Begin typing your search above and press return to search.

బొజ్జ‌ల అలా.. పెమ్మ‌సాని ఇలా.. టీడీపీకి ఏమైంది?

అస‌లే కీల‌క ఎన్నిక‌ల స‌మ‌రం. ఏ చిన్న అవ‌కాశం వ‌చ్చినా త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని ముందు కు సాగాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు భావిస్తున్నారు.

By:  Tupaki Desk   |   27 March 2024 9:45 AM GMT
బొజ్జ‌ల అలా.. పెమ్మ‌సాని ఇలా.. టీడీపీకి  ఏమైంది?
X

అస‌లే కీల‌క ఎన్నిక‌ల స‌మ‌రం. ఏ చిన్న అవ‌కాశం వ‌చ్చినా త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని ముందు కు సాగాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు భావిస్తున్నారు. అందుకే 75 ఏళ్ల వ‌య‌సులోనూ ఆయ‌న క‌ష్ట మెరుగ‌కుండా శ్ర‌మిస్తున్నారు. కానీ, క్షేత్రస్తాయిలో నాయ‌కులు మాత్రం క‌ట్టు త‌ప్పుతున్నారు. వారికి తెలిసి అంటున్నారో.. తెలియ‌క అంటున్నారో.. లేక‌, దూకుడుగా ఉంటే త‌ప్ప‌.. పేరు రాద‌ని భావిస్తున్నారో తెలియ‌దు కానీ.. సంచ‌ల‌న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో మీడియాకెక్కుతున్నారు.

బొజ్జ‌ల సుధీర్‌రెడ్డి: ఈయ‌న మాజీ మంత్రి, టీడీపీ కీల‌క నాయ‌కుడు దివంగ‌త బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి త‌న‌యుడు. శ్రీకాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గం బొజ్జ‌ల కుటుంబానికి కంచుకోట‌. వ‌రుస విజ‌యాలు ఏకంగా 7 సార్లు ద‌క్కించుకున్న గోపాల‌కృష్నారెడ్డి అంద‌రివాడుగా గుర్తింపు పొందారు. మ‌రి ఆయ‌న త‌న‌యుడిగా బొజ్జ ల సుధీర్‌రెడ్డి గ‌త ఎన్నిక‌ల్లోనే అరంగేట్రం చేసినా ఓడిపోయారు. దీని నుంచి ఆయ‌న పాఠాలు నేర్చుకున్న‌ట్టుగా లేదు. పార్టీ నేత‌ల‌ను దూరం చేసుకున్నారు. ఇప్పుడు ప్ర‌జ‌ల‌ను కూడా దూరం చేసుకుంటున్నార‌నే టాక్ వినిపిస్తోంది. వ‌లంటీర్ల‌ను ఉగ్రవాదులుగా పోల్చ‌డం, వారిని స‌మాజంలో ఏరిపారేయాల‌న‌డం.. ఆయ‌న‌కు సెగ మామూలుగా పెట్ట‌డం లేదు.

పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌: ఈయ‌న ఎన్నారై టీడీపీ నాయ‌కుడు. గుంటూరు పార్ల‌మెంటు స్థానాన్ని ఈయ‌న కు చంద్ర‌బాబు కేటాయించారు. ప్ర‌చారం కూడా ప్రారంభించారు. కానీ, తాజాగా ఈయ‌న.. ముస్లింల‌పై తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశాయి. ``ముస్లింలు.. దావూద్ సంత‌తి. వారిని నియోజ‌క‌వ‌ర్గం నుంచి పంపేయాలి. దానికి నేను క‌ట్టుబ‌డ్డాను`` అని వ్యాఖ్యానించ‌డం.. స్థానికంగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అయిం ది. దీనిపై ముస్లిం సంఘాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతోపాటు.. ఎన్నిక‌ల సంఘానికి కూడా ఫిర్యాదులు చేశాయి.

ముస్లింల నుంచి సెగ పెరుగుతున్న నేప‌థ్యంలో 24గంటలు గడవక ముందే పెమ్మసాని చంద్రశేఖర్ ముస్లిం సమాజానికి వివరణ ఇచ్చారు. జరిగిన తప్పుని వివరించి క్షమాపణ కోరారు. ``నేను సద్దాం హుస్సేన్ గారి గురించి మాట్లాడటం తప్పు ముస్లిం సోదరుల ఆత్మభిమానానికి భంగం కలిగినందుకు తన వ్యాఖలను వెనక్కి తీసుకుంటున్నా`` అని చెప్పుకొచ్చారు. కానీ, ఇప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగింది. మైనారిటీలు ఆయ‌న‌కు దూర‌మ‌య్యారు. మ‌రి ఇలాంటివాటిని క‌ట్ట‌డి చేయాల్సిన చంద్ర‌బాబు చూస్తూ ఉన్నారా? లేక ఏం జ‌రిగితే అదే జ‌రుగుతుంద‌ని భావిస్తున్నారా? అనేది చూడాలి.