Begin typing your search above and press return to search.

తన కుమారుడు టికెట్‌ విషయంలో పేర్నినాని కీలక వ్యాఖ్యలు!

ఈ సందర్భంగా బందరు నియోజకవర్గంపై స్పందించిన పేర్ని నాని... తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని మరోసారి స్పష్టం చేశారు. అయితే తన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి జనాల్లో తిరుగుతున్నాడని తెలిపారు.

By:  Tupaki Desk   |   12 Dec 2023 12:48 PM GMT
తన కుమారుడు టికెట్‌  విషయంలో పేర్నినాని కీలక వ్యాఖ్యలు!
X

తెలంగాణలో ఎన్నికలు ముగిసిన అనంతరం ఏపీలో ఎన్నికల రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ - జనసేనలో పొత్తులో భాగంగా వ్యూహాలు రచిస్తుండగా... మరోపక్క వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ సమయంలో నిర్ధేశించుకున్న లక్ష్యం "వైనాట్ 175" దృష్ట్యా పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సమయంలో ప్రధానంగా ఇన్ ఛార్జ్ ల మార్పుపై దృష్టిపెట్టినట్లు తెలుస్తుంది. ఈ సమయంలో పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా అధికార వైసీపీ ఇప్పటికే సన్నాహాలను ప్రారంభించింది. ఇందులో భగంగా... అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పలు నియోజకవర్గాల ఇన్‌ ఛార్జిలను మార్చింది. దీంతో... ప్రస్తుతానికి 11 నియోజకవర్గాల్లో ఇన్‌ ఛార్జ్‌ లను మార్చుతూ పార్టీ అధిష్టాణం ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. మార్పులు, చేర్పులన్నవి ప్రతీ రాజకీయ పార్టీలో సహజమని అన్నారు.

తాజాగా పార్టీలో జరుగుతున్న కీలక పరిణామాలపై స్పందించిన ఆయన... పార్టీకి మేలు చేసే నిర్ణయాలనే ప్రతీ అధినాయకత్వం తీసుకుంటుందని, వైసీపీలో కూడా అంతేనని పేర్ని నాని తెలిపారు. ఈ క్రమంలో 175కి 175 గెలవాలనే లక్ష్యంతో జగన్‌ పనిచేస్తున్నారని.. మార్పులు చేర్పులు చేస్తున్నారని తెలిపారు. ఆ మార్పులకు కేవలం సర్వేలే ప్రాతిపదిక కాదని.. కేడర్ అభిప్రాయలతోపాటు మరికొన్ని సమీకరణాల నేపథ్యంలో మార్పులు ఉంటున్నాయని అన్నారు.

ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ప్రధానంగా అటు ఎంపీ, ఇటు ఎమ్మెల్యే టికెట్లలో బీసీలకు ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. దాని ప్రకారమే వైఎస్ జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. ప్రధానంగా జనాభా దామాషా ప్రకారం టిక్కెట్లు ఇచ్చే దిశగా ముందుకు వెళ్తున్నారని. ఇదే సమయంలో మహిళలకు ఎక్కువ సీట్లు ఇవ్వబోతున్నారని తెలిపారు.

ఈ సమయంలో ఆజిల్లా ఈ జిల్లా అనే తారతమ్యాలేమీ లేవని... 175 కి 175 గెలవడం కోసం ఏ నియోజకవర్గంలో ఎలాంటి మార్పు అవసరమైతే ఆ మార్పు జగన్ తీసుకుంటారని అన్నారు. ఈ సందర్భంగా బందరు నియోజకవర్గంపై స్పందించిన పేర్ని నాని... తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని మరోసారి స్పష్టం చేశారు. అయితే తన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి జనాల్లో తిరుగుతున్నాడని తెలిపారు.

ఈ సమయంలో నిర్ధేశించుకున్న లక్ష్యంలో భాగంగా 175 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గంలో గెలవడానికి అతను సరిపోతాడనుకుంటే జగన్ మోహన్ రెడ్డి టిక్కెట్ ఇస్తారని తెలిపారు! ఇదే సమయంలో తన కుమారుడికి కాకుండా మరెవరికి ఇచ్చినప్పటికీ జెండా మోసే కార్యకర్తగా తాను పనిచేస్తానని పేర్ని నాని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ క్రమంలో జగన్ పై తనవైపు నుంచి ఒత్తిడి ఏమీ లేదని... అసలు తన కుమారుడికి టిక్కెట్ విషయంలో తానెప్పుడూ జగన్ వద్ద ప్రస్థావించలేదని పేర్ని స్పష్టం చేశారు.