వైఎస్ షర్మిలపై పేర్ని నాని సెటైర్స్... తెరపైకి పాల్, పవన్ !
దీంతో ఇప్పుడు ఏపీలో పొలిటికల్ వార్... వైసీపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా మరిపోయింది!
By: Tupaki Desk | 25 Jan 2024 11:43 AM GMTఏపీలో ఇప్పుడు టాపిక్ వైసీపీ వర్సెస్ టీడీపీ-జనసేన స్థానంలో వైసీపీ వర్సెస్ షర్మిల అనే రాజకీయం నడుస్తుంది. ప్రస్తుతం చంద్రబాబు సైలంట్ గా కనిపిస్తున్నారు.. పవన్ అసలు కనిపించడమే లేదని అంటున్నారు! ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టినప్పటినుంచీ షర్మిల ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. ఏపీ ప్రభుత్వాన్ని, జగన్ ను విమర్శించే విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఏపీలో పొలిటికల్ వార్... వైసీపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా మరిపోయింది!
ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు షర్మిళపై విరుచుకుపడుతున్నారు. ఇందులో భాగంగా ఏపీలో ఉన్న అభివృద్ధి కనిపించడం లేదా అంటూ ఒకరు ప్రశ్నిస్తే... తమతో వస్తే చూపిస్తామని మరొకరంటున్నారు. ఇదే సమయంలో షర్మిల.. జగన్ వదిలిన బాణం కాదని రాహుల్ వదిలిన బాణం అని ఒకరంటే... ఆమె ఇకపై తమకు రాజన్న కూతురు కాదు.. సోనియా పెంపుడు కూతురు అని మరొకరు ఫైరవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పేర్ని నాని రియాక్ట్ అయ్యారు.
గతకొన్ని రోజులుగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై చేస్తున్న విమర్శలపైనా.. కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబాన్ని ఏమీ ఇబ్బందిపేట్టలేదంటూ చేస్తున్న కామెంట్లపైనా పేర్ని నాని స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తన అన్నను, తన కుటుంబాన్ని ఇబ్బందిపెట్టిందని గతంలో షర్మిలే పలుమార్లు చెప్పారని.. ఆ విషయం ఆమె మరిచిపోయినట్లున్నారని గుర్తుచేసే ప్రయత్నం చేశారు పేర్ని నాని!
ఇదే సమయంలో “గతంలో తెలంగాణలో ఉంటూ... తాను ఆడపిల్లనని, తాను తెలంగాణకు విడదీయలేని బంధమని, అవసరమైతే అక్కడే చనిపోతాను అన్న రేంజ్ లో మాట్లాడిన షర్మిల.. ఇప్పుడు తాను ఈడ పిల్లను అంటుంది.. ఆమె ఏడ పిల్లో ఆమెనే తేల్చుకోనివ్వండి” అని చెప్పిన పేర్ని నాని... “ఆవిడగారు, కేఏ పాల్ గారు, పవన్ కల్యాణ్ గారు ఏది మాట్లాడినా అది వాళ్లకే చెళ్లుతుంది” అని తనదైన శైలిలో స్పందించారు.
గంటా శ్రీనివాస్... సీతయ్య!:
తాజాగా స్పీకర్ గంటా శ్రీనివాస్ రాజీనామాను ఆమోదించడంపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపైనా పేర్ని స్పందించారు. ఇందులో భాగంగా... గంటాను నమ్ముకుంటే మునిగిపోతామన్న విషయం వాళ్లకు కూడా తెలుసని అన్నారు.. గంటాకు చంద్రబాబు టిక్కెట్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. అసలు టీడీపీలో గంట మోగుతుందో తెలియదని.. దానికోసం ఇంత రాద్ధాంతం అవసరం లేదు అన్నట్లుగా పేర్ని స్పందించారు.
ఇదే సమయంలో... రాజీనామా సమర్పించిన అనంతరం గంటానే తన రాజీనామాను ఆమోదించమని స్పీకర్ చుట్టూ పదిసార్లు తిరిగారని.. అయితే అలాంటిపని వద్దని, కాగితం వెనక్కి తీసుకోవమని తన శాయసక్తులా కృషి చేసినట్లు స్పీకర్ తెలిపారని.. ఆ సమయంలో "లేదు సీతయ్యను నేను.. ఎవడి మాటా వినను" అన్నట్లుగా గంటా చెప్పారని.. ఇప్పుడు తీరా ఆమోదించాక ఈ రచ్చ ఎంటని నాని ప్రశ్నించారు.