Begin typing your search above and press return to search.

జగన్ కంటే ముందే బాబు ఇంటర్నేషనల్!

ముఖ్యమంత్రి చంద్రబాబు మీద వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని పవర్ ఫుల్ సెటైర్లు పేల్చారు.

By:  Tupaki Desk   |   23 Nov 2024 3:41 AM GMT
జగన్ కంటే ముందే బాబు ఇంటర్నేషనల్!
X

ముఖ్యమంత్రి చంద్రబాబు మీద వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని పవర్ ఫుల్ సెటైర్లు పేల్చారు. అలాగే టీడీపీ అనుకూల మీడియా మీద హాట్ కామెంట్స్ చేశారు. జగన్ ని అమెరికా పోలీసులు అరెస్ట్ చేస్తారని ఆయన అవినీతి ఇంటర్నేషనల్ అయింది అని ఇష్టం వచ్చినట్లుగా రెందు పత్రికలు పది చానళ్ళు రాతలు వస్తున్నాయని ఆయన ఫైర్ అయ్యారు.

కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి జగన్ విద్యుత్ ఒప్పందం చేసుకుంటే అదానితో ఒప్పందం అని ఎలా అంటారని ప్రశ్నించారు. అమెరికా పోలీసులే విచారణకు వస్తే కేంద్ర ప్రభుత్వ సంస్థలను విచారిస్తారు తప్పించి జగన్ ని ఎందుకు అరెస్ట్ చేస్తారు అని ఆయన నిలదీశారు.

ఇకపోతే 2021లో వైసీపీ ప్రభుత్వం యూనిట్ 2.49 రూపాయలకు సెకీతో కరెంటు కొనుగోలు మీద ఒప్పందం చేసుకుందని అన్నారు. అది కూడా 2016లో చంద్రబాబు చేసుకున్న 4.50 రూపాయలు యూనిట్ కి అన్న దాని కంటే తక్కువకే చేసుకుందని గుర్తు చేశారు. సెకీ తో ఒప్పందం కుదిరింది తప్ప అదానీతో కాదని ఆయన అన్నారు.

ఈ విషయంలో జగన్ ఏకంగా 1,750 కోట్ల రూపాయలు అవినీతి చేశారని తప్పుడు రాతలు రాస్తున్నారు అని పేర్ని నాని మండిపడ్డారు. జగన్ అవినీతి ఇంటర్నేషనల్ గా మారుమోగుతోందని రాయడం కరెక్టేనా అన్నారు. అమరావతి రాజధాని విషయంలో ఒప్పందాలు చేసుకున్న సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్ ఇపుడు జైలులో ఉన్నారన్నది తెలియదా అని ప్రశ్నించారు. ఆ లెక్కన చంద్రబాబు ఏనాడో ఇంటర్నేషనల్ అయ్యారు కదా అని పేర్ని నాని సెటైర్లు వేశారు.

ఏపీలో 2014 నుంచి 2019 దాకా అదానీతో చంద్రబాబు అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నారని అనాడు భారీ పెట్టుబడులు వచ్చాయని రాతలు రాయలేదా అని ప్రశ్నించారు. అదే అదానీతో జగన్ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటే దోపిడీ అని రాసిందీ వీళ్లే అన్నారు. ఇపుడు చూస్తే మళ్లీ అదానీతో ఒప్పందాలను టీడీపీ కూటమి ప్రభుత్వం చేసుకోలెదా అని పేర్ని నాని ప్రశ్నించారు

ఇక జగన్ పేరుతో గతంలోనూ విదేశీ పత్రికలు రాశాయని తప్పుడు రాతలు టీడీపీ అనుకూల మీడియా రాస్తూ వచ్చిందని వారికి ఇదేమీ కొత్త కాదని పేర్ని నాని అన్నారు. అయినా సరే నడు వీళ్ళంతా కలసి ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదని, జగన్ నే ముఖ్యమంత్రిగా గెలిపించారని పేర్ని నాని గుర్తు చేశారు.

ఇక ఎంత కుట్ర చేసినా జగన్ కి 40 శాతం ఓటు షేర్ 2024 లో వచ్చిందని అందుకే ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకే ఈ రాతలు అని అన్నారు. 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు విద్యుత్ సంస్థలకు 22 వేల కోట్ల నష్టాలను మిగిల్చి 56 వేల కోట్లు అప్పుల భారం మోపీ సర్వ నాశనం చేశారని పేర్ని నాని విమర్శించారు. జగన్ హయాంలో విద్యుత్ సంస్థల నష్టాలు 380 కోట్లేనని అలాగే 36 వేల కోట్లే అప్పులు ఉన్నాయని చెప్పారు.

సంపద సృష్టి అంటే ఇదేనని చంద్రబాబు చేసినది కాదని అన్నారు. ఆరు నెలలు తిరగకుండానే ఏపీకి 50 వేల కోట్ల అప్పులు పెట్టి ప్రజల మీద 17 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని మోపిన చంద్రబాబు సంపదని ఇలాగే సృష్టిస్తారా అని నాని నిలదీశారు.

చంద్రబాబు ఆనాడు జగన్ పాలనలో బాదుడే బాదుడు అని ఊరూరా తిరిగారని కానీ ఇపుడు చూస్తే నిత్యావసర వస్తువుల ధరలతో పాటు అన్నీ బాదుడేనని ఆయన మండిపడ్డారు. ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయకుండా ఏపీలో ప్రైవేట్ విధానం అంటూ ఉన్న వనరులను వారికి దోచిపెట్టే కార్యక్రమం చేస్తున్నారు అని పేర్ని నాని విమర్శించారు.