Begin typing your search above and press return to search.

జనసేన నేతపై ఫిర్యాదు... చంద్రబాబు స్పందిస్తారా?

అవును.. ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో పర్యటించిన సంగతి తెలిసిందే! ఈ సమయంలో స్థానిక కూటమి నేత ఒకరిపై సాక్ష్యత్తు ముఖ్యమంత్రికే ఫిర్యాదు అందిందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   8 Dec 2024 5:30 PM GMT
జనసేన నేతపై ఫిర్యాదు... చంద్రబాబు స్పందిస్తారా?
X

కూటమి ప్రభుత్వంలో పెద్దలంతా ఐకమత్యంతో కలిసి పని చేస్తుంటే.. కిందిస్థాయి నేతల్లో మాత్రం ఐకమత్యం, కలుపుకుపోయే తత్వం కొరవడుతుందని.. ఫలితంతా ఇంటర్నల్ సమస్యలు వస్తే పర్లేదు కానీ.. ప్రజల నుంచే ఫిర్యాదులు వచ్చే పరిస్థితి నెలకొందనే చర్చ తెరపైకి వచ్చింది! ఈ నేపథ్యంలో జనసేన నేతపై బాబుకు ఫిర్యాదు అందిందని తెలుస్తోంది.

అవును.. ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో పర్యటించిన సంగతి తెలిసిందే! ఈ సమయంలో స్థానిక కూటమి నేత ఒకరిపై సాక్ష్యత్తు ముఖ్యమంత్రికే ఫిర్యాదు అందిందని అంటున్నారు. ఇందులో భాగంగా... జనసేన పార్టీకి చెందిన కార్పొరేటర్ ఒకరు చేసిన పనివల్ల తామంతా రోడ్డున పడ్డామంటూ తోపుడు బండ్ల సంఘం ప్రతినిధులు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.

ఈ సందర్భంగా... తాము ఓట్లేసి కార్పొరేటర్ గా గెలిపిస్తే.. ఆయనే తమ పొట్ట కొట్టారని.. హైకోర్టులో పిటిషన్ వేసి తోపుడు బండ్లను తొలగించారని.. ఫలితంగా తామంతా ఉపాధి కోల్పోయి, రోడ్డున పడ్డామని.. ఈ విధంగా సదరు కార్పొరేటర్ తమ కడుపుపై కొట్టాడని చంద్రబాబుకు ఫిర్యాదు చేశారని అంటున్నారు.

ఇదే సమయంలో... ఈ జనసేన నేతే మళ్లీ ఓట్ల కోసం తమ వద్దకే రావాలని తోపుడు బళ్ల సంఘం సభ్యులు అంటున్నారని తెలుస్తోంది. నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు తగిన బుద్ధి చెప్పారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. అందరిమీద కోర్టులో కేసులు వేయడం ఆయనకు బాగా అలవాటని, ఇలా పేదల బ్రతుకులు చిద్రం చేయడం సరైంది కాదని వాపోయారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే... తమను ఆదుకోవాలని బాబును కోరారని అంటున్నారు. ఈ నేపథ్యంలో... వీరి ఆవేదనను, ఫిర్యాదును, పరిస్థితిని బాబు ఏ మేరకు అర్ధం చేసుకుంటారు.. వీరి సమస్యను ఏ రీతిగా పరిష్కరిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి జనసేన కార్పొరేటర్ పై వచ్చిన ఫిర్యాదుపై బాబు స్పందిస్తారా.. స్పందిస్తే ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాలి!