"విజయమ్మ.. సుబ్బారెడ్డి.. బాలినేని అందుకు సరిపోతారా?"... నాని కీలక ప్రశ్న!
ఏపీలో రాజకీయాలో వైఎస్ కుటుంబ సభ్యుల ఆస్తుల వ్యవహరం ఇప్పుడు అటు మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 28 Oct 2024 2:47 PM GMTఏపీలో రాజకీయాలో వైఎస్ కుటుంబ సభ్యుల ఆస్తుల వ్యవహరం ఇప్పుడు అటు మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అటు నుంచి షర్మిల ఒకటి అంటే.. ఇటు వైసీపీ నేతల నుంచి నాలుగు పడుతున్నాయి. వాటికి తిరిగి ఆమె తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తున్నారు.
‘పెదరాయుడు’ సినిమాలో రజనీకాంత్ లా జగన్.. ‘వీరసింహారెడ్డి’ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్రలా షర్మిలా వ్యవహారం ఉందంటూ సింగిల్ లైన్ లో కన్ క్లూజన్ ఇచ్చేస్తున్నారు వైసీపీ నేతలు. తల్లిపై కోర్టులో కేసు వేసిన కొడుకుగా జగన్ నిలిచిపోతారన్నట్లు షర్మిళ కూడా సింగిల్ లైన్ పైనే కీలకంగా వాఖ్యానిస్తున్నారు.
ఈ సమయంలో పలువురు వైసీపీ నేతలు ఈ వ్యవహారంపై స్పందించగా.. తాజాగా వైఎస్ ఫ్యామిలీకి బందువు, మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాస రెడ్డి ఈ వ్యవహారంపై స్పందించారు. ఈ సమస్య పరిష్కారం కోసం వైఎస్ విజయమ్మ ముందుకు రావాలని.. ఇద్దరికీ న్యాయం చేయాలని సూచించారు.
ఇదే సమయంలో... తానైనా, ఇతరులు అయినా ఈ విషయంలో జోక్యం చేసుకోవడం మంచిది కాదని అన్నారు. ఇక.. తాను ఏ పార్టీలో ఉన్నా.. వైఎస్సార్ కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. దీంతో... ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని స్పందించారు.
అవును.. జగన్ - షర్మిల ఆస్తుల వ్యవహారంపై బాలినేని వ్యాఖ్యానించిన వేళ పేర్ని నాని స్పందించారు. ఇందులో భాగంగా... జగన్ - షర్మిల మధ్య నెలకొన్న వివాదం విషయంలో... అటు విజయమ్మ, వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి జడ్జిలుగా ఉంటానికి సరిపోతారా అని ప్రశ్నించారు.
విజయమ్మ అటు పక్క, సుబ్బారెడ్డి ఇటు పక్క, బాలినేనేమో పవన్ కల్యాణ్ పక్క ఉన్నారని.. వీళ్లు ముగ్గురూ జడ్జిలుగా ఉంటానికి సరిపోతారా అని ప్రశ్నించారు. జడ్జి అంటే మధ్యలో ఉండాలని అన్నారు.
ఇదే సమయంలో... ఈ పార్టీ వద్దు అని వెళ్లిపోయిన బాలినేని ఇప్పుడు పెద్ద మనిషి అవతారం ఎందుకు ఎత్తారు? అవసరాల కోసం చేసే రాజకీయాలే ఇప్పుడు కనిపిస్తున్నాయి. రాజకీయాల కోసం ఏదైనా మాట్లాడతారు.. ఇప్పుడు జనసేనలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీ లైన్ లో మాట్లాడుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు!