Begin typing your search above and press return to search.

మోడీ కేబినెట్ లో పెమ్మసాని, బండి సంజయ్ స్పెషల్

ఓవరాల్ గా మోడీ మంత్రివర్గంలో ఇరు తెలుగు రాష్ట్రాలకు కలిపి 5 బెర్త్ లు దక్కాయి.

By:  Tupaki Desk   |   11 Jun 2024 1:07 PM GMT
మోడీ కేబినెట్ లో పెమ్మసాని, బండి సంజయ్ స్పెషల్
X

ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా మారిన టీడీపీ ఎంపీలకు మోడీ సర్కార్ లో కేంద్ర మంత్రి పదవులు ఇచ్చిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు మ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ దక్కగా, తొలిసారి ఎంపీగా గెలిచిన గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పదవి కేటాయించారు. నరసాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాస వర్మకు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి పదవి వచ్చింది. మరోవైపు, తెలంగాణ నుంచి మోడీ 3.0 కేబినెట్ లో కిషన్ రెడ్డికి బొగ్గు, గనుల శాఖ, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ కు హోంశాఖ సహాయమంత్రి పదవి దక్కింది. ఓవరాల్ గా మోడీ మంత్రివర్గంలో ఇరు తెలుగు రాష్ట్రాలకు కలిపి 5 బెర్త్ లు దక్కాయి.

తమ రాష్ట్రాలకు చెందిన ఐదుగురికి మోడీ మంత్రివర్గంలో చోటు దక్కడంపై తెలుగు ప్రజలు గర్వపడుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అతి పిన్న వయసులో కేంద్ర మంత్రి అయిన వ్యక్తిగా ఎంపీ రామ్మోహన్ నాయుడు రికార్డు క్రియేట్ చేశారు. పెమ్మసాని, బండి సంజయ్ లు కూడా తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఎన్నికల అఫిడవిట్ లో ప్రకటించిన ప్రకారం మోడీ కేబినెట్ లో పెమ్మసాని అత్యంత ధనిక కేంద్ర మంత్రిగా నిలిచారు. 5705 కోట్ల రూపాయల ఆస్తులతో పెమ్మసాని రిచెస్ట్ ఎంపీనే కాదు..రిచెస్ట్ కేబినెట్ మినిస్టర్ గా కూడా రికార్డు క్రియేట్ చేశారు.

ఇక, బండి సంజయ్ మరో రకంగా వార్తల్లో నిలిచారు. ఎక్కువ సంఖ్యలో క్రిమినల్ కేసులున్న కేబినెట్ మంత్రిగా ఆయన నిలిచారు. ఓవరాల్ గా బండి సంజయ్ పై 42 కేసులున్నాయి. కారణాలేమైనా, మోడీ కేబినెట్ లో పెమ్మసాని, బండి సంజయ్ లకు మాత్రం ప్రత్యేకత ఉండడం విశేషం. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.