Begin typing your search above and press return to search.

సచివాలయాల వద్ద పెన్షన్ పంపిణీ

ఏపీలో వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పడింది.

By:  Tupaki Desk   |   31 March 2024 1:14 PM GMT
సచివాలయాల వద్ద  పెన్షన్  పంపిణీ
X

ఏపీలో వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పడింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఇది నిలిచి పోయింది. తిరిగి ఎన్నికలు అయిపోయిన తరువాత ఎన్నికల కోడ్ తీసేసిన తరువాత కానీ వాలంటీర్లు విధులలో చేరలేరు.

దాంతో దాదాపుగా మూడు నెలల పాటు వాలంటీర్లు లేకుండానే ఏపీలో సామాజిక పెన్షన్ పంపిణీ చేయాల్సి ఉంది. అదే విధంగా వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ అన్నది నేరుగా అందచేయడం అన్నది జరగని పనిగా ఉంది. దీనికి సంబంధించి ఆల్టర్నేషన్ ని రెడీ చేసుకోమని ఈసీ సూచించింది.

దాంతో ఇపుడు ఏపీలో ఉన్న ఆపద్ధర్మ ప్రభుత్వం పెన్షనర్లకు డోర్ డెలివరీ ఎలా చేయాలన్న దాని మీద ఆలోచించింది. చివరికి ఒక నిర్ణయం తీసుకుంది. డోర్ డెలివరీ చేయాలంటే లక్షలాది మంది సిబ్బంది అవసరం అవుతారు. కాబట్టి దగ్గరలో ఉన్న సచివాలయాలకు పెన్షనర్లు వస్తే అక్కడే వారికి పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటారు అని అంటున్నారు.

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక ప్రకటన చేశారు. పెన్షనర్లు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు అని ఆయన అంటూ భరోసా ఇచ్చారు. వాలంటీర్లు ఈసీ ఆంక్షల నేపధ్యంలో ఇంటింటికీ వెళ్ళి అందించలేరు కాబట్టి ఆయన గ్రామ వార్డు సచివాలయాలలోనే పెన్షనర్లు వెళ్లి పెన్షన్ తెచ్చుకోవాలని ఆయన సూచించారు.

సామాజిక పెన్షన్లు అన్నీ ఏప్రిల్ నెల 3వ తేదీ నుంచి పంపిణీ చేస్తారు అని ఆయన వివరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అక్కసుతోనే వాలంటీర్లను విధుల నుంచి దూరం చేశారని ఆయన విమర్శించారు. మొదటి నుంచి ఆయన ఈ వ్యవస్థ అంటే భయపడుతున్నారు అని సజ్జల హాట్ కామెంట్స్ చేశారు.

మరో వైపు చూస్తే వాలంటీర్లు మంచి చేస్తున్నా తట్టుకోలేక వారి మీద మొదటి నుంచి విపక్షాలు విషం చిమ్ముతున్నాయని ఆయన అంటున్నారు. ఈ రోజు వాలంటీర్లను పక్కన పెట్టినా ప్రభుత్వం లబ్దిదారుల శ్రేయస్సు దృష్ట్యా ఆల్టరేషన్ చూస్తోందని ఆయన అన్నారు. మొత్తానికి సచివాలయాల ద్వారా వాలంటీర్లకు పెన్షన్లు అందుతాయి.

అయితే వారు అక్కడికి వెళ్లి తెచ్చుకోవాలి. కొంత వ్యయ ప్రయాస తప్పదు. అయితే పెద్దలు వృద్ధులలో ఈ రకంగా ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే వారి పక్షం ఉంటూ వైసీపీ టీడీపీ మీద విమర్శలు చేస్తోంది. టీడీపీని గట్టిగా టార్గెట్ చేస్తోంది. దీని వల్ల టీడీపీని పూర్తిగా ఇరకాటంలోకి పెడుతోంది. ఏది ఏమైనా వాలంటీర్ల వ్యవస్థ ఇపుడు ఏపీ పాలిటిక్స్ లో బర్నింగ్ టాపిక్ గా ఉంది. ఇది ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావితం చేస్తుందో చూడాలని అంటున్నారు.