Begin typing your search above and press return to search.

కోర్టు సీరియస్... కునుకు తీశారని అంత పెద్ద పనిష్మెంటా?

దీనికి సంబంధించి పలు ఆసక్తికర సర్వేలూ వచ్చాయి.

By:  Tupaki Desk   |   25 Nov 2024 2:30 PM GMT
కోర్టు సీరియస్... కునుకు తీశారని  అంత పెద్ద పనిష్మెంటా?
X

సాధారణంగా ఆఫీస్ అవర్స్ లో కునుకు రావడం అత్యంత సహజమైన విషయాల్లో ఒకటని అంటారు. ప్రధానంగా డే టైం డ్యూటీ చేసేవాళ్లకు మధ్యాహ్యం లంచ్ చేసిన తర్వాత.. అప్పటి వరకూ డే డ్యూటీ చేసేవారికి ఒక్కసారిగా నైట్ డ్యూటీ చేయాల్సి వచ్చినవారిలోనూ ఈ తరహా సమస్య కనిపిస్తుంటుంది. దీనికి సంబంధించి పలు ఆసక్తికర సర్వేలూ వచ్చాయి.

ఇందులో భాగంగా... ఆఫీసు అవర్స్ లో ఓ గంట పడుకోడానికి సమయం ఇస్తే.. ఓ గంట ఎగస్ట్రా పని చేస్తామని సుమారు 49శాతం మంది అంగీకరించారని.. ఆఫీసు టైంలో పడుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుందని 78% మంది పేర్కొన్నారని చెబుతారు. అయితే.. ఆఫీసులో కునుకు తీశాడని క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చింది ఓ సంస్థ. దీనిపై కోర్టు సీరియస్ అయ్యింది.

అవును... ఆఫీసులో కాసేపు కునుకు తీశాడని క్యాపిటెల్ పనిష్మెంట్ ఇచ్చింది ఓ కంపెనీ. ఇందులో భాగంగా.. సుమారు 20 ఏళ్లుగా ఆ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగిని విధుల నుంచి తొలగించింది. దీంతో సదరు ఉద్యోగి.. కోర్టును ఆశ్రయించాడు. ఈ వ్యవహారంలో సంస్థ తీరుపై సీరియస్ అయిన న్యాయస్థానం భారీ ఫైన్ విధించింది.

వివరాళ్లోకి వెళ్తే... చైనాలోని జియాంగ్షు ప్రావిన్స్, టైజింగ్ లో ఓ ఘటన జరిగింది. ఇందులో భాగంగా... టైజింగ్ లోని ఓ కెమికల్ కంపెనీలో ఝాంగ్ అనే వ్యక్తి 20 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. పైగా.. కంపెనీలో నిబద్ధత కలిగిన ఉద్యోగిగా ఆయనకు పేరుంది. ఈ సమయంలో నైట్ డ్యూటీ చేస్తున్న ఝాంగ్ తన డెస్క్ పైనే చిన్న కునుకు తీశాడు.

ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇక వీటిని చూసిన హెచ్.ఆర్.డిపార్ట్ మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సుమారు గంటపాటు నిద్రపోయాడని.. ఇవి కంపెనీ డిసిప్లిన్ పాలసీకి విరుద్ధమని పేర్కొంటూ నోటీసులు ఇచ్చి, ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో ఝాంగ్ వెంటనే కోర్టును ఆశ్రయించారు.

ఈ వ్యవహారంపై స్పందించిన న్యాయస్థానం కంపెనీపై సీరియస్ అయ్యింది. కాసేపు కునుకుతీసినంత మాత్రాన్న ఉద్యోగం నుంచి తొలగించేస్తారా అంటూ సదరు కంపెనీకి చివాట్లు.. 3.5 లక్షల యువాన్లు (సుమారు రూ.40.78 లక్షలు) ఫైన్ విధించింది. అతను కాసేపు కునుకు తీయడం వల్ల కంపెనీకి తీవ్రమైన నష్టం ఏమి జరిగిందని ప్రశ్నించింది.