కేంద్రంలో అత్యంత సంపన్న మంత్రి ఎవరో తెలుసా ?
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అత్యంత సంపన్న ఎంపీ అభ్యర్థిగా కూడా పెమ్మసానే నిలిచారు.
By: Tupaki Desk | 11 Jun 2024 6:57 AM GMTప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర క్యాబినెట్ లో అత్యంత సంపన్న మంత్రి ఎవరో తెలుసా ? మన తెలుగువాడే. తెలుగుదేశం పార్టీ గుంటూరు ఎంపీ డాక్టర్ చంద్ర శేఖర్ పెమ్మసాని అత్యంత సంపన్న మంత్రిగా నిలిచారు. చంద్రశేఖర్ పెమ్మసాని తన ఆస్తులను రూ.5705 కోట్లుగా చూపించారు. 18వ లోక్‌సభ మంత్రి మండలిలో ఆయనే సంపన్న మంత్రిగా ఉన్నారు. కేంద్ర సహాయ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారంచేశారు. ఆయనకు గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ ను కేటాయించారు.
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అత్యంత సంపన్న ఎంపీ అభ్యర్థిగా కూడా పెమ్మసానే నిలిచారు. కేంద్ర క్యాబినెట్ ర్యాంక్ మంత్రుల్లో మాత్రం జ్యోతిరాధిత్య సింథియా రూ.484 కోట్లతో అత్యంత సంపన్న మంత్రిగా నిలిచారు. లోక్‌సభకు ఎన్నికైన వారిలో సింథియా సంపన్న ఎంపీల్లో ఆరవ స్థానంలో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన టాప్ 10 సంపన్న ఎంపీల్లో పెమ్మసాని, సింథియాలకు మాత్రమే మంత్రి పదవులు దక్కాయి.
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో జన్మించిన పెమ్మసాని చంద్రశేఖర్ పెమ్మసాని నరసరావుపేటలో చదివాడు. ఎంసెట్ లో రాష్ట్రస్థాయిలో 27వ ర్యాంకు సాధించి ఉస్మానియాలో డాక్టర్ చదివాడు. పెన్సిల్వేనియాలోని డాన్‌విల్లేలోని గీసింజర్ మెడికల్ సెంటర్‌లో ఇంటర్నల్ మెడిసిన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ శిక్షణను పూర్తి చేశాడు . అతని పోస్ట్ గ్రాడ్యుయేట్ శిక్షణ సమయంలో, అతను వరుసగా రెండు సంవత్సరాలు జాతీయ వైద్య విజ్ఞాన పోటీలో పెన్సిల్వేనియా ప్రతినిధిగా పనిచేశాడు. తదనంతరం, అతను సుమారు ఐదు సంవత్సరాలు జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం మరియు సినాయ్ ఆసుపత్రిలో వైద్యునిగా పనిచేశాడు ,