పేర్ని కిట్టుపై చంద్రబాబు విమర్శలు... నాని నిప్పులు!
అయినప్పటికీ... చంద్రబాబు లాంటి, కొల్లు రవీంద్రలాంటి పాపబీతి లేని దుర్మార్గులు ఉన్నంత మాత్రాన్న వాళ్లకు జడిసి నేను ప్రజాసేవ మానుకుంటానా అని తన కుమారుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టాడని వెల్లడించారు.
By: Tupaki Desk | 18 April 2024 12:17 PM GMTబందరులో జరిగిన కూటమి ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు & కో చేసిన విమర్శలపై తాజాగా మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని స్పందించారు. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన ఆయన... చంద్రబాబు నోరు తెరిస్తే అబద్దాలు బొంకడమే అంటూ స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా... శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులు జగన్ టిక్కెట్ ఎందుకు ఇచ్చారంటూ ప్రశ్నించిన బాబుకు సమాధానం చెప్పారు.
ఇందులో భాగంగా... 1995 నుంచి తోట త్రిమూర్తులు టీడీపీలోనే ఉన్నారని.. నాటి నుంచి 2020 వరకూ బాబుతో కలిసే రాజకీయాలు చేస్తున్నారని.. ఈ విషయం ప్రజలకు తెలియదన్నట్లుగా చంద్రబాబు బొంకుతున్నారని నాని ఫైర్ అయ్యారు. ఇదే సమయంలో 1996లో ఈ కేసులో తోట త్రిమూర్తులు నిందితుడిగా ఉన్నప్పటికీ తర్వాత రెండు సార్లు చంద్రబాబు టిక్కెట్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు! ఈ తరహా రాజకీయాలు చంద్రబాబుకు మాత్రమే సాధ్యమని అన్నారు.
ప్రజాసేవ చేయాలనే బలమైన ఆకాంక్షతో రాజకీయాల్లోకి వచ్చి సుమారు నాలుగేళ్లుగా ప్రజాసేవలో ఉన్నటున్న... కరోనా సమయంలో చంద్రబాబుతో పాటు కొల్లు రవీంద్ర, టీడీపీ నెతలు ఇంట్లో పడుకుంటే.. ప్రాణాలకు తెగించి తన కుమారుడు పేర్ని కిట్టు పనిచేశారని తెలిపారు. బందరులోని ఏ కరోనా పేషెంట్ ని అడిగా కూడా తన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి సేవల గురించి మాట్లాడతారని స్పష్టం చేశారు.
కరోనా కష్టకాలంలో తన కుమారుడు ఎంతో సేవ చేస్తే... నూనూగు మీసల నవ యువకుడు ఎంతో కష్టపడి ప్రజాసేవ చేస్తుంటే, ఆయన సేవలను ప్రజలు గుర్తిస్తే, 75ఏళ్ల వయసొచ్చిన చంద్రబాబు ఇంతటి పాపపు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తన కుమారుడు రాజకీయాల్లోకి వస్తానని చెప్పినప్పుడు... చంద్రబాబు లాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉంటారని తాము చెప్పినట్లు నాని వెల్లడించారు.
అయినప్పటికీ... చంద్రబాబు లాంటి, కొల్లు రవీంద్రలాంటి పాపబీతి లేని దుర్మార్గులు ఉన్నంత మాత్రాన్న వాళ్లకు జడిసి నేను ప్రజాసేవ మానుకుంటానా అని తన కుమారుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టాడని వెల్లడించారు. ఇదే సమయంలో తన కొడుకు గంజాయి అమ్మేవాడిలా కనిపిస్తున్నాడా అని ప్రశ్నించిన పేర్ని నాని... అలాంటి వ్యక్తిపై చంద్రబాబు దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.