రోజా వర్సెస్ పెద్దిరెడ్డి: ఓడినా - గెలిచినా పంతం పంతమే ..!
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా, మాజీ మంత్రి , ప్రస్తుత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మధ్య రాజకీయ విభేదాలు ఉన్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 12 Feb 2025 9:30 AM GMTవైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా, మాజీ మంత్రి , ప్రస్తుత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మధ్య రాజకీయ విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. కేజే కుమార్ దంపతులను తన నియోజకవర్గంలో ప్రోత్సహించి.. తనను దెబ్బతీసేందుకు పెద్దిరెడ్డి ప్రయత్నించారంటూ.. కొన్నాళ్ల కిందట రోజ ఆరోపించిన విషయం తెలిసిందే. అదే సమయంలో తనకు చెప్పకుండానే పెద్దిరెడ్డి నగరిలో రాజకీయాలు చేస్తున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా.. మొదలైన వీరిద్దరి రాజకీయాలు.. పతాక స్థాయికి కూడా చేరాయి.
ఇక, ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే.. రోజా గత ఎన్నికల్లో ఓడిపోయారు. పెద్దిరెడ్డి విజయం దక్కించుకు న్నారు. అయితే.. వీరి పార్టీ కూడా ఘోర పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో ఓడినా.. గెలిచినా.. నాయకులు పార్టీ కోసం పనిచేయాల్సి ఉంటుంది. కానీ. రోజా, పెద్దిరెడ్డి మధ్య మాత్రం రాజకీయంగా వివాదాలు రగులుతూనే ఉన్నాయి. తాజాగా పెద్దిరెడ్డి ప్రోత్సబలంతోనే .. గాలి ముద్దుకృష్ణమ తనయుడు.. జగదీష్ నాయుడు వైసీపీలో చేరుతున్నట్టు తిరుపతి రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
జగదీష్ నాయుడు త్వరలోనే వైసీపీలో చేరనున్నట్టు పెద్ద ఎత్తున చర్చలు కూడా సాగుతున్నాయి. గాలి ముద్దుకృష్ణమ కుటుంబం వాస్తవానికి టీడీపీలో ఉంది. ఆయన సోదరుడు భాను కూడా.. ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో జగదీష్‌ను వైసీపీలోకి తీసుకురావడం వెనుక పెద్దిరెడ్డి కీలక వ్యూహం పన్నారన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. అంతేకాదు.. అటు టీడీపీని దెబ్బకొట్టడంతోపాటు.. రోజాపై కూడా రాజకీయంగాపైచేయి సాధించే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు.
మరోవైపు.. నగరిలో రోజా దూసుకుపోతున్నారు. ఈ నియోజవర్గం నుంచి రెండు సార్లు ఆమె వరుసగా గెలిచారు. మంత్రిగా కూడా చక్రంతి ప్పారు. కానీ, గత ఎన్నికల్లో కూటమి దెబ్బకు ఓడిపోయారు. ఇటీవల మళ్లీ తన నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. ఇలాంటి సమయంలో ఆమెకు పోటీగా మరో నేతను చేర్చుకునే ప్రతిపాదన రావడం.. పెద్దిరెడ్డికనుసన్నల్లో నే ఇదంతా జరగడంతో రోజా మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. జగదీష్ చేరిక అంశంపై రోజాకు సమాచారం ఇవ్వలేదని తెలిసింది. అయితే.. ఈ విషయం తెలిసిన తర్వాత మాత్రం ఆమె వైసీపీ అధినేతపై ఒత్తిడి తెస్తున్నారని తెలిసింది. మరి జగన్ ఏంచేస్తారోచూడాలి.