువునష్టం దావా వేయనున్నట్లు పెద్దిరెడ్డి హెచ్చరించారు. ఇదే సమయంలో విచారణకు ఆదేశించారు. కేంద్ర నిఘా వర్గాలు అంటూ కబుర్లు చెప్పడం ఫ్యాషన్ అయిపోయిందని ఫైరయ్యారు.

అవును... వారాహి తొలివిడత యాత్రలో భాగంగా ప్రభుత్వం భారీ స్కెచ్ వేసిందని, ఇందులో భాగంగా కోనసీమ జిల్లాల్లో 50మందిని చంపాలని కుట్ర చేశారని, దీనికోసం రెండు వేల మంది రౌడీలను రాయలసీమ నుంచి దింపారని పవన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైరయ్యారు. మొన్న వాలంటీర్లపై అవాకులూ చెవాకులూ పేలి, ఇప్పుడు హత్యలు అంటూ కబుర్లు చెబుతున్నారన్ని అన్నారు.

దీంతో ఈ విషయాన్ని అంత సులువుగా వదిలేది లేదన్నట్లుగా స్పందించిన మంత్రి... ఈ అంశంపై పోలీసులు విచారణ కోరుతున్నామని తెలిపారు. ఇదే సమయంలో పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. మాటమాటకీ ప్రభుత్వంపైనా, ప్రభుత్వ వ్యవస్థలపైనా బురదజల్లడానికి కేంద్ర నిఘావర్గాలను సాకుగా పెట్టుకుంటారని, ఇదొక అలవాటుగా మారిందని పెద్దిరెడ్డి మండిపడ్డారు.

ఆ సంగతి అలా ఉంటే... ఇదే సమయంలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ నేతలు చేపట్టిన బంద్ పై కూడా పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... చంద్రబాబు అరెస్టుపై ప్రజల్లో ఎలాంటి నిరసన రాలేదని అన్నారు. టీడీపీ బంద్‌ ను ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదని చెప్పారు.

ఇదే సమయంలో... చంద్రబాబు అరెస్టుకు మద్దతుగా రాష్ట్రం మొత్తం షాపులు మూయిస్తామని చెప్పిన టీడీపీ నేతలు, చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్‌ ను కూడా మూయలేదని ఎద్దేవా చేశారు. అనంతరం... స్కిల్‌ డెవలప్ మెంట్ స్కాం కేసు కేవలం ఆరంభం మాత్రమేనని చెప్పిన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి... చంద్రబాబుపై ఇంకా చాలా కేసులు ఉన్నాయని, పక్కా ఆధారాలతో సీఐడీ దర్యాప్తు చేస్తోందని స్పష్టం చేశారు.